భార‌త్‌లో సక్సెస్ సాధించి.. విదేశాలకు పయనమైన స్కోడా కుషాక్

చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) భారతీయ మార్కెట్లో 'కుషాక్' (Kushaq) SUV విడుదల చేసి అమ్మకాలలో ఘన విజయం పొందింది. అయితే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ లో కూడా తన హవా చాటుకోవడానికి సిద్ధమైపోయింది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ SUV ని ఎగుమతి చేయడానికి సిద్ధం చేసింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

భార‌త్‌లో సక్సెస్ సాధించి.. విదేశాలకు పయనమైన స్కోడా కుషాక్

స్కోడా కంపెనీ అందించిన సమాచారం ప్రకారం తన కుషాక్ SUV ని అరబ్ దేశాలకు ఎగుమతి చేయనుంది. అయితే అరబ్ దేశాలకు ఎగుమతి చేసే కుషాక్ లెఫ్డ్ హ్యాండ్ డ్రైవ్ కార్లు కావడం విశేషం. స్కోడా కుషాక్ ఇప్పుడు భారతదేశం నుండి ఎగుమతి చేయబడే MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ ఆధారిత మూడవ మోడల్.

భార‌త్‌లో సక్సెస్ సాధించి.. విదేశాలకు పయనమైన స్కోడా కుషాక్

భారతదేశంలోని చకాన్ ప్లాంట్‌లో తయారైన కుషాక్ ఇప్పుడు అరబ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు మరియు భారత ఉపఖండంలోని కొన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయబడతాయి. నిజానికి స్కోడా కంపెనీ 2011 నుంచి ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఇప్పటికి వరకు కంపెనీ దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకు మాత్రమే కాకుండా.. అరబ్ దేశాలతో సహా మొత్తం 44 దేశాలకు తన కార్లను ఎగుమతి చేస్తోంది.

భార‌త్‌లో సక్సెస్ సాధించి.. విదేశాలకు పయనమైన స్కోడా కుషాక్

స్కోడా మరియు ఫోక్స్‌వ్యాగన్ ఇప్పటివరకు 5.5 లక్షల వాహనాలను భారతదేశం నుండి ఎగుమతి చేసింది. ప్రస్తుతం, కంపెనీ భారతదేశం నుండి మెక్సికోకు అత్యధిక సంఖ్యలో కార్లను ఎగుమతి చేస్తోంది. ఆ తరువాత దక్షిణ అమెరికా, ఆఫ్రికా మరియు మధ్య అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తోంది.

భార‌త్‌లో సక్సెస్ సాధించి.. విదేశాలకు పయనమైన స్కోడా కుషాక్

ఇదిలా ఉండగా ఫోక్స్‌వ్యాగన్ ఇటీవలే దేశీయ మార్కెట్ నుంచి తన కొత్త సెడాన్ 'వర్టస్' (Virtus) ను ఎగుమతి చేయడం ప్రారంభించింది. కంపెనీ ఈ SUV యొక్క 3,000 యూనిట్లను మొదటి ముంబై పోర్ట్ నుండి మెక్సికోకు ఎగుమతి చేసింది. అయితే ఎగుమతి చేయనున్న ఈ కార్లు అన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ (ఎడమ చేతి డ్రైవ్) మోడల్ అని కంపెనీ తెలిపింది.

భార‌త్‌లో సక్సెస్ సాధించి.. విదేశాలకు పయనమైన స్కోడా కుషాక్

స్కోడా కుషాక్ విషయానికి వస్తే, భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొంది కంపెనీకి ఎక్కువ అమ్మకాలు తీసుకురావడంలో దోహదపడింది. ఈ SUV అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ కారణంగానే ఎక్కువమంది కొనుగోలుదారులు ఈ SUV ని ఎక్కువగా కొనుగోలు చేశారు.

భార‌త్‌లో సక్సెస్ సాధించి.. విదేశాలకు పయనమైన స్కోడా కుషాక్

స్కోడా కుషాక్ యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ అనే మూడు ట్రిమ్‌లలో మొత్తం 7 వేరియంట్‌లలో లభిస్తుంది. ఇది మొత్తం రెండు ఇంజిన్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి 1.0 లీటర్ మూడు సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్.

భార‌త్‌లో సక్సెస్ సాధించి.. విదేశాలకు పయనమైన స్కోడా కుషాక్

ఇందులోని 1.0 లీటర్ మూడు సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది. ఇక రెండవ ఇంజిన్ 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్‌తో 7 స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ ఆప్సన్ కలిగి ఉంది.

భార‌త్‌లో సక్సెస్ సాధించి.. విదేశాలకు పయనమైన స్కోడా కుషాక్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

స్కోడా కంపెనీ యొక్క కుషాక్ దేశీయ మార్కెట్లో సక్సెస్ సాధించిన తరువాత ఇప్పుడు ఎగుమతికి సిద్ధమైంది. అయితే ఈ SUV విదేశీ మార్కెట్లో కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని కథనాల కోసం ఎప్పటికప్పడు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, October 4, 2022, 14:43 [IST]
English summary
Skoda kushaq exports starts from india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+