మళ్ళీ పెరిగిన Skoda Kushaq ధరలు.. ఇప్పుడు ఎంత పెరిగిందంటే?

భారతీయ మార్కెట్లో గత సంవత్సరం 2021 లో చాలా కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచాయి. అయితే ఇప్పుడు తాజాగా 2022 లో కూడా ధరల పెరుగుదల జరుగుతుందని చాలా కంపెనీలు 2021 చివరిలోనే తెలిపాయి. ఇప్పుడు ఎట్టకేలకు ఒక్కొక్కటిగా తమ వాహనాల ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. ఇందులో ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా (Skoda) కూడా ఉంది.

మళ్ళీ పెరిగిన Skoda Kushaq ధరలు.. ఇప్పుడు ఎంత పెరిగిందంటే?

నివేదికల ప్రకారం స్కోడా కంపెనీ తన కుషాక్ (Kushaq) SUV ధరను ఇప్పుడు రూ. 19,000 నుంచి రూ. 29,000 వరకు పెంచింది. ధరల పెరుగుదల తరువాత కంపెనీ యొక్క ఈ కొత్త SUV ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ.10.99 లక్షలు కాగా, ఇందులోని టాప్ వేరియంట్ ధర రూ.18.19 లక్షలు వరకు ఉంటుంది.

మళ్ళీ పెరిగిన Skoda Kushaq ధరలు.. ఇప్పుడు ఎంత పెరిగిందంటే?

స్కోడా కుషాక్ కొత్త ధరలు:

  • స్కోడా యాక్టివ్ (Skoda Active): రూ. 10.99 లక్షలు
  • స్కోడా యాంబిషన్ (Skoda Ambition): రూ. 12.79 లక్షలు - రూ. 14.19 లక్షలు
  • స్కోడా స్టైల్ (Skoda Style): రూ. 14.89 లక్షలు - రూ. 16.49 లక్షలు
  • స్కోడా స్టైల్ (1.5L TSI): రూ 16.49 లక్షలు - రూ 18.19 లక్షలు
  • మళ్ళీ పెరిగిన Skoda Kushaq ధరలు.. ఇప్పుడు ఎంత పెరిగిందంటే?

    స్కోడా ఆటో ఇండియా ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం 2022జనవరి 01 నుంచి దాదాపు తమ అన్ని మోడల్ ధరలను పెంచడం జరిగింది. భారతదేశంలో ముడిసరుకుల ధరలు పెరగటం వల్ల ధరలు పెంచడం జరిగిందని కంపెనీ తెలిపింది. ఈ కారణంగానే కంపెనీ యొక్క కుశాఖ్ SUV మాత్రమే కాకుండా.. ర్యాపిడ్, ఆక్టావియామరియు కొడియాక్ వంటి మోడల్స్ కూడా ఖరీదైనవిగా మారిపోయాయి.

    మళ్ళీ పెరిగిన Skoda Kushaq ధరలు.. ఇప్పుడు ఎంత పెరిగిందంటే?

    ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న స్కోడా కుషాక్ యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ అనే మూడు ట్రిమ్‌లలో మొత్తం 7 వేరియంట్‌లలో లభిస్తుంది. అదే సమయంలో ఈ SUV రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి. రెండు ఇంజన్లు మాన్యువల్, ఆటోమేటిక్ మరియు DSG గేర్‌బాక్స్‌లతో అందుబాటులోకి వచ్చాయి.

    మళ్ళీ పెరిగిన Skoda Kushaq ధరలు.. ఇప్పుడు ఎంత పెరిగిందంటే?

    స్కోడా కుషాక్ 2022 చివరి నాటికి భారతదేశంలో 60,000 కార్లను విక్రయించనుంది. ఈ SUV ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటికి ఎక్కువ సంఖ్యలోనే బుక్ చేయబడ్డాయి. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క ఈ కొత్త SUV కి దేశంలో ఎలాంటి ఆదరణ ఉంది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.

