2021 డిసెంబర్ అమ్మకాల్లో అదరగొట్టిన Skoda.. ఏకంగా..!!

ప్రముఖ వాహన తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) ఎట్టకేలకు తన 2021 డిసెంబర్ నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం కంపెనీ గత నెలలో (2021 డిసెంబర్) మొత్తం 3,234 యూనిట్ల కార్లను విక్రయించినట్లు తెలిసింది. ఇదే నెల 2020 లో కంపెనీ కేవలం 1,303 యూనిట్లను మాత్రమే దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.

2021 డిసెంబర్ అమ్మకాల్లో అదరగొట్టిన Skoda.. ఏకంగా..!!

కంపెనీ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం 2020 కంటే 2021 లో ఏకంగా 148.20 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయ మార్కెట్లో ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభణ, మరో వైపు సెమీకండక్టర్ చిప్ కొరత ఉన్నప్పటికీ ఇంత మొత్తంలో అమ్మకాలను చేపట్టడం అనేది నిజంగా హర్శించదగ్గ విషయం.

2021 డిసెంబర్ అమ్మకాల్లో అదరగొట్టిన Skoda.. ఏకంగా..!!

కంపెనీ యొక్క అమ్మకాలలో 2021 సంవత్సరం మొదటి త్రైమాసికంలో అంటే జనవరి మరియు మార్చి మధ్య కాలంలో 3,016 యూనిట్ల వాహనాలను విక్రయించింది. అదే సమయంలో 2020 సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో కంపెనీ మొత్తం 3,057 యూనిట్ల కార్లను విక్రయించింది. దీన్నిబట్టి చూస్తే కంపెనీ యొక్క త్రైమాసిక అమ్మకాలు 2020 కంటే కూడా 1.34 శాతం క్షీణించాయి.

2021 డిసెంబర్ అమ్మకాల్లో అదరగొట్టిన Skoda.. ఏకంగా..!!

ఇక సంవత్సరం యొక్క రెండవ త్రైమాసికంలోని అమ్మకాల విషయానికి వస్తే, 2021 ఏప్రిల్ మరియు 2021 జూన్ మధ్య కంపెనీ మొత్తం 2,411 యూనిట్ల వాహనాలను విక్రయించింది. అదే సమయంలో 2020 ఇదే కాలంలో కేవలం 1,298 యూనిట్లు మాత్రమే. కావున రెండవ త్రైమాసికంలో కంపెనీ విక్రయాలు 85.75 శాతం పెరిగాయి.

2021 డిసెంబర్ అమ్మకాల్లో అదరగొట్టిన Skoda.. ఏకంగా..!!

2021 సంవత్సరం ద్వితీయార్ధంలోని అమ్మకాల విషయానికి వస్తే, అంటే 2021 జనవరి మరియు 2021 జూన్ మధ్య 5,427 యూనిట్ల కార్లను విక్రయించింది. ఇదే సమయం 2020 లో కంపెనీ 4,355 యూనిట్లను మాత్రమే వికరించగలిగింది. మొత్తానికి 2021 ప్రథమార్థంలో కంపెనీ యొక్క అమ్మకాలు 24.62 శాతం పెరిగాయి.

2021 డిసెంబర్ అమ్మకాల్లో అదరగొట్టిన Skoda.. ఏకంగా..!!

2021 సంవత్సరం మూడవ అర్ధ భాగంలో (2021 జూలై మరియు 2021 సెప్టెంబర్) కంపెనీ 9,936 యూనిట్ల కార్లను విక్రయించింది, గత సంవత్సరం ఇదే కాలంలో విక్రయించిన మొత్తం అమ్మకాలు 3,237 యూనిట్లు. మొత్తానికి కంపెనీ మూడో త్రైమాసికంలో 206.95 శాతం వృద్ధిని నమోదు చేసింది.

2021 డిసెంబర్ అమ్మకాల్లో అదరగొట్టిన Skoda.. ఏకంగా..!!

అదే విధంగా 2021 నాల్గవ త్రైమాసికంలో అమ్మకాలను పరిశీలిస్తే, 2021 అక్టోబర్ మరియు 2021 డిసెంబర్ మధ్య కంపెనీ 8,495 యూనిట్ల కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంలో విక్రయించిన మొత్తం అమ్మకాలు 3,780 యూనిట్లు. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో కంపెనీ విక్రయాలు 124.74 శాతం పెరిగాయి.

2021 డిసెంబర్ అమ్మకాల్లో అదరగొట్టిన Skoda.. ఏకంగా..!!

2021 సంవత్సరం ద్వితీయార్ధంలో, అంటే 2021 జూలై మరియు 2021 డిసెంబర్ మధ్య కాలంలో కంపెనీ మొత్తం 18,431 వాహనాలను విక్రయించింది. అదే 2020 ద్వితీయార్థంలో కంపెనీ 7,017 యూనిట్ల కార్లను విక్రయించింది. 2021 ద్వితీయార్థంలో కూడా కంపెనీ మునుపటి సంవత్సరం కంటే 162.66% వృద్ధిని నమోదు చేసింది.

2021 డిసెంబర్ అమ్మకాల్లో అదరగొట్టిన Skoda.. ఏకంగా..!!

ఇక చివరగా స్కోడా ఆటో ఇండియా వార్షిక అమ్మకాలు అంటే 2021 మొత్తం అమ్మకాల విషయానికి వస్తే, కంపెనీ జనవరి మరియు డిసెంబర్ 2021 మధ్య కాలంలో 23,858 యూనిట్ల కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంలో అంటే 2020 లో కంపెనీ 11,372 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఈ ఏడాది కంపెనీ విక్రయాలు మునుపటికంటే కూడా 109.80 శాతం పెరిగాయి.

2021 డిసెంబర్ అమ్మకాల్లో అదరగొట్టిన Skoda.. ఏకంగా..!!

స్కోడా ఆటో ఇండియా యొక్క అమ్మకాలు పెరగటానికి కంపెనీ యొక్క స్కోడా కుషాక్ SUV ఎంతగానో దోహదపడింది. దేశీయ మార్కెట్లో స్కోడా యొక్క కుషాక్ SUV విడుదలైనప్పటి నుంచి కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ కారణంగా కంపెనీ యొక్క అమ్మకాలు మునుపటి సంవత్సరం కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి.

2021 డిసెంబర్ అమ్మకాల్లో అదరగొట్టిన Skoda.. ఏకంగా..!!

ఇదిలా ఉండగా స్కోడా కంపెనీ త్వరలో స్కోడా 'స్కోడా స్లావియా' మరో కొత్త సెడాన్ లాంచ్ చేయనుంది. ఈ సెడాన్ ఇప్పటికే మార్కెట్లో ఆవిష్కరించబడింది. ఈ సంవత్సరం ప్రధమార్థంలో ఈ సెడాన్ భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత అమ్మకాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

2021 డిసెంబర్ అమ్మకాల్లో అదరగొట్టిన Skoda.. ఏకంగా..!!

అంతే కాకూండా స్కోడా కంపెనీ దేశీయ మార్కెట్ కోసం కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ అనే మరో కొత్త కారుని విడుదల చేయనుంది. ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం, స్కోడా ఆటో ఈ కారును ఈ జనవరి 14 న విడుదల చేసే అవకాశం ఉంది. కొడియాక్‌ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda auto india sales december 3234 units details
Story first published: Wednesday, January 5, 2022, 9:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X