మార్కెట్లో విడుదలైన 24 గంటల్లోనే అమ్ముడైపోయిన స్కోడా కొడియాక్ (Skoda Kodiaq) ఎస్‌యూవీ!

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా (Skoda) దాదాపు రెండేళ్ల తర్వాత మార్కెట్లో ప్రవేశపెట్టిన తమ ప్రీమియం ఎస్‌యూవీ కొడియాక్ (Kodiaq) ఫేస్‌లిఫ్ట్, మార్కెట్లో విడుదలైన 24 గంటల్లోనే అమ్ముడైపోయినట్లు కంపెనీ ప్రకటించింది. స్కోడా తమ అప్‌డేటెడ్ 2022 మోడల్ కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ (2022 Skoda Kodiaq Facelift) ఎస్‌యూవీని జనవరి 10వ తేదీన మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీని రూ. 34.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభ ధరతో దేశీయ విపణిలో విక్రయిస్తోంది.

మార్కెట్లో విడుదలైన 24 గంటల్లోనే అమ్ముడైపోయిన స్కోడా కొడియాక్ (Skoda Kodiaq) ఎస్‌యూవీ!

స్కోడా కొడియాక్ ఎస్‌యూవీ మరో నాలుగు నెలల పాటు పూర్తిగా అమ్ముడైపోయినట్లు కంపెనీ పేర్కొంది. ఈ మోడల్ కోసం బుకింగ్ లు ప్రారంభించిన 24 గంటల్లోనే ఇది అమ్మడైపోయింది. గతంలో స్కోడా ఈ కారును పూర్తిగా విదేశాలలో తయారు చేసి, సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గంలో ఇండియాకు దిగుమతి చేసుకుని విక్రయించేది. అయితే, ఇప్పుడు ఈ కారును సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో విడిభాగాలుగా ఇండియాకు దిగుమతి చేసుకొని, ఇక్కడే స్థానికంగా అసెంబుల్ చేస్తున్నారు.

మార్కెట్లో విడుదలైన 24 గంటల్లోనే అమ్ముడైపోయిన స్కోడా కొడియాక్ (Skoda Kodiaq) ఎస్‌యూవీ!

భారతదేశంలో బిఎస్6 కాలుష్య నిబంధనలను ప్రవేశపెట్టిన తర్వాత స్కోడా 2020లో తమ కొడియాక్ డీజిల్ మోడల్ అమ్మకాలను మార్కెట్లో నిలిపివేసింది. అయితే, దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కంపెనీ తిరిగి ఈ మోడల్ సరికొత్త రూపంలో ప్రవేశపెట్టింది. స్కోడా కుషాక్ (Skoda Kushaq) విజయం తర్వాత కొనుగోలుదారుల్లో స్కోడా బ్రాండ్ పట్ల విశ్వసనీయత బాగా పెరిగింది. దీంతో కొడియాక్ మార్కెట్లో విడుదలైన కొద్ది గంటల్లోనే భారీ డిమాండ్ ను చూసింది. ఫలితంగా, ఇది మరో నాలుగు నెలల పాటు పూర్తిగా అమ్ముడైపోయింది.

మార్కెట్లో విడుదలైన 24 గంటల్లోనే అమ్ముడైపోయిన స్కోడా కొడియాక్ (Skoda Kodiaq) ఎస్‌యూవీ!

స్కోడా కుషాక్ ఎస్‌యూవీని కంపెనీ స్థానికంగా సేకరించిన విడిభాగాలతో తయారు చేస్తోంది. కాబట్టి, ఈ మోడల్ ఉత్పత్తికి ఎలాంటి ఢోకా లేదు. కానీ స్కోడా కొడియాక్ విషయంలో పరిస్థితిలో మరోలా ఉంటుంది. కొడియాక్ కారు అసెంబ్లింగ్ లో ఉపయోగించే విడిభాగాలను కంపెనీ విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ఫలితంగా, ఈ మోడల్ తయారీ కూడా పరిమితంగా ఉంటుంది. విడిభాగాల దిగుమతి కోసం పట్టే సమయం మరియు దిగుమతులపై ఉన్న ఆంక్షలు ఈ కారు ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి.

