స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్: లాంచ్ డేట్ & పూర్తి వివరాలు
చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన 'కుషాక్' (Kushaq) ఎస్‌యూవి ఇప్పుడు 'మోంటే కార్లో ఎడిషన్' భారతీయ మార్కెట్లో విడుదలవడానికి సిద్ధమైపోయింది. కంపెనీ ఇప్పుడు ఈ కొత్త ఎడిషన్ ను 2022 మే 09 న విడుదలచేయనున్నట్లు తెలిపింది. త్వరలో విడుదల కానున్న ఈ కొత్త ఎడిషన్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం.. రండి.

స్కోడా మోంటే కార్లో ఎడిషన్ ఇప్పుడు అధికారికంగా మార్కెట్లో విడుదలకాకముందే డీలర్ స్టాక్‌యార్డ్‌లో కనిపించింది. ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ కొత్త ఎడిషన్ వివిధ కలర్ ఆప్సన్స్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మనకు కనిపించిన ఫోటోల ప్రకారం ఇది 'టోర్నాడో రెడ్ కలర్' ఆప్సన్ లో ఉంది. అయితే ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.

స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్ ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందే అవకాశం ఉంది. కావున ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా అనేక అప్డేటెడ్ ఫీచర్స్ పొందనుంది. అంతే కాకుండా ఇది లేటెస్ట్ కాస్మెటిక్ అప్డేట్స్ కూడా పొందింది. ఇప్పుడు వెలువడిన ఫోటోల ప్రకారం, ఇది గ్లోస్ బ్లాక్ రూఫ్, ఓఆర్‌విఎమ్, రూఫ్ రైల్స్, ఫ్రంట్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు ఫ్రంట్ ఫెండర్‌లపై 'మోంటే కార్లో' బ్యాడ్జింగ్ వంటి బ్లాక్-అవుట్ ఎలిమెంట్స్ పొందింది.

వీటితో పాటు కంపెనీ యొక్క 'స్కోడా' బ్యాడ్జ్ మరియు 'కుషాక్' వంటి బ్యాడ్జ్ లు దాని బూట్ పైన బ్లాక్ కలర్ లో ఉండటం మీరు గమనించవచ్చు. అంతే కాకూండా రియర్ ప్రొఫైల్ లో టెయిల్ లాంప్ వంటివి మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఇక 'కుషాక్ మోంటే కార్లో ఎడిషన్' యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులోని డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్ మరియు డోర్ ప్యాడ్స్ గ్లోస్ రెడ్ ఇన్సర్ట్‌తో పాటు బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. మొత్తం మీద ఇంటీరియర్ డ్యూయెల్ టోన్ కలర్ పొందటంతో పాటు అక్కడక్కడా క్రోమ్ పొందుతుంది.

కుషాక్ మోంటే కార్లో ఎడిషన్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉపయోగించనుంది. అయితే ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ తీసివేసే అవకాశం ఉంటుంది. ఆ స్థానంలో స్కోడా స్లావియాలో ఉపయోగిస్తున్న కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రెడ్ గ్రాఫిక్స్‌తో రానుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

స్కోడా కుషాక్ మోంటే కార్లో (Skoda Kushaq Monte Carlo) ఎడిషన్ మునుపటి తరం స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 245 మాదిరిగానే 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. అదే సమయంలో దీని ఫ్రంట్ ఫెండర్‌లపైన మోంటే కార్లో బ్యాడ్జింగ్స్ కూడా ఉంటుంది. ఇది కుషాక్ యొక్క స్టైల్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

కుషాక్ మోంటే కార్లో పూర్తి ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఆటోమేటిక్ వైపర్‌లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సబ్ వూఫర్‌తో కూడిన 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్స్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి టాప్-స్పెక్ ఫీచర్లను పొందుతుంది.

ఇక ఇంజిన్ విషయానికి వస్తే, స్కోడా స్లావియా సాధారణ కుషాక్‌లో కనిపించే 1.0-లీటర్ టిఎస్ఐ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ ఇంజిన్లను పొందుతుంది. ఇందులోని 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 114 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

1.5-లీటర్ ఇంజన్ 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 148 బిహెచ్‌పి పవర్ మరియు 1,500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ప్రామాణికంగా అందించబడ్డాయి. అయితే 1.0-లీటర్ ఇంజన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ లేదా 7-స్పీడ్ ట్విన్-క్లచ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందించబడుతుంది.

భారతీయ విఫణిలో విడుదల కానున్న ఈ కొత్త కుషాక్ మోంటే కార్లో అధికారిక ధరలు కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 80,000 నుంచి రూ. 1 లక్ష ఎక్కువ ధర కలిగి ఉండే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. అయితే దీని ఖచ్చితమైన ధర విడుదల సమయంలో తెలుస్తుంది. కుషాక్ మోంటే కార్లో ఎడిషన్ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మరియు ఫోక్స్వ్యాగన్ టైగన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
Source: Team BHP


Click it and Unblock the Notifications








