వియత్నాం ఎగుమతికి సిద్దమవుతున్న స్కోడా కుషాక్ & స్లావియా - ఎప్పటి నుంచో తెలుసా?

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కోడా కంపెనీ యొక్క 'కుషాక్ మరియు స్లావియా' కార్లను కంపెనీ వియత్నాం దేశానికి ఎగుమతి చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ వీటిని 2024 నుంచి ఎగుమతి చేయనున్నట్లు తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

స్కోడా కుషాక్ ఎస్‌యూవీ మరియు స్లావియా సెడాన్ రెండూ కూడా భారత మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్నాయి. ఈ రెండు మోడల్స్ కంపెనీ యొక్క 2022 అమ్మకాలను పెంచడంలో బాగా దోహదపడ్డాయి. కంపెనీ ఇప్పటికే ఈ మోడల్స్ (కుషాక్ & స్లావియా) ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయడం ప్రారంభించింది. కాగా ఇప్పుడు 2024 నుంచి వియత్నాం దేశానికి ఎగుమతి చేయడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలను సిద్ధం చేసుకుంటుంది.

వియత్నాం ఎగుమతికి సిద్దమవుతున్న స్కోడా కుషాక్ & స్లావియా

భారతదేశంలోని చకాన్ ప్లాంట్‌లో తయారైన కుషాక్ ఇప్పటికే అరబ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు మరియు భారత ఉపఖండంలోని కొన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయబడతాయి. నిజానికి స్కోడా కంపెనీ 2011 నుంచి ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఇప్పటికి వరకు కంపెనీ దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకు మాత్రమే కాకుండా.. అరబ్ దేశాలతో సహా మొత్తం 44 దేశాలకు తన కార్లను ఎగుమతి చేస్తోంది.

చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ అయిన స్కోడా కంపెనీకి భారతదేశం అతి పెద్ద మూడవ మార్కెట్ గా అవతరించింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ భారతీయ మార్కెట్లో ఎంత ఆదరణ పొందుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోని చాలా దేశాలు స్కోడా కార్లను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే వియత్నం కూడా స్కోడా కార్లను వినియోగించడానికి సుముఖుత చూపుతోంది. కావున స్కోడా స్లావియా, కుషాక్ త్వరలోనే వియత్నంలో అడుగుపెట్టనున్నాయి.

వియత్నాం ఎగుమతికి సిద్దమవుతున్న స్కోడా కుషాక్ & స్లావియా

స్కోడా ఆటో వియత్నామీస్ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు దాని స్థానిక భాగస్వామి, 'థాన్ కాంగ్ మోటార్ వియత్నాం' (TC Motor) సహకారంతో, 2023 నాటికి దేశంలో మొదటి బ్యాచ్ యూరోపియన్ మోడల్‌లను విడుదల చేస్తోంది. కంపెనీ ప్రారంభంలో సంవత్సరానికి 30,000 వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కంపెనీ తగిన సన్నాహాలు కూడా సిద్ధం చేస్తోంది. కావున 2024 నాటికి వియత్నంలో స్కోడా స్లావియా, కుషాక్ విక్రయించబడతాయి.

స్కోడా కుషాక్ మరియు స్లావియా విషయానికి వస్తే, భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొంది కంపెనీకి ఎక్కువ అమ్మకాలు తీసుకురావడంలో దోహదపడింది. కుషాక్ SUV మరియు స్లావియా సెడాన్ మేడ్-ఇన్-ఇండియా MQB-A0 IN ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించబడ్డాయి. ఇవి రెండూ కూడా అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ కారణంగానే ఎక్కువ మంది కొనుగోలుదారులు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.

స్కోడా కుషాక్ ఇటీవల గ్లోబెల్ NCAP క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ పొంది అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా చేరింది. భారతీయ మార్కెట్లో స్కోడా కుషాక్ మరియు స్లావియా రెండూ MQB-A0 IN ప్లాట్‌ఫారమ్ పైన నిర్మించబడి ముందుకు సాగుతూ మంచి విజయాన్ని పొందుతున్నాయి. కంపెనీ ఇండియా 2.0 కింద కొత్త ఉత్పత్తులను విడుదల చేయడమే కాకుండా.. 2022 డిసెంబర్ నాటికి 250 టచ్‌పాయింట్‌లను విస్తరించనుంది.

భారతదేశంలో టచ్‌పాయింట్‌లు పెరగటం వల్ల కంపెనీ యొక్క నెట్‌వర్క్‌ క్రమంగా పెరుగుతోంది. అదే సమయంలో కంపెనీ తన కార్లకు తక్కువ నిర్వహణ ఖర్చులను కూడా ఎనేబుల్ చేసింది మరియు వాటిని పూర్తిగా డిజిటలైజ్ చేయడం ద్వారా షోరూమ్‌లను అప్‌గ్రేడ్ చేసింది. కంపెనీ మార్కెట్లో కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌ను మరింత మెరుగుపరచడానికి 'ఫ్యాన్స్ ఆఫ్ స్కోడా' అనే కొత్త మూవ్‌మెంట్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, December 22, 2022, 10:09 [IST]
English summary
Skoda kushaq and slavia export to start from 2024 details
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+