విడుదలకు సిద్దమవుతున్న 'స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్': వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కోడా కంపెనీ యొక్క 'కుషాక్' ఇప్పుడు 'మోంటే కార్లో ఎడిషన్‌'తో రాడానికి సిద్ధమౌతోంది. ఇప్పటికే కంపెనీ 'స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్‌'పై పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన కొంత సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

విడుదలకు సిద్దమవుతున్న 'స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్': వివరాలు

ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం స్కోడా యొక్క కుషాక్ మోంటే కార్లో (Skoda Kushaq Monte Carlo) ఎడిషన్‌ను కంపెనీ 2022 మే 9న మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేయనుంది. ఈ కొత్త మోడల్ ఇతర స్కోడా మోంటే కార్లో మోడల్‌ల మాదిరిగానే అద్భుతమైన డిజైన్ కలిగి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే చాలా వరకు లేటెస్ట్ ఫీచర్స్ మరియు కాస్మెటిక్ అప్‌డేట్స్ కూడా పొందుతుంది.

విడుదలకు సిద్దమవుతున్న 'స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్': వివరాలు

త్వరలో రానున్న స్కోడా కుషాక్ మోంటే కార్లో (Skoda Kushaq Monte Carlo) ఎడిషన్‌ రెడ్ మరియు వైట్ ఎక్స్టీరియర్స్ డిజైన్ పొందుతుందని భావిస్తున్నారు. అంతే కాకుండా ఇది మునుపటి తరం స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 245 మాదిరిగానే 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ పొందే అవకాశం ఉంది. అదే సమయంలో కుషాక్ మోంటే కార్లో యొక్క ఫ్రంట్ ఫెండర్‌లపైన మోంటే కార్లో బ్యాడ్జింగ్స్ ఉంటాయి.

విడుదలకు సిద్దమవుతున్న 'స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్': వివరాలు

ఇక కుషాక్ మోంటే కార్లో ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉపయోగించబడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ తీసివేసే అవకాశం ఉంటుంది. ఆ స్థానంలో స్కోడా స్లావియాలో ఉపయోగిస్తున్న కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రెడ్ గ్రాఫిక్స్‌తో రానుంది.

విడుదలకు సిద్దమవుతున్న 'స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్': వివరాలు

కొత్త కుషాక్ మోంటే కార్లో ఎడిషన్ యొక్క సీట్లు, మోంటే కార్లో బ్యాడ్జింగ్‌తో డ్యూయల్ టోన్ రెడ్ మరియు బ్లాక్ అపోల్స్ట్రే పొందే అవకాశం ఉంటుంది. అంతే కాకూండా ఇందులో డ్యాష్ బోర్డు మరియు నాలుగు డోర్లతో పాటు సెంటర్ కన్సోల్‌ వంటికి రెడ్ యాక్సెంట్స్ పొందుతాయి. ఇవన్నీ కూడా టాప్ మోడల్ లో ఉండే అవకాశం ఉంటుంది.

విడుదలకు సిద్దమవుతున్న 'స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్': వివరాలు

కుషాక్ మోంటే కార్లో అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇందులో ఫుల్లీ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఆటోమేటిక్ వైపర్‌లు, హెడ్‌ల్యాంప్‌లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సబ్ వూఫర్‌తో కూడిన 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్స్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి టాప్-స్పెక్ ఫీచర్స్ ఉండనున్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

విడుదలకు సిద్దమవుతున్న 'స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్': వివరాలు

ఇక ఇంజిన్ విషయానికి వస్తే, స్కోడా స్లావియా సాధారణ కుషాక్‌లో కనిపించే 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇందులోని 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 114 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

విడుదలకు సిద్దమవుతున్న 'స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్': వివరాలు

1.5-లీటర్ ఇంజన్ 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 148 బిహెచ్‌పి పవర్ మరియు 1,500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ప్రామాణికంగా అందించబడ్డాయి. అయితే 1.0-లీటర్ ఇంజన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ లేదా 7-స్పీడ్ ట్విన్-క్లచ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందించబడుతుంది.

విడుదలకు సిద్దమవుతున్న 'స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్': వివరాలు

మార్కెట్లో విడుదలకానున్న కొత్త కుషాక్ మోంటే కార్లో యొక్క ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే కుషాక్ మోంటే కార్లో ధర దాని స్టాండర్డ్ మోడల్ కంటే దాదాపు రూ. 80,000 నుండి రూ. 1 లక్ష వరకు ఎక్కువ ఉంటుంది. కావున ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత ఎలాంటి ఆదరణ పొందుతుంది అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.

విడుదలకు సిద్దమవుతున్న 'స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్': వివరాలు

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త మిడ్-సైజ్ సెడాన్ 'స్కోడా స్లావియా' మొదటి నెలలో 10,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను పొందింది. ఈ సెడాన్ ధరలు రూ. 10.69 లక్షల నుండి రూ. 17.79 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్యలో ఉన్నాయి. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, మంచి పనితీరుని అందిస్తుంది.

స్కోడా స్లావియా ఈ విభాగంలో మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ విభాగంలోని ఇతర పోటీదారులతో పోలిస్తే స్కోడా స్లావియా సరికొత్త మోడల్ కాబట్టి దేశీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పొందుతోంది.

More from DriveSpark

Article Published On: Saturday, April 16, 2022, 10:05 [IST]
English summary
Skoda kushaq monte carlo edition set to be launched on 9 april details
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+