భారతదేశంలో 15 లక్షల కార్లను ఉత్పత్తి చేసిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్.. త్వరలోనే వర్త్యుస్ సెడాన్ లాంచ్!

భారతదేశంలో ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ భారీ ఉత్పత్తి మైలురాయిని చేరుకుంది. జర్మనీకి చెందిన ఈ ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ మనదేశంలో ఇప్పటికే 15 లక్షల కార్లను ఉత్పత్తి చేసినట్లు ప్రకటించింది. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ కేవలం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) బ్రాండ్ కార్లు మాత్రమే కాకుండా, జర్మనీకి చెందిన ఆడి (Audi), చెక్ రిపబ్లిక్‌కు చెందిన స్కోడా (Skoda), ఇటలీకి చెందిన లాంబోర్ఘిని (Lamborghini) మరియు జర్మనీకి చెందిన పోర్ష్ (Porsche) వంటి ఇతర బ్రాండ్ల కార్లు కూడా ఉన్నాయి.

భారతదేశంలో 15 లక్షల కార్లను ఉత్పత్తి చేసిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్.. త్వరలోనే వర్త్యుస్ సెడాన్ లాంచ్!

ఫోక్స్‌వ్యాగన్ గ్రూపులోని పైన తెలిపిన బ్రాండ్లు అన్నీ కలిసి భారతదేశంలో మొత్తంగా 1.5 మిలియన్ (15,00,000) కార్లను ఉత్పత్తి చేశాయి. స్కోడా ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఉత్పత్తి చేసిన ఈ కుషాక్ ఎస్‌యూవీ 15,00,000 వ ఉత్పత్తి కావడం విశేషం. కంపెనీ దీనిని తమ పూణేలోని ప్లాంట్‌లో తయారు చేసింది. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ కంపెనీలకు భారతదేశంలోని పూణె మరియు ఔరంగాబాద్‌లో రెండు ప్లాంట్‌లు ఉన్నాయి. ఈ రెండు ప్లాంట్ల నుండే కంపెనీ అనేక బ్రాండ్‌ల కార్లను ఉత్పత్తి చేస్తుంది.

భారతదేశంలో 15 లక్షల కార్లను ఉత్పత్తి చేసిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్.. త్వరలోనే వర్త్యుస్ సెడాన్ లాంచ్!

ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ ప్రపంచంలోని అతిపెద్ద మల్టీ కార్ బ్రాండ్ కంపెనీలలో ఒకటిగా ఉంది. ప్రస్తుతం, ఈ గ్రూపులో Skoda, Volkswagen, Porsche, Lamborghini, Bentley, Audi మరియు Seat వంటి కార్ల బ్రాండ్లతో పాటుగా Ducati వంటి బైక్ బ్రాండ్లు కూడా ఉన్నాయి. కాగా, భారతదేశంలో ఈ గ్రూప్ ఉత్పత్తి చేసిన మొత్తం 15 లక్షల వాహనాలు కూడా చకన్ మరియు ఔరంగాబాద్‌లోని ప్లాంట్లలోనే తయారు చేయబడ్డాయి. ఈ మొత్తం 15 లక్షల వాహనాల్లో 5,45,700 కార్లు భారతదేశం నుండి ఎగుమతి చేయబడగా, మిగిలిన 9.5 లక్షల వాహనాలను భారతదేశంలో విక్రయించారు.

భారతదేశంలో 15 లక్షల కార్లను ఉత్పత్తి చేసిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్.. త్వరలోనే వర్త్యుస్ సెడాన్ లాంచ్!

మొదట్లో ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ భారతదేశంలో గడ్డు కాలాన్ని ఎదుర్కున్నప్పటికీ, ఇటీవలి కాలంలో మాత్రం మంచి పనితీరును కనబరుస్తోంది. స్కోడా గ్రూప్ నుండి కొత్తగా వచ్చిన ఆక్టావియా, కుషాక్, కొడియాక్ మరియు స్లావియా వంటి అధునాతన కార్ల విడుదలతో మార్కెట్లో ఈ బ్రాండ్ అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. అధిక మెయింటినెన్స్ మరియు విడిభాగాల కొరత వంటి పలు కారణాల వలన ఒకప్పుడు స్కోడా కార్లను కొనాలంటే భయపడే కస్టమర్లు ఇప్పుడు ఎగబడి మరీ వాటిని కొనుగోలు చేస్తున్నారు.

భారతదేశంలో 15 లక్షల కార్లను ఉత్పత్తి చేసిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్.. త్వరలోనే వర్త్యుస్ సెడాన్ లాంచ్!

ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ కార్లు కూడా తక్కువేమీ కాదు. ఈ కంపెనీ అందిస్తున్న పోలో హ్యాచ్‌బ్యాక్ యువ కస్టమర్లను ఆకర్షిస్తుండగా, కొత్త వచ్చిన టైగన్ ఎస్‌యూవీ ప్రియులను అలరిస్తోంది. మిడ్-సైజన్ సెడాన్ కొనుగోలుదారుల కోసం కంపెనీ ఇటీవలే వర్త్యుస్ సెడాన్ ను ప్రవేశపెట్టగా ప్రీమియం ఎస్‌యూవీలను కోరుకునే వారి కోసం టిగువాన్ ఎస్‌యూవీని అందిస్తోంది. ఈ గ్రూపుకి చెందిన లాంబోర్ఘినీ కూడా భారతదేశంలో అత్యధికంగా తమ సూపర్ కార్లను విక్రయిస్తోంది.

భారతదేశంలో 15 లక్షల కార్లను ఉత్పత్తి చేసిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్.. త్వరలోనే వర్త్యుస్ సెడాన్ లాంచ్!

భారత్‌లో ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) ఉత్పత్తి షురూ..

ఇదిలా ఉంటే, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ నుండి తాజాగా మార్కెట్లోకి రాబోతున్న లేటెస్ట్ కారు వర్త్యుస్ మిడ్-సైజ్ సెడాన్. కంపెనీ ఇటీవలే ఈ కారును ఉత్పత్తిని భారతదేశంలో ప్రారంభించింది, దీని ధర మే 2022 నాటికి ప్రకటించబడుతుంది. భారతదేశంలో తయారైన వర్త్యుస్ సెడాన్ కారును కంపెనీ ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయనుంది. ప్రస్తుతం, ఫోక్స్‌వ్యాగన్ విక్రయిస్తున్న వెంటో సెడాన్ స్థానాన్ని రీప్లేస్ చేస్తూ వర్త్యుస్ మార్కెట్లోకి రాబోతంది. ఇది స్కోడా స్లావియా మాదిరిగానే ఒకే ప్లాట్‌ఫామ్ ను పంచుకుంటుంది.

భారతదేశంలో 15 లక్షల కార్లను ఉత్పత్తి చేసిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్.. త్వరలోనే వర్త్యుస్ సెడాన్ లాంచ్!

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్ ఉత్పత్తిలో కంపెనీ 95 శాతం స్థానికీకరణను పాటించనుంది. అంటే, ఈ కారు తయారీలో ఉపయోగించే భాగాలలో 95 శాతం వాటిని స్థానికంగా భారతీయ విక్రేతల నుండే సేకరించనుంది. ఫలితంగా, వర్త్యుస్ సెడాన్ ధర కూడా అగ్రెసివ్ గా ఉంటుందని భావిస్తున్నారు. కంపెనీ ఈ కారును రెండు ట్రిమ్‌లలో వివిధ వేరియంట్లలో విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఇందులో డైనమిక్ లైన్ మరియు జిటి లైన్ అనే ట్రిమ్స్ ఉంటాయని సమాచారం. ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్ ను స్కోడా-ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించనున్నారు.

భారతదేశంలో 15 లక్షల కార్లను ఉత్పత్తి చేసిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్.. త్వరలోనే వర్త్యుస్ సెడాన్ లాంచ్!

స్కోడా ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన ఇండియా 2.0 ప్రాజెక్ట్ లో భాగంగా వస్తున్న నాల్గవ మోడల్ ఈ వర్త్యుస్ సెడాన్. స్లావియా మరియు వర్త్యుస్ సెడాన్లు రెండూ ఒకే ప్లాట్‌ఫామ్ పై తయారైన నేపథ్యంలో, ఇవి రెండూ కూడా కుషాక్ మరియు టైగన్ ఎస్‌యూవీల మాదిరిగానే ఒకేరకమైన ఇంజన్ ఆప్షన్స్, పరికరాలు మరియు ఫీచర్లు కలిగి ఉండనున్నాయి. కంపెనీ తమ వర్త్యుస్ సెడాన్ ను 1.0 లీటర్ మరియు 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో విడుదల చేయనుంది.

భారతదేశంలో 15 లక్షల కార్లను ఉత్పత్తి చేసిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్.. త్వరలోనే వర్త్యుస్ సెడాన్ లాంచ్!

వర్త్యుస్ సెడాన్ లో డీజిల్ ఇంజన్ అందుబాటులో ఉండదు. ఇందులోని 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 113 బిహెచ్‌పి శక్తిని మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది. ఇకపోతే, రెండవ ఇంజన్ ఆప్షన్ గా ఇందులో 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇది గరిష్టంగా 148 బిహెచ్‌పి శక్తిని మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ ‌ను జనరేట్ చేస్తుంది. ఇవి రెండూ కూడా 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 7 స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, April 1, 2022, 16:34 [IST]
English summary
Skoda auto volkswagen group produces 15 million cars in india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+