భారత్‌కు అంతర్జాతీయ కీర్తి తెచ్చిన Skoda.. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మార్కెట్‌గా ఇండియా

స్కోడా కంపెనీ భారతీయ మార్కెట్లో ఇండియా 2.0 బిజినెస్ స్ట్రాటజీ కింద విడుదల చేసిన కొత్త 'కుషాక్' (Kushaq) మరియు స్లావియా (Slavia) మంచి విజయాన్ని సాధించాయి. ఈ సందర్భంగా కంపెనీ 2022 చివరి త్రైమాసికంలో సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని డెహ్రాడూన్‌లో అంతర్జాతీయ ఈవెంట్‌ను నిర్వహించింది. కంపెనీ నిర్వహించిన ఈ ఈవెంట్ లో భారతదేశం నుంచి మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమోటివ్ నిపుణులు పాల్గొన్నారు. ఇక్కడ కంపెనీ భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తుల విజయాలను ప్రదర్శించింది.

భారత్‌కు అంతర్జాతీయ కీర్తి తెచ్చిన Skoda.. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మార్కెట్‌గా ఇండియా

స్కోడా కంపెనీ యొక్క కుషాక్ SUV ఇటీవల గ్లోబెల్ NCAP క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ పొందటం ప్రశంసనీయం అని కొనియాడింది. ఈ కార్యక్రమంలో భారతదేశంలోని ప్రముఖ నిపుణులతో పాటు జర్మనీ, స్లోవేకియా, ఐర్లాండ్, బెల్జియం, ఫ్రాన్స్, ఆస్ట్రియా మరియు చెక్ రిపబ్లిక్ నుండి కూడా ఆటో ఔత్సాహికులు హాజరయ్యారు.

భారత్‌కు అంతర్జాతీయ కీర్తి తెచ్చిన Skoda.. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మార్కెట్‌గా ఇండియా

స్కోడా ఆటో ఇండియా కుషాక్ యొక్క యానివెర్సరీ ఎడిషన్ ని ఇటీవలే విడుదల చేసింది. అదే సమయంలో కుషాక్ మరియు స్లావియా రెండింటికీ కూడా మోడల్ ఇయర్ 2023 అప్‌డేట్‌లు ఉన్నాయని తెలిపింది.

భారత్‌కు అంతర్జాతీయ కీర్తి తెచ్చిన Skoda.. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మార్కెట్‌గా ఇండియా

స్కోడా కంపెనీ 2022 సంవత్సరం జనవరి నుండి 2022 అక్టోబర్ వరకు ఏకంగా 44,500 కార్లను విక్రయించి గొప్ప రికార్డ్ సృష్టించింది. ఇది 2022 లో కంపెనీ సాధించిన గొప్ప మరియు అపురూపమైన విజయం. ఈ విజయానికి ప్రధాన కారణం కంపెనీ ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద ఉత్పత్తులను విడుదల చేయడమే.

భారత్‌కు అంతర్జాతీయ కీర్తి తెచ్చిన Skoda.. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మార్కెట్‌గా ఇండియా

కంపెనీ తన ఇండియా 2.0 ప్రాజెక్ట్ మరియు మేడ్-ఇన్-ఇండియా, మేడ్-ఫర్-ఇండియా MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ యొక్క విజయాన్ని ప్రదర్శిస్తూ, నెలవారీ, త్రైమాసిక మరియు ఆరవ నెలలో అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. జూలై 2021 లో విడుదలైన కుషాక్ SUV మరియు మార్చి 2022 లో విడుదలైన స్లావియా సెడాన్ ఈ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉన్నాయి.

భారత్‌కు అంతర్జాతీయ కీర్తి తెచ్చిన Skoda.. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మార్కెట్‌గా ఇండియా

కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన ఈ ఉత్పత్తులు మంచి వృద్ధిని తీసుకురావడంలో సహాయపడ్డాయి. స్కోడా కంపెనీకి ఇప్పుడు జర్మన్ మరియు చెక్ రిపబ్లిక్ తరువాత భారతదేశం పెద్ద మార్కెట్ గా అవతరించింది. ఇప్పటికే స్కోడా కంపెనీ తన ఉత్పత్తులను భారతీయ మార్కెట్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది.

