సెప్టెంబర్ 2022 నెలలో హోండా కార్లపై ఫెస్టివ్ ఆఫర్లు: రూ. 27,500 వరకు బెనిఫిట్స్

జపనీస్ కార్ బ్రాండ్ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఈ సెప్టెంబర్ నెలలో తమ కార్లపై ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. ఈ సెప్టెంబర్ 2022 నెలలో హోండా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 27,500 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఏయే మోడల్ ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూద్దాం రండి.

Recommended Video

Honda City eHEV Hybrid Sedan Unveiled | Mileage 26km/l | Level-1 ADAS, Pure EV Mode & More In Telugu

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో జాజ్ హ్యాచ్‌బ్యాక్, అమేజ్ కాంపాక్ట్ సెడాన్, 4వ తరం సిటీ సెడాన్, 5వ తరం సిటీ సెడాన్ మరియు హోండా డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ వాహనాలను విక్రయిస్తోంది. ఈ ఐదు మోడళ్లపై కంపెనీ వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది. వీటిలో హోండా సిటీ 4వ తరం మోడల్ తక్కువ ఆఫర్‌ను కలిగి ఉంది, అయితే హోండా సిటీ 5వ తరం మోడల్ మాత్రం ఉత్తమమైన ఆఫర్‌ను కలిగి ఉంది.

సెప్టెంబర్ 2022 నెలలో హోండా కార్లపై ఫెస్టివ్ ఆఫర్లు: రూ. 27,500 వరకు బెనిఫిట్స్

హోండా సిటీ 5వ తరం (రూ. 27,496 వరకు ప్రయోజనాలు)

మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో హోండా అందిస్తున్న పాపులర్ సెడాన్ 5వ తరం హోండా సిటీ, దాని సెగ్మెంట్లో బెస్ట్ సెల్లర్ గా ఉంది. ఈ కొత్త తరం హోండా సిటీ మునుపటి మోడల్ కన్నా చాలా ఎక్కువ అప్‌మార్కెట్ ఇంటీరియర్‌లను అందిస్తుంది మరియు మరింత ప్రీమియంగా కూడా కనిపిస్తుంది. కంపెనీ ఇటీవల, సిటీ సెడాన్ అమ్మకాలను మరింత మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా, హోండా 5వ తరం హోండా సిటీ సెడాన్ యొక్క హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా మార్కెట్లో విడుదల చేసింది.

సెప్టెంబర్ 2022 నెలలో హోండా కార్లపై ఫెస్టివ్ ఆఫర్లు: రూ. 27,500 వరకు బెనిఫిట్స్

ఈ సెప్టెంబర్ 2022 నెలలో హోండా 5వ తరం సిటీ సెడాన్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 27,496 వరకు విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 5,000 వరకు నగదు తగ్గింపు, రూ. 5,000 విలువైన కార్ల మార్పిడిపై తగ్గింపు, రూ. 5,000 కస్టమర్ లాయల్టీ బోనస్, రూ. 7,000 కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపులు ఉన్నాయి. అయితే, కస్టమర్‌లు క్యాష్ డిస్కౌంట్ (రూ. 5,000)కి బదులుగా రూ. 5,496 విలువైన యాక్సెసరీలను కూడా ఎంచుకోవచ్చు.

సెప్టెంబర్ 2022 నెలలో హోండా కార్లపై ఫెస్టివ్ ఆఫర్లు: రూ. 27,500 వరకు బెనిఫిట్స్

హోండా డబ్ల్యూఆర్-వి (రూ. 27,000 వరకు ప్రయోజనాలు)

యుటిలిటీ వాహన విభాగంలో హోండా అందిస్తున్న ఏకైక మోడల్ డబ్ల్యూఆర్-వి (WR-V) అమ్మకాల పరంగా అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, గతంలో హోండా విక్రయించిన పాపులర్ ఎస్‌యూవీ సిఆర్-విని కంపెనీ డిస్‌కంటిన్యూ చేయడంతో హోండా నుండి ఎస్‌యూవీ స్టైల్ వాహనం కోరుకునే వారికి ఇదొక్కటే (డబ్ల్యూఆర్-వి) ఆప్షన్‍గా ఉంది. వాస్తవానికి, ఈ మోడల్ ఎక్కువగా హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్‌పై ఆధారపడి ఉంటుంది.

