మతిపోగొడుతున్న 'శిల్పా శెట్టి' వ్యానిటీ వ్యాన్‌.. మీరూ చూడండి

సాధారణంగా సెలబ్రెటీలకు లగ్జరీ కార్లన్నా.. లగ్జరీ బైకులన్నా.. విపరీతమైన వ్యామోహం. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు ఆధునిక వాహనాలను కొనుగోలు చేస్తూఉంటారు. ఇందులో కేవలం హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా ఇందులో ఏ మాత్రం తక్కువ కాదు. చాలామంది హీరోలకు మాదిరిగానే హీరోయిన్లకు కూడా ఖరీదైన కార్లు ఉన్నట్లు మనం ఇదివరకటి చాలా కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇటీవల ప్రముఖ నటి 'శిల్పా శెట్టి' ఒక అద్భుతమైన వ్యానిటీ వ్యాన్‌ను కొనుగోలు చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మతిపోగొడుతున్న 'శిల్పా శెట్టి' వ్యానిటీ వ్యాన్‌.. మీరూ చూడండి

శిల్పా శెట్టి జూన్ 08 న తన 47 వ పుట్టిన రోజు జరుపుకునే సందర్భంగా అధునాతన సదుపాయాలతో కూడిన ఒక కొత్త వ్యానిటీ వ్యాన్‌ను తనకు తానుగా గిఫ్ట్ గా ఇచ్చుకుంది. ఈ వ్యానిటీ వ్యాన్‌ చాలా అద్భుతమైన సదుపాయాలతో కస్టమైజ్ చేయబడింది. ఈ కొత్త వ్యానిటీ వ్యాన్‌ యొక్క ఫోటోలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.

మతిపోగొడుతున్న 'శిల్పా శెట్టి' వ్యానిటీ వ్యాన్‌.. మీరూ చూడండి

బ్లాక్ (నలుపు) కలర్ లో కనిపిస్తున్న ఈ వ్యానిటీ వ్యాన్‌ యొక్క ముందు భాగంలో SSK అనే అక్షరాలను చూడవచ్చు. ఈ వ్యాన్‌ ముందు భాగంలో ఉన్న అక్షరాలు 'శిల్పా శెట్టి కుంద్రా' అని తెలియజేస్తాయి. ఇందులో ప్రధానంగా లగ్జరీ మరియు ఫిట్‌నెస్ వంటి వాటికీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు ఇక్కడ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.

మతిపోగొడుతున్న 'శిల్పా శెట్టి' వ్యానిటీ వ్యాన్‌.. మీరూ చూడండి

ఈ వాన్ యొక్క ఫ్రంట్ స్లిమ్ గా ఉండే యాంగ్యులర్ హెడ్‌ల్యాంప్స్ మరియు ముందు బంపర్ పైన మధ్యలో రౌండ్ హాలోజన్ లైట్లను కలిగి ఉండి ఆకర్షణీయంగా ఉండే గ్రిల్ కూడా ఉంది. మొత్తానికి ఇది చూడగానే చాలా ఆకర్షించే విధంగా ఉంది.

మతిపోగొడుతున్న 'శిల్పా శెట్టి' వ్యానిటీ వ్యాన్‌.. మీరూ చూడండి

ఇక ఈ వ్యాన్ యొక్క ఇంటీరియర్ గురించి మాట్లాడాలంటే ఇది నిజంగా ఒక లగ్జరీ రూమ్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఉంది. ఇందులో వంటగది, లాంజ్, హెయిర్ మరియు మేకప్ రూమ్‌తో సహా సకల సౌకర్యాలు ఉన్నాయి. వంటగది మైక్రోవేవ్ ఓవెన్, చిమ్నీ, కత్తిపీటలు మరియు అల్మారాలు వంటి ఆధునిక వస్తువులతో నిండి ఉంది.

మతిపోగొడుతున్న 'శిల్పా శెట్టి' వ్యానిటీ వ్యాన్‌.. మీరూ చూడండి

ఇంకా ఇందులో ఎయిర్ కండిషన్డ్ లాంజ్ కూడా సోఫా, సోఫా చైర్, డెస్క్, కుషన్‌లు, పెద్ద అద్దం, యాంబియంట్ లైటింగ్ మరియు రూఫ్-మౌంటెడ్ లైట్లతో చాలా లగ్జరీగా ఉంది. హెయిర్ మరియు మేకప్ రూమ్ లో కూడా లేటెస్ట్ సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది ఫిట్‌నెస్ కోసం ఏర్పాటు చేసుకున్న ప్రదేశం.

మతిపోగొడుతున్న 'శిల్పా శెట్టి' వ్యానిటీ వ్యాన్‌.. మీరూ చూడండి

శిల్ప శెట్టి ఫిట్‌నెస్ కోసం వానిటీ వ్యాన్ పైకప్పుపై ప్రత్యేక యోగా డెక్ ఉంది. ఈ ప్రదేశానికి లోపల ఉన్న చిన్న మెట్ల మార్గం ద్వారా వెళ్ళవచ్చు. ఇక్కడ కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్న గడ్డి తివాచీలు కూడా ఉన్నాయి. దీనిపైన యోగా మ్యాట్, ఫోల్డబుల్ కుర్చీ మరియు కెటిల్‌బెల్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

మతిపోగొడుతున్న 'శిల్పా శెట్టి' వ్యానిటీ వ్యాన్‌.. మీరూ చూడండి

శిల్పా శెట్టి సాధారణంగానే యోగా చేయడానికి ఎక్కువ ఆసక్తి కనపరుస్తుంది. ఈ కారణంగానే 47 సంవత్సరాల వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తోంది. శిల్పా శెట్టి ఈ ఆధునిక వ్యానిటీ వ్యాన్‌ను కొనుగోలు గురించి మాట్లాడుతూ.. తనకు ఫిట్‌నెస్ అత్యంత ప్రాధాన్యమని, ఈ కారణంగానే ఇందులో ప్రత్యేకంగా ఆ ప్రదేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపింది.

మతిపోగొడుతున్న 'శిల్పా శెట్టి' వ్యానిటీ వ్యాన్‌.. మీరూ చూడండి

శిల్పా శెట్టి కొనుగోలు చేసిన ఈ వానిటీ వ్యాన్‌ను ఎవరు కస్టమైజ్ చేశారనే విషయం స్పష్టంగా తెలియదు. ఐతే కాకూండా ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసుకున్న ఈ వ్యాన్ ధర కూడా వెల్లడించలేదు. మొత్తం మీద తన పుట్టిన రోజునాడు అదిరిపోయే వాహనాన్ని సొంతం చేసుకుంది.

మతిపోగొడుతున్న 'శిల్పా శెట్టి' వ్యానిటీ వ్యాన్‌.. మీరూ చూడండి

ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన శిల్పా శెట్టి కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ్ మొదలైన భాషల్లోని సినిమాల్లో కూడా నటించింది. తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన సాహసవీరుడు సాగరకన్య మరియు బాలక్రిష్ణ సరసన వీడెవడండీ బాబు సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది.

తెలుగు చలన చిత్ర సీమలో సూపర్ స్టార్ మహేష్ బాబు దాదాపు రూ. 10 కోట్ల విలువైన కారా వ్యాన్ కలిగి ఉన్నాడు. అదే విధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కారా వ్యాన్ ధర రూ. 8 కోట్ల వరకు ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన వార్తలు మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు బైకుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Article Published On: Friday, June 10, 2022, 16:05 [IST]
English summary
Shilpa shetty buys luxurious vanity van details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+