మార్కెట్లో విడుదలైన 24 గంటల్లోనే అమ్ముడైపోయిన స్కోడా కొడియాక్ (Skoda Kodiaq) ఎస్‌యూవీ!

కొత్త 2022 స్కోడా కొడియాక్ (2022 Skoda Kodiaq) విషయానికి వస్తే, ఇదొక ప్రీమియం 7-సీటర్ ఎస్‌యూవీ. మార్కెట్లో ఇది మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

* స్కోడా కొడియా స్టైల్ - రూ. 34.99 లక్షలు

* స్కోడా కొడియా స్పోర్ట్‌లైన్ - రూ. 35.99 లక్షలు

* స్కోడా కొడియా లారెన్ అండ్ క్లెమెంట్ - రూ. 37.49 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

మార్కెట్లో విడుదలైన 24 గంటల్లోనే అమ్ముడైపోయిన స్కోడా కొడియాక్ (Skoda Kodiaq) ఎస్‌యూవీ!

స్కోడా ఏప్రిల్ 2021 లోనే తమ అప్‌డేటెడ్ కొడియాక్ ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. మునుపటి మోడల్ తో పోల్చుకుంటే, ఈ కొత్త మోడల్ లో డిజైన్ మరియు ఫీచర్ల పరంగా కొన్ని మార్పులు ఉన్నాయి. అయితే, ఇందులో ప్రధానమైన మార్పు దాని ఇంజన్ రూపంలో ఉంటుంది. ఇందులో బటర్‌ఫ్లై ఆకారపు ఫ్రంట్ గ్రిల్, క్రిస్టల్ ఎల్ఈడి హెడ్‌లైట్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, 18 ఇంచ్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, సిల్వర్-కలర్ రూఫ్ రైల్స్, కొత్త స్పాయిలర్‌ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మార్కెట్లో విడుదలైన 24 గంటల్లోనే అమ్ముడైపోయిన స్కోడా కొడియాక్ (Skoda Kodiaq) ఎస్‌యూవీ!

స్కోడా ​​కొడియాక్ కారు లోపల లభించే ఫీచర్లను గమనిస్తే, ఈ కారులో డ్యూయెల్ టోన్ క్యాబిన్ లేఅవుట్ ఉంటుంది. ఇందులో కొత్త 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (దీనిలో నావిగేషన్ మరియు వైర్‌లెస్ స్మార్ట్ లింక్ ఫీచర్లు ఉన్నాయి) మరియు పెద్ద 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వర్చువల్ కాక్‌పిట్, పానోరమిక్ సన్‌రూఫ్, సబ్ వూఫర్‌తో కూడిన ఆడియో సిస్టమ్, త్రీజోన్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, ప్రీమియం లెథర్ సీట్లు, యాంబియెంట్ లైటింగ్ మరియు అక్కడక్కడా క్రోమ్ యాక్సెంట్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

మార్కెట్లో విడుదలైన 24 గంటల్లోనే అమ్ముడైపోయిన స్కోడా కొడియాక్ (Skoda Kodiaq) ఎస్‌యూవీ!

ఇక సేఫ్టీ విషయానికి వస్తే, కొత్త 2022 స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ కారులో హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), మెకానికల్ బ్రేక్ అసిస్ట్ విత్ హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు తొమ్మిది ఎయిర్ బ్యాగ్‌లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

మార్కెట్లో విడుదలైన 24 గంటల్లోనే అమ్ముడైపోయిన స్కోడా కొడియాక్ (Skoda Kodiaq) ఎస్‌యూవీ!

కొత్త 2022 స్కోడా కోడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ ఎస్‌యూవీ ఒకే ఒక ఇంజన్ ఆప్షన్ తో లభిస్తుంది. ఇందులో ఉపయోగించిన 2.0 లీటర్, ఫోర్-సిలిండర్ టిఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 190 బిహెచ్‌పి పవర్ ను మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ కొత్త ఎస్‌యూవీ యొక్క అన్ని వేరియంట్లు కూడా స్టాండర్డ్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ను కలిగి ఉంటాయి.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda kodiaq facelift sold out just in 24 hours after launched in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X