సెప్టెంబర్ 2022 నెలలో హోండా కార్లపై ఫెస్టివ్ ఆఫర్లు: రూ. 27,500 వరకు బెనిఫిట్స్

ఈ సెగ్మెంట్‌లోని ఇతర ఎస్‌యూవీలతో పోలిస్తే, హోండా డబ్ల్యూఆర్-వి అమ్మకాల గణాంకాలు మధ్యస్తంగా ఉన్నాయి. కాగా, హోండా డబ్ల్యూఆర్-వి అమ్మకాలను పెంచుకునేందుకు హోండా ప్రస్తుత పండుగ సీజన్‌లో WR-V పై రూ. 27,000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో రూ. 10,000 విలువైన కార్ ఎక్స్ఛేంజ్‌పై తగ్గింపు, రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 7,000 కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 5,000 కస్టమర్ లాయల్టీ బోనస్ లు ఉన్నాయి.

సెప్టెంబర్ 2022 నెలలో హోండా కార్లపై ఫెస్టివ్ ఆఫర్లు: రూ. 27,500 వరకు బెనిఫిట్స్

హోండా జాజ్ (రూ. 25,000 వరకు ప్రయోజనాలు)

భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో హోండా జాజ్ కూడా ఒకటి. ఇది చాలా విశాలమైన ఇంటీరియర్‌ను కలిగి ఉండి, మంచి ఫీచర్లు మరియు సాంకేతికతను కలిగి ఉంటుంది. హైవేలపై వేగవంతమైన హ్యాచ్‌బ్యాక్ మరియు మెట్రో నగరాలలో చురుకైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కోరుకునే వారికి హోండా జాజ్ ఎల్లప్పుడూ చక్కటి ఆప్షన్ గా ఉంటుంది. హోండా జాజ్ దాని విశాలమైన ఇంటీరియర్ స్థలానికి మరియు క్యాబిన్ లోపల ప్రీమియం అప్పీల్‌కు బాగా ప్రసిద్ధి చెందినది.

సెప్టెంబర్ 2022 నెలలో హోండా కార్లపై ఫెస్టివ్ ఆఫర్లు: రూ. 27,500 వరకు బెనిఫిట్స్

హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్ పై కంపెనీ ఈ నెలలో అందిస్తున్న ఆఫర్ల విషయానికి వస్తే, కొత్త హోండా జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ను కొనుగోలు చేసే ఈ సెప్టెంబర్ 2022లో రూ. 25,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 10,000 విలువైన కార్ ఎక్స్ఛేంజ్‌పై తగ్గింపు, రూ. 5,000 కస్టమర్ లాయల్టీ బోనస్, రూ. 7,000 కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లు ఉన్నాయి.

సెప్టెంబర్ 2022 నెలలో హోండా కార్లపై ఫెస్టివ్ ఆఫర్లు: రూ. 27,500 వరకు బెనిఫిట్స్

హోండా అమేజ్ (రూ. 8,000 వరకు ప్రయోజనాలు)

హోండా అమేజ్ అనేది కంపెనీ డిస్‌కంటిన్యూ చేసిన బ్రియో హ్యాచ్‌బ్యాక్‌పై ఆధారపడిన సబ్-4 మీటర్ కాంపాక్ట్ సెడాన్. ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి డిజైర్, టాటా టిగోర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. సెప్టెంబర్ 2022 నెలలో హోండా అమేజ్ సెడాన్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు కేవలం రూ. 8,000 వరకు ప్రయోజనాలను మాత్రమే పొందగలరు. ఇందులో రూ. 5,000 కస్టమర్ లాయల్టీ బోనస్ మరియు రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లు ఉన్నాయి.

సెప్టెంబర్ 2022 నెలలో హోండా కార్లపై ఫెస్టివ్ ఆఫర్లు: రూ. 27,500 వరకు బెనిఫిట్స్

హోండా సిటీ 4వ తరం (రూ. 5,000 వరకు ప్రయోజనాలు)

నాల్గవ తరం హోండా సిటీ సెడాన్ పాత మోడలే అయినప్పటికీ, దీనికి భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పటికీ బలమైన డిమాండ్ ఉంది. అయితే, కంపెనీ ఈ మోడల్ ను చాలా పరిమిత వేరియంట్లలో మాత్రమే విక్రయిస్తోంది. ఫలితంగా, దీనిపై డిస్కౌంట్ కూడా చాలా తక్కువగా ఉంది. ఈ సెప్టెంబర్ 2022లో, హోండా సిటీ 4వ తరం సెడాన్‌పై కొత్త కస్టమర్ పొందగలిగే ఏకైక ఆఫర్ రూ. 5,000 కస్టమర్ లాయల్టీ బోనస్ మాత్రమే.

More from DriveSpark

Article Published On: Tuesday, September 6, 2022, 8:00 [IST]
English summary
September 2022 festive offers on honda cars benefits up to rs 27500 details
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+