గతవైభవమ్ వచ్చేసింది.. అమ్మకాల్లో జోరు పెంచిన Skoda: పూర్తి వివరాలు

స్కోడా (Skoda) కంపెనీ 2022 ఆగస్టు నెల అమ్మకాలను ఇటీవల అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ అందించిన ఈ అమ్మకాల గణాంకాల ప్రకారం, మార్కెట్లో కంపెనీ మొత్తమ్ అమ్మకాలు 4,222 యూనిట్లు అని తెలిసింది.

Recommended Video

అమ్మకాల్లో అదరగొడుతున్న Skoda Kushaq | పూర్తి వివరాలు

అయితే ఇందులో దేశీయ అమ్మకాలు మరియు ఇతర వివరాలను ఈ కథనంలో క్లుప్తంగా తెలుసుకుందాం.. రండి.

గతవైభవమ్ వచ్చేసింది.. అమ్మకాల్లో జోరు పెంచిన Skoda: పూర్తి వివరాలు

స్కోడా ఆటో వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గత నెల అమ్మకాల్లో కంపెనీ యొక్క స్లావియా మరియు కుషాక్ SUV లు మంచి అమ్మకాలు పొందినట్లు తెలిసింది. అదే సమయంలో మునుపటి సంవత్సరం (2021 ఆగష్టు) ఇదే నెలకంటే 2022 ఆగష్టు నెలలో అమ్మకాలు 10 శాతం పెరిగాయి.

గతవైభవమ్ వచ్చేసింది.. అమ్మకాల్లో జోరు పెంచిన Skoda: పూర్తి వివరాలు

2021 ఆగష్టు నెలలో అమ్మకాలు మొత్తమ్ 3,829 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఆగష్టు నెల వరకు కూడా నేటి మొత్తమ్ 8 నెలల కాలంలో కంపెనీ 37,568 కార్లను విక్రయించింది. గత 20 సంవత్సరాలు ఇన్ని అమ్మకాలు కంపెనీ ఇప్పటివరకు నమోదు చేయలేదు. ఇది నిజంగా కంపెనీకి మహర్దశ అనే చెప్పాలి.

గతవైభవమ్ వచ్చేసింది.. అమ్మకాల్లో జోరు పెంచిన Skoda: పూర్తి వివరాలు

2022 అనేది స్కోడా ఆటోకి కలిసొచ్చిన సంవత్సరంగా చెప్పవచ్చు. ఎందుకంటే అమ్మకాల్లో కంపెనీ దినదినాభివృద్ధిని సాధిస్తోంది. 2012 లో కంపెనీ మొత్తమ్ అమ్మకాలు 34,678 యూనిట్లు విక్రయించింది. అప్పట్లో కంపెనీ సాధించిన గణనీయమైన వృద్ధి ఇదే అనిచెప్పాలి. ఆ తరువాత కంపెనీ మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందుతోంది.

గతవైభవమ్ వచ్చేసింది.. అమ్మకాల్లో జోరు పెంచిన Skoda: పూర్తి వివరాలు

భారతదేశంలో 'ఇండియా 2.0 ప్రాజెక్ట్' ప్రారంభించిన తర్వాత తమ కార్ల విక్రయాలు పెరిగాయని స్కోడా ఆటో భావిస్తోంది. స్కోడా ఇండియా తన కార్లను స్థానికీకరించడానికి 2018 నుండి MQB-AO-I-N డిజైన్ ప్లాట్‌ఫారమ్‌లో కార్లను తయారు చేస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ భారతదేశంలో విడుదల చేసిన కార్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. కావున కంపెనీ యొక్క వాహనాలు మంచి డిజైన్ పొందుతాయి.