భారత్‌కు అంతర్జాతీయ కీర్తి తెచ్చిన Skoda.. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మార్కెట్‌గా ఇండియా

కంపెనీ నిర్వహించిన ఈ ఈవెంట్ లో స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ మిస్టర్ పీటర్ సోల్క్ (Mr Petr Solc) మాట్లాడుతూ.. నిజానికి మేము మా మ్లాడా బోలెస్లావ్ ప్రధాన కార్యాలయంలో మా ఉత్పత్తులను ప్రదర్శిస్తాము. అయితే ఇప్పుడు భారదేశానికి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది మరియు గర్వంగా కూడా ఉంది.

భారతదేశంలో అభివృద్దిచేయబడి మరియు నిర్మించబడిన ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. స్కోడా ఆటో ఇండియాకి అద్భుతమైన రోజులు వచ్చాయి. 2022 కంపెనీకి మంచి సంవత్సరం, ఇది 2023 లో కూడా ఇలాగే ముందుకు సాగుతుందని భావిస్తున్నామన్నారు.

భారత్‌కు అంతర్జాతీయ కీర్తి తెచ్చిన Skoda.. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మార్కెట్‌గా ఇండియా

మొత్తం మీద భారతీయ మార్కెట్లో స్కోడా కుషాక్ SUV మరియు స్కోడా స్లావియా సెడాన్ రెండూ కూడా MQB-A0 IN ప్లాట్‌ఫారమ్ పైన నిర్మించబడి ముందుకు సాగుతూ మంచి విజయాన్ని పొందుతున్నాయి. కంపెనీ ఇండియా 2.0 కింద కొత్త ఉత్పత్తులను విడుదల చేయడమే కాకుండా.. 2022 డిసెంబర్ నాటికి 250 టచ్‌పాయింట్‌లను విస్తరించనుంది. 2021 డిసెంబర్ నాటికి కంపెనీ 175 టచ్‌పాయింట్‌లను మాత్రమే కలిగి ఉంది.

భారత్‌కు అంతర్జాతీయ కీర్తి తెచ్చిన Skoda.. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మార్కెట్‌గా ఇండియా

భారతదేశంలో టచ్‌పాయింట్‌లు పెరగటం వల్ల కంపెనీ యొక్క నెట్‌వర్క్‌ క్రమంగా పెరుగుతోంది. అదే సమయంలో కంపెనీ తన కార్లకు తక్కువ నిర్వహణ ఖర్చులను కూడా ఎనేబుల్ చేసింది మరియు వాటిని పూర్తిగా డిజిటలైజ్ చేయడం ద్వారా షోరూమ్‌లను అప్‌గ్రేడ్ చేసింది. కంపెనీ మార్కెట్లో కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌ను మరింత మెరుగుపరచడానికి 'ఫ్యాన్స్ ఆఫ్ స్కోడా' అనే కొత్త మూవ్‌మెంట్‌ను కూడా ప్రవేశపెట్టింది.

భారత్‌కు అంతర్జాతీయ కీర్తి తెచ్చిన Skoda.. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మార్కెట్‌గా ఇండియా

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

స్కోడా కంపెనీకి కుషాక్ మరియు స్లావియా కార్లను విడుదల చేయడంతో దశ తిరిగిపోయింది. ఇవి దేశీయ మార్కెట్లో విడుదల చేసినప్పటినుంచి ఇప్పటివరకు కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి. ఇటీవల స్కోడా కుషాక్ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందటం అమ్మకాలు పెరగటాని మరింత సహాయకారికానుంది. మొత్తమ్ మీద 2022 సంవత్సరం స్కోడా కంపెనీకి బాగా కలిసి వచ్చింది. 2023 కూడా కంపెనీకి మంచి విజయాలను తీసుకువస్తుందని ఆశిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Thursday, November 10, 2022, 15:48 [IST]
English summary
Skoda india celebrates india 2 0 marks country as a growth hub details
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+