హతవిధీ.. Scorpio-N డెలివరీలు ప్రారంభమైన రెండవ రోజే సమస్య: కంపెనీ ఎలా స్పందిస్తుందో మరి?

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థల్లో ఒకటి. దీనికి ప్రధాన కారణం కంపెనీ యొక్క వాహనాలపైన ప్రజలకు ఉన్న నమ్మకమే అని చెప్పాలి. అయితే ఇటీవల కంపెనీ మార్కెట్లో కొత్త స్కార్పియో-ఎన్ అనే కొత్త SUV లాంచ్ చేసింది, ఇప్పుడు డెలివరీలు కూడా ప్రారంభమైపోయాయి. డెలివరీ తీసుకున్న రెండవ రోజే వాహనంలో ఒక సమస్య వచ్చినట్లు ఒక కస్టమర్ పిర్యాదు చేశారు. ఇంతకీ కొత్త స్కార్పియో-ఎన్ లో వచ్చిన సమస్య ఏమిటి? దానికి కంపెనీ ఎలా స్పందించింది.. అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

హతవిధీ.. Scorpio-N డెలివరీలు ప్రారంభమైన రెండవ రోజే సమస్య: కంపెనీ ఎలా స్పందిస్తుందో మరి?

మహీంద్రా కంపెనీ తన స్కార్పియో-ఎన్ డెలివరీలను ఈ నెల 26 నుంచి ప్రారంభించింది. అయితే డెలివరీ తీసుకున్న రెండవ రోజే 'శిఖా శ్రీవాస్తవ' అనే కస్టమర్ తన కొత్త స్కార్పియో-ఎన్ లో క్లచ్ మరియు గేర్ ఇరుక్కుపోయి పనిచేయడం లేదని పిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసి 'ఆనంద్ మహీంద్రా, అనీష్ షా, మహీంద్రా స్కార్పియో మరియు ఏ టు జెడ్ ఆటోవీల్స్' ని ట్యాగ్ చేసింది.

హతవిధీ.. Scorpio-N డెలివరీలు ప్రారంభమైన రెండవ రోజే సమస్య: కంపెనీ ఎలా స్పందిస్తుందో మరి?

ఈ వీడియోలో మీరు గమనించినట్లతే, క్లచ్ పెడల్‌ను లాగడానికి ఆమె తన పాదాలను ఎలా ఉపయోగిస్తుందో కూడా స్పష్టంగా చూడవచ్చు. దీనిపైన కంపెనీ గానీ, కంపెనీ యాజమాన్యం గానీ ఇంకా స్పందించలేదు. తన సమస్యపైన వెంటనే స్పందించాలని ఆమె ట్వీట్ చేస్తూ దానికి సంబంధించిన ఫోటోలను కూడా అప్లోడ్ చేసింది.

హతవిధీ.. Scorpio-N డెలివరీలు ప్రారంభమైన రెండవ రోజే సమస్య: కంపెనీ ఎలా స్పందిస్తుందో మరి?

శిఖా శ్రీవాస్తవ చేసిన ఈ పోస్ట్ లో ఆమె కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ సమస్య వచ్చిందని, ఆ సమయంలో క్లచ్ మరియు గేర్ ఇరుక్కుపోయి పనిచేయకుండా అయిపోయిందని తెలిపింది. అయితే ఇది కొత్త కారు అని తెలియజేయడానికి డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్ కూడా పోస్ట్ చేసింది. ఇందులో ఆమె కేవలం 338 కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది.

హతవిధీ.. Scorpio-N డెలివరీలు ప్రారంభమైన రెండవ రోజే సమస్య: కంపెనీ ఎలా స్పందిస్తుందో మరి?

నిజానికి డెలివరీ తీసుకున్న రెండవ రోజుకే ఈ విధంగా జరగటం చాలా బాధాకరం, అయితే ఇది హైడ్రాలిక్ ప్రెజర్ సమస్య వల్ల జరిగి ఉండవచ్చు. అయితే ఖచ్చితంగా ఇదే జరిగి ఉంటుందని నిర్దారించలేము, కావున కంపెనీ ఈ సమస్యకు తప్పకుండా పరిష్కారం తెలుపుతుంది.

హతవిధీ.. Scorpio-N డెలివరీలు ప్రారంభమైన రెండవ రోజే సమస్య: కంపెనీ ఎలా స్పందిస్తుందో మరి?

మహీంద్రా కంపెనీ గతంలో తన XUV700 కి నాలుగు సార్లు రీకాల్ ప్రకటించింది. ఎందుకంటే వాహనంలోని సమస్యలను తొలగించి రాబోయే ప్రమాదాలను ఆరికట్టడానికి ఈ రీకాల్ ప్రకటించింది. అంతే కాకుండా మహీంద్రా థార్ మరియు XUV300 కోసం కూడా కంపెనీ ఇంతకు ముందు రీకాల్ ప్రకటించింది. కావున మహీంద్రా స్కార్పియో-ఎన్ లో ఏదైనా లోపం ఉంటె తప్పకుండా దానిని కంపెనీ పరిష్కరిస్తుంది.

హతవిధీ.. Scorpio-N డెలివరీలు ప్రారంభమైన రెండవ రోజే సమస్య: కంపెనీ ఎలా స్పందిస్తుందో మరి?

మహీంద్రా కంపెనీ యొక్క కొత్త స్కార్పియో-ఎన్ విషయానికి వస్తే, ఈ SUV ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదలైంది. అంతకు ముందే కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రర్భమైన అతి తక్కువ కాలంలోనే కంపెనీ ఏకంగా ఒక లక్షలు పైగా బుకింగ్స్ స్వీకరించింది.

హతవిధీ.. Scorpio-N డెలివరీలు ప్రారంభమైన రెండవ రోజే సమస్య: కంపెనీ ఎలా స్పందిస్తుందో మరి?

కంపెనీ రెండు రోజులకుముందే డెలివరీ చేయడం ప్రారంభించింది. కంపెనీ మొదట్లో 25,000 యూనిట్లను డెలివరీ చేస్తుంది. అయితే మొత్తం డెలివరీలను చేయడానికి కనీసం 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. కాగా కంపెనీ డెలివరీలను మరింత వేగవంతం చేయడానికి ఉత్పత్తిని కూడా పెంచే అవకాశం ఉంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ మరియు 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ అనే రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులోని మొదటి ఇంజిన్ 175 పిఎస్ పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండవ ఇంజిన్ 203 పిఎస్ పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెదను ఇంజిన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతాయి.

హతవిధీ.. Scorpio-N డెలివరీలు ప్రారంభమైన రెండవ రోజే సమస్య: కంపెనీ ఎలా స్పందిస్తుందో మరి?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మహీంద్రా కంపెనీ యొక్క వాహనాలు మంచి నాణ్యతను కలిగి ఉంటాయి. అయితే ఇప్పుడు కొత్త స్కార్పియో-ఎన్ లో ఏర్పడిన సమస్యను కంపెనీ త్వరలోనే పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాము. కావున స్కార్పియో-ఎన్ కొనుగోలుదారులు నిస్సంకోచంగా ఉండవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, September 29, 2022, 15:26 [IST]
English summary
Scorpio n problem on second day of delivery customer tagged video to anand mahindra details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+