గుడ్ న్యూస్.. Kushaq ఎస్‌యూవీపై రూ. 15,000 తగ్గింపు.. ఆ వేరియంట్‌కి మాత్రమే
ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా (Skoda) యొక్క ప్రముఖ SUV అయిన కుషాక్ (Kushaq) మార్కెట్లో విపరీతమైన ప్రజాదరణ పొందిన మోడల్. అయితే కంపెనీ ఈ మోడల్ యొక్క స్టైల్ వేరియంట్ మీద ఇప్పుడు ఏకంగా రూ. 15,000 డిస్కౌంట్ అందించనుంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

భారతీయ మార్కెట్లో చాలా కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నాయి. అయితే స్కోడా కంపెనీ మాత్రమే ఈ సమయంలో తన కుషాక్ SUV ధర తగ్గించడానికి ప్రధాన కారణం కూడా ఉంది. అదేమంటే స్కోడా కుషాక్ స్టైల్ వేరియంట్‌లో ఇప్పుడు ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ ఇవ్వడం లేదు. ఈ కారణంగానే కంపెనీ రూ. 15,000 తగ్గింపును అందిస్తుంది.

ప్రస్తుతం ఆటో మొబైల్ పరిశ్రమలో సెమీకండక్టర్ చిప్ కొరత ఉండటం వల్ల స్కోడా కుషాక్‌లో ఆటో ఫోల్డింగ్ మిర్రర్ అందించబడలేదు. ఈ తగ్గింపు 2022 మోడల్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇటీవలి 2022 జనవరి నాటికి రూ. 19,000 నుంచి రూ. 29,000 వరకు పెరిగినందున స్కోడా కుషాక్ యొక్క స్టైల్ వేరియంట్‌పై మాత్రమే ఈ తగ్గింపు అందుబటులో ఉంటుంది.

అయితే స్కోడా యొక్క యాంబిషన్ వేరియంట్ ధరలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి స్టైల్ మినహా, మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఇతర వేరియంట్‌ల ధరల్లో ఎటువంటి మార్పులు లేదు. దీనిని కొనుగోలుదారులు తప్పకుండా గుర్తించాలి.

కుషాక్ యొక్క అన్ని వేరియంట్‌లు ప్రస్తుతం మాన్యువల్‌గా సర్దుబాటు చేయగల మిర్రర్‌తో అందించబడుతున్నాయి. పరిస్థితి మెరుగుపడినప్పుడు, కస్టమర్‌లు ఆటో-అడ్జస్ట్ మిర్రర్‌లను దానిలో తర్వాత ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆటో ఫోల్డింగ్ మిర్రర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై కంపెనీ ఇంకా ఒక స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.

ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ కొరత కారణంగా చాలా మంది వాహన తయారీదారులు చాలా వరకు కొన్ని ఫీచర్లను తగ్గించవలసి ఉంటుంది. ఇందులో భాగంగానే స్కోడా తన కుషాక్ నుండి ఆటో ఫోల్డింగ్ మిర్రర్ ఫీచర్‌ను తీసివేసింది. అయితే ఈ మోడల్ యొక్క అమ్మకాలు ఎలా ఉంటాయో త్వరలో తెలుస్తాయి.

స్కోడా ఆటో ఇండియా ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం 2022 జనవరి 01 నుంచి దాదాపు తమ అన్ని మోడల్ ధరలను పెంచడం జరిగింది. భారతదేశంలో ముడిసరుకుల ధరలు పెరగటం వల్ల ధరలు పెంచడం జరిగిందని కంపెనీ తెలిపింది. ఈ కారణంగానే కంపెనీ యొక్క కుశాఖ్ SUV మాత్రమే కాకుండా.. ర్యాపిడ్, ఆక్టావియామరియు కొడియాక్ వంటి మోడల్స్ కూడా ఖరీదైనవిగా మారిపోయాయి.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న స్కోడా కుషాక్ యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ అనే మూడు ట్రిమ్‌లలో మొత్తం 7 వేరియంట్‌లలో లభిస్తుంది. అదే సమయంలో ఈ SUV రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి. రెండు ఇంజన్లు మాన్యువల్, ఆటోమేటిక్ మరియు DSG గేర్‌బాక్స్‌లతో అందుబాటులోకి వచ్చాయి.

స్కోడా కుషాక్ 2022 చివరి నాటికి భారతదేశంలో 60,000 కార్లను విక్రయించనుంది. ఈ SUV ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటికి ఎక్కువ సంఖ్యలోనే బుక్ చేయబడ్డాయి. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క ఈ కొత్త SUV కి దేశంలో ఎలాంటి ఆదరణ ఉంది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.
స్కోడా కుషాక్ 2021 జూన్‌లో ప్రారంభించబడినప్పటి నుండి దాని బుకింగ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే కంపెనీ కూడా తన పరిధిని మరింత పెంచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఇది తన ఉనికిని చాలా వేగంగా విస్తరిస్తోంది.

దక్షిణ భారతదేశంలో కంపెనీ 38 టచ్ పాయింట్లుగా ఉన్న తన డీలర్‌షిప్‌లను 70 కి పెంచింది. ఈ కారణంగా అమ్మకాలు మరింత వేగంగా పెరిగాయి. స్కోడా కంపెనీ ఈ కొత్త కుషాక్ SUV ని MQB-A0-IN డిజైన్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించింది. అయితే ఈ SUV లో కంపెనీ 95 శాతం వరకు స్థానికీకరణను ఉపయోగించింది. స్కోడా కుషాక్ SUV ని కంపెనీ భవిష్యత్తులో అన్ని భాగాలను భారతదేశంలోనే తయారుచేసే అవకాశం ఉంటుంది.

స్కోడా కుషాక్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో స్కోడా యొక్క ఐకానిక్ ఫ్రంట్ గ్రిల్ ఇవ్వబడింది. ఇది కాకుండా, కారులో LED హెడ్‌ల్యాంప్స్, LED ఫాగ్ ల్యాంప్స్ మరియు LED టెయిల్ లైట్లు ఇవ్వబడ్డాయి. కారు ముందు భాగంలో పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు దిగువ భాగంలో బోనెట్ వంటివి ఉన్నాయి.

ఇందులో మల్టిఫుల్ ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐసోఫిక్స్ సీట్లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు మల్టీ-కొలిక్షన్ బ్రేక్‌లు, ఎబిడి విత్ ఇబిడి వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
స్కోడా కుషాక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, ఆటో-డిమ్మింగ్ హెడ్‌ల్యాంప్స్, యాంబియంట్ క్యాబిన్ లైటింగ్, స్కోడా 6-స్పీకర్ ఆడియో సిస్టమ్‌తో కూడిన సబ్ వూఫర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఎలక్ట్రో-ఆపరేటెడ్ మరియు ఆటో- ఫోల్డ్ ORVM లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








