కలిసొచ్చిన 2022 ఫిబ్రవరి నెల: పెరిగిన Skoda సేల్స్
2022 ఫిబ్రవరి నెల ముగియడంతో చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ, స్కోడా (Skoda) తన అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం, స్కోడా గత నెలలో 4,503 యూనిట్లను విక్రయించగా, జనవరి 2022 లో కంపెనీ భారతదేశంలో 3,009 వాహనాలను విక్రయించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

స్కోడా ఇండియా నెలవారీగా అమ్మకాల పరంగా దాదాపు 50 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022 ఫిబ్రవరి నెల నెల అమ్మకాల వృద్ధికి కంపెనీ యొక్క కుషాక్ SUV చాలా వరకు దోహదపడింది. కంపెనీ 2021 ఫిబ్రవరి నెలలో 853 వాహననలను విక్రయించినట్లు తెలిసింది.

కంపెనీ యొక్క మొత్తం వార్షిక అమ్మకాలు విషయానికి వస్తే, స్కోడా ఆటో ఇండియా ఫిబ్రవరి 2021తో పోలిస్తే 2022 ఫిబ్రవరిలో 5 రెట్లు ఎక్కువ అమ్మకాల వృద్ధిని సాధించింది. అయితే, స్కోడా యొక్క టాప్-సెల్లర్ కుషాక్ కాంపాక్ట్ SUV గత సంవత్సరం ఈ కాలంలో భారతదేశంలో విక్రయించబడలేదు. కావున అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు కంపెనీ యొక్క అమ్మకాలను వృద్ధి చెందించడానికి కుషాక్ చాలా దోహదపడింది.

అంతే కాకూండా.. గత సంవత్సరం కొత్త తరం స్కోడా ఆక్టావియా లేదా కొడియాక్ SUV కూడా అమ్మకానికి లేదు. కావున గత సంవత్సరం ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదు. స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ సేల్ వివరాలను వెల్లడించారు. అంతే కాకుండా, కంపెనీ యొక్క ఉత్పత్తులపైన ప్రజలు ఉంచుకున్న నమ్మకానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ కారణంగా ఈ ఫిబ్రవరిలో మంచి అమ్మకాలను పొడగలిగామన్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల స్కోడా కంపెనీ తన స్లావియా సెడాన్ ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో ప్రస్తుతం 1.0 TSI పవర్డ్ వెర్షన్‌ల ధరలను మాత్రమే కంపెనీ వెల్లడించింది. దీని ధర రూ. 10.69 లక్షలతో ప్రారంభమై రూ. 15.39 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉన్నాయి.

స్లావియా మొత్తం 5 కలర్ అప్సన్స్ లో అందించనుంది. అవి కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, టోర్నాడో రెడ్ మరియు క్రిస్టల్ బ్లూ కలర్స్. దీని కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది.

కొత్త స్కోడా స్లావియాను కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్లతో విడుదల చేయనుంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇక రెండవ ఇంజిన్ 1.5-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజన్ ఇది 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇవి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను పొందుతాయి.

కొత్త స్కోడా స్లావియా అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సెడాన్ సిగ్నేచర్ బటర్‌ఫ్లై షేప్ ఫ్రంట్ గ్రిల్ మరియు పెద్ద రేడియేటర్ గ్రిల్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇది L- షేప్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, 16-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు బూట్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ వంటివి కూడా పొందుతుంది. ఈ కారు యొక్క ORVMలపై టర్న్ ఇండికేటర్లను మరియు సైడ్ బాడీలో లైనింగ్‌ను పొందుతుంది.

స్కోడా స్లావియా యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులోని ఇంటీరియర్ కూడా చాలావరకు అప్డేట్ చేయబడ్డాయి. ఇందులోని క్యాబిన్ డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ మరియు అప్హోల్స్టరీ కూడా డ్యూయల్-టోన్‌లో ఉంచబడ్డాయి. డ్యాష్‌బోర్డ్‌కు డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో బ్లాక్ పియానో ఫినిషింగ్ ఇవ్వబడింది, ఇది మరింత ప్రీమియం అవుతుంది.

ఇందులో డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్ మౌంట్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 25.4 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 20.32 సెం.మీ డిజిటల్ కాక్‌పిట్ వంటి ఫీచర్లు ఇందులో అందించబడ్డాయి.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త స్కోడా స్లావియా సెడాన్ హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది. ఇటీవల విడుదలైన ఈ కొత్త సెడాన్ కంపెనీ యొక్క అమ్మకాలను మెరుగుపరచడంలో చాలావరకు సహాయపడతాయని ఆశిస్తున్నాము.


Click it and Unblock the Notifications