    మళ్ళీ పెరిగిన Skoda Kushaq ధరలు.. ఇప్పుడు ఎంత పెరిగిందంటే?

    స్కోడా కుషాక్ 2021 జూన్‌లో ప్రారంభించబడినప్పటి నుండి దాని బుకింగ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే కంపెనీ కూడా తన పరిధిని మరింత పెంచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఇది తన ఉనికిని చాలా వేగంగా విస్తరిస్తోంది.

    మళ్ళీ పెరిగిన Skoda Kushaq ధరలు.. ఇప్పుడు ఎంత పెరిగిందంటే?

    దక్షిణ భారతదేశంలో కంపెనీ 38 టచ్ పాయింట్లుగా ఉన్న తన డీలర్‌షిప్‌లను 70 కి పెంచింది. ఈ కారణంగా అమ్మకాలు మరింత వేగంగా పెరిగాయి. స్కోడా కంపెనీ ఈ కొత్త కుషాక్ SUV ని MQB-A0-IN డిజైన్ ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా రూపొందించింది. అయితే ఈ SUV లో కంపెనీ 95 శాతం వరకు స్థానికీకరణను ఉపయోగించింది. స్కోడా కుషాక్ SUV ని కంపెనీ భవిష్యత్తులో అన్ని భాగాలను భారతదేశంలోనే తయారుచేసే అవకాశం ఉంటుంది.

    మళ్ళీ పెరిగిన Skoda Kushaq ధరలు.. ఇప్పుడు ఎంత పెరిగిందంటే?

    స్కోడా కుషాక్‌ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో స్కోడా యొక్క ఐకానిక్ ఫ్రంట్ గ్రిల్ ఇవ్వబడింది. ఇది కాకుండా, కారులో LED హెడ్‌ల్యాంప్స్, LED ఫాగ్ ల్యాంప్స్ మరియు LED టెయిల్ లైట్లు ఇవ్వబడ్డాయి. కారు ముందు భాగంలో పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు దిగువ భాగంలో బోనెట్ వంటివి ఉన్నాయి.

    మళ్ళీ పెరిగిన Skoda Kushaq ధరలు.. ఇప్పుడు ఎంత పెరిగిందంటే?

    స్కోడా కుషాక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, ఆటో-డిమ్మింగ్ హెడ్‌ల్యాంప్స్, యాంబియంట్ క్యాబిన్ లైటింగ్, స్కోడా 6-స్పీకర్ ఆడియో సిస్టమ్‌తో కూడిన సబ్‌ వూఫర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఎలక్ట్రో-ఆపరేటెడ్ మరియు ఆటో- ఫోల్డ్ ORVM లు ఉన్నాయి.

    మళ్ళీ పెరిగిన Skoda Kushaq ధరలు.. ఇప్పుడు ఎంత పెరిగిందంటే?

    ఇందులో మల్టిఫుల్ ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐసోఫిక్స్ సీట్లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు మల్టీ-కొలిక్షన్ బ్రేక్‌లు, ఎబిడి విత్ ఇబిడి వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

    మళ్ళీ పెరిగిన Skoda Kushaq ధరలు.. ఇప్పుడు ఎంత పెరిగిందంటే?

    స్కోడా కుషాక్ రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. మొదటి ఇంజిన్ 1.0-లీటర్ మూడు సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, ఇది 115 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ అందుబాటులో ఉంటుంది.

    మళ్ళీ పెరిగిన Skoda Kushaq ధరలు.. ఇప్పుడు ఎంత పెరిగిందంటే?

    ఇక రెండవ ఇంజిన్ 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్‌తో 7 స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ ఆప్సన్ కలిగి ఉంది. మొత్తానికి స్కోడా కుషాక్ దేశీయ మార్కెట్లో మరింత ఆదరణ పొందుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 6, 2022, 16:46 [IST]
English summary
Skoda kushaq suv price hike upto rs 29000 details
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+