గతవైభవమ్ వచ్చేసింది.. అమ్మకాల్లో జోరు పెంచిన Skoda: పూర్తి వివరాలు

కంపెనీ తన వాహనాలను కొత్త ప్లాట్‌ఫారమ్‌ కింద రూపొందించడమే కాకుండా.. కస్టమర్ల విశ్వాసాన్ని మరింత పెంచడానికి మరియు ఇతర ప్రత్యర్థులతో పోటీ పడటానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంది. దీనికోసం కంపెనీ కొత్త నగరాల్లో డీలర్‌షిప్‌లు మరియు కస్టమర్ టచ్‌పాయింట్‌లను ప్రారంభించింది. ఇవన్నీ కంపెనీ యొక్క అమ్మకాలను మరింత పెంచడానికి దోహదపడతాయి.

గతవైభవమ్ వచ్చేసింది.. అమ్మకాల్లో జోరు పెంచిన Skoda: పూర్తి వివరాలు

భారతదేశంలో ప్రస్తుతం స్కోడా ఇండియా 95 శాతం స్థానికీకరణను అవలంబిస్తోంది, బ్రాండ్ కార్లపై నిర్వహణ ఖర్చును కేవలం 46 పైసలకు తగ్గించింది. ఈ అంశాలన్నీ స్కోడాపై కస్టమర్ల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయి. అదే సమయంలో ధరలు కూడా కొంత ఆశాజనంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది.

గతవైభవమ్ వచ్చేసింది.. అమ్మకాల్లో జోరు పెంచిన Skoda: పూర్తి వివరాలు

అయితే ఇదివరకు మనం చెప్పుకున్న స్కోడా 'ఇండియా 2.0 ప్రాజెక్ట్' కింద కుషాక్ మరియు స్లావియా విడుదలయ్యాయి. ఈ రెండు కార్లు మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతూ కంపెనీ యొక్క వృద్ధికి సహకరిస్తున్నాయి. ఇందులో స్కోడా యొక్క కుషాక్ 2021 లో విడుదలైంది.

గతవైభవమ్ వచ్చేసింది.. అమ్మకాల్లో జోరు పెంచిన Skoda: పూర్తి వివరాలు

కుషాక్ రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. ఇందులోని 1.0-లీటర్ మూడు సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, 115 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

గతవైభవమ్ వచ్చేసింది.. అమ్మకాల్లో జోరు పెంచిన Skoda: పూర్తి వివరాలు

ఇక స్కోడా స్లావియా విషయానికి వస్తే, ఇది 2022 మార్చి నెలలో విడుదలైంది. ఇది 1.0 లీటర్ టిఎస్ఐ మరియు 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇవి రెండూ మంచి పనితీరుని అందిస్తాయి.

గతవైభవమ్ వచ్చేసింది.. అమ్మకాల్లో జోరు పెంచిన Skoda: పూర్తి వివరాలు

స్కోడా ఇండియా ప్రస్తుతం దేశం మొత్తం మీద 205 టచ్‌పాయింట్‌లను నిర్వహిస్తోంది, ఈ ఏడాది చివరి నాటికి ఆ సంఖ్య 250 కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. కావున రానున్న రోజల్లో కంపెనీ యొక్క అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

గతవైభవమ్ వచ్చేసింది.. అమ్మకాల్లో జోరు పెంచిన Skoda: పూర్తి వివరాలు

ఇదిలా ఉండగా స్కోడా ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ SUV విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ Skoda Enyaq iV విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఇది భారతమార్కెట్లో విడుదల కానున్న స్కోడా యొక్క మొదటి ఎలక్ట్రిక్ SUV అవుతుంది.

గతవైభవమ్ వచ్చేసింది.. అమ్మకాల్లో జోరు పెంచిన Skoda: పూర్తి వివరాలు

Skoda Enyaq రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది. అవి 62 kWh మరియు 82 kWh వేరియంట్‌లు కావచ్చు. ఇవి రెండూ 177 బిహెచ్‌పి మరియు 261 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తాయి. కాగా ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 510 కిమీ రేంజ్ అందించే అవకాశం ఉంది. ఇది 2023 నాటికి భారతీయ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, September 3, 2022, 10:07 [IST]
English summary
Skoda auto august 2022 sales details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+