రోల్స్ రాయిస్ విడుదల చేయనున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'Spectre'.. ఇదే: చూసారా..!!

ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య దినిదినమూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికి కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఊసే లేని బ్రిటీష్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'రోల్స్ రాయిస్' (Rolls Royce) మొదటి సారిగా ఒక కొత్త ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

రోల్స్ రాయిస్ విడుదల చేయనున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'Spectre'.. ఇదే: చూసారా..!!

'రోల్స్ రాయిస్' (Rolls Royce) కంపెనీ ఆవిష్కరించిన కొత్త ఎలక్ట్రిక్ కారు పేరు 'స్పెక్టర్‌' (Spectre). అయితే ఇది రెండు-డోర్ల ఎలక్ట్రిక్ కూపే. కాగా ఇందులో నాలుగు సీట్లు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్ల తయారీకి ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి పూనుకోవడం కస్టమర్లకు గొప్ప శుభవార్త అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న కస్టమర్లు రాబోయే రోజుల్లో రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కార్లను డ్రైవ్ చేయగలరు.

రోల్స్ రాయిస్ విడుదల చేయనున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'Spectre'.. ఇదే: చూసారా..!!

మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది చూడగానే ఆకర్శించే విధంగా డిజైన్ చేయబడి ఉంటుంది. ఇది పొడవైన బోనెట్, క్లీన్ ప్రొఫైల్ మరియు ఫాస్ట్‌బ్యాక్ టైల్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా ముందుభాగంలో విశాలమైన గ్రిల్‌, రాత్రి సమయంలో కూడా మరింత ప్రకాశవంతమైన లైటింగ్ కోసం ఎల్ఈడీ లైట్స్ వంటివి ఉన్నాయి.

రోల్స్ రాయిస్ విడుదల చేయనున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'Spectre'.. ఇదే: చూసారా..!!

కొత్త రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే మార్కెట్లో ఉన్న మెర్సిడెస్ EQS కంటే 5.45 మీటర్ల పొడవు & 2 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది. కావున తప్పకుండా ఇది ఆధునిక లగ్జరీ అనుభూతిని అందిస్తుంది.

రోల్స్ రాయిస్ విడుదల చేయనున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'Spectre'.. ఇదే: చూసారా..!!

స్పెక్టర్ మూడు విభిన్న రేఖల ద్వారా వర్గీకరించబడింది. అవి లుగా ఉండే రూఫ్‌లైన్, షోల్డర్ లైన్ మరియు బేస్ వద్ద వాఫ్ట్ లైన్. ఇవన్నీ కూడా దీనికి మరింత ఆకర్షణను తీసుకువస్తుంది. సైడ్ ప్రొఫైల్ లో 23 ఇంచెస్ వీల్స్ వంటివి ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ లో ఫాస్ట్‌బ్యాక్ టెయిల్ వంటివి అద్భుతంగా అమర్చబడి ఉన్నాయి.

రోల్స్ రాయిస్ విడుదల చేయనున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'Spectre'.. ఇదే: చూసారా..!!

రోల్స్ రాయిస్ స్పెక్టర్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. ఇది చాలా వరకు ఇప్పటికే అందుబాటులో ఉన్న రోల్స్ రాయిస్ ఘోస్ట్‌ని పోలి ఉంటుంది. రూఫ్‌పై మాత్రమే అందించబడిన స్టార్‌లైట్ లైనర్ ఇప్పుడు డోర్ ప్యాడ్‌లలో కూడా చేర్చబడింది.

రోల్స్ రాయిస్ విడుదల చేయనున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'Spectre'.. ఇదే: చూసారా..!!

ఇందులోని డ్యాష్‌బోర్డ్ ప్యానెల్ 'స్పెక్టర్' నేమ్‌ప్లేట్‌తో చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. దాని చుట్టూ దాదాపు 5,500 స్టార్స్ లాంటి ఇల్యూమినేషన్‌లు ఉన్నాయి. సీట్లు కూడా చాలా కొత్తవిగా ఉంటాయి, కాకపోతే సీట్లు ఎక్స్టీరియర్ కలర్ పొందుతాయి. కావున మరింత అట్రాక్టివ్ లుక్ ఇస్తాయి.

రోల్స్ రాయిస్ విడుదల చేయనున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'Spectre'.. ఇదే: చూసారా..!!

రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఆల్-అల్యూమినియం స్పేస్ ఫ్రేమ్ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడింది. దీనిని ఆర్కిటెక్చర్ ఆఫ్ లగ్జరీ అని పిలుస్తారు. ఈ ప్లాట్‌ఫారమ్ పైన ప్రస్తుత ఫాంటమ్, కల్లినన్ మరియు ఘోస్ట్‌ వంటివి ఆధారపడి రూపొందించబడ్డాయి. కాగా ఇప్పుడు రానున్న స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారు మునుపటి మోడల్స్ కంటే 30 శాతం దృఢమైనదని కంపెనీ తెలిపింది.

రోల్స్ రాయిస్ విడుదల చేయనున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'Spectre'.. ఇదే: చూసారా..!!

రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే చాలా సార్లు పరీక్షించబడింది. అయితే ఇప్పుడు ఇది చివరి దశలో ఉన్నట్లు సమాచారం. కావున ఇంకా తుది గణాంకాలు వెల్లడి కాలేదు. అయినప్పటికీ ఇది 520 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ 585 హెచ్‌పి మరియు 900 ఎమ్ఎమ్ వరకు ఉన్నాయి. అదే సమయంలో ఇది కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. దాదాపు ఈ ఎలక్ట్రిక్ కారు బరువు 3 టన్నుల వరకు ఉంటుంది.

రోల్స్ రాయిస్ విడుదల చేయనున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'Spectre'.. ఇదే: చూసారా..!!

రోల్స్ రాయిస్ యొక్క మొదటి ఎలక్ట్రిక్ కారు యొక్క టెస్టింగ్ 2023 రెండవ త్రైమాసికంలో ముగిసే అవకాశం ఉంది. అప్పటికి దీనికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడవుతాయి. కాగా 2023 నాలుగవ త్రైమాసికంలో గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధరలు కలినన్ కంటే ఎక్కువ, ఫాంటమ్ కంటే తక్కువ ఉండే అవకాశం ఉంటుంది.

రోల్స్ రాయిస్ విడుదల చేయనున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'Spectre'.. ఇదే: చూసారా..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఇప్పటికే దాదాపు అన్ని కార్ల ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, అయితే ఇప్పటి వరకు రోల్స్ రాయిస్ యొక్క ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో లేదు. మార్కెట్లో ఇక ఈ కొరత త్వరలోనే తీరిపోతుంది. అయితే ప్రపంచ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు ఎలాంటి ఆదరణ పొందుతుంది, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, October 19, 2022, 15:33 [IST]
English summary
Rolls royce revealed spectre electric coupe range features and details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+