మళ్ళీ పెరిగిన Skoda Kushaq ధరలు.. ఇప్పుడు ప్రారంభ ధర ఎంతంటే?
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'స్కోడా' (Skoda) ఎట్టకేలకు తన పాపులర్ SUV స్కోడా కుషాక్ (Skoda Kushaq) ధరలను రూ. 70,000 వరకు పెంచింది. దేశీయ మార్కెట్లో ఈ SUV కి ఉన్న డిమాండ్ మరియు ఇన్‌పుట్ ఖర్చులు కారణంగా ధరలు పెంచడం జరిగిందని కంపెనీ తెలిపింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో కుషాక్ (Kushaq) ధరలు పెరగడం ఇది వరుసగా రెండవ సారి. దీనిని బట్టి చూస్తే ఈ SUV కి దేశీయ విఫణిలో ఎంత డిమాండ్ ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. స్కోడా కంపెనీతో పాటు దేశీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ కూడా తన టైగన్ SUV ధరలను కూడా పెంచింది.

స్కోడా కంపెనీ ఇటీవలే కుషాక్ SUV లో రెండు కొత్త వేరియంట్స్ విడుదల చేసింది. ఇందులో ఒకటి 'కుషాక్ యాక్టివ్ పీస్' కాగా మరొకటి 'కుషాక్ యాంబిషన్ క్లాసిక్' వేరియంట్స్. ఇప్పుడు కుషాక్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుంచి ఉంటుంది.
| Skoda Kushaq MT | |||
| Variants | New Price | Old Price | Difference |
| Active Peace 1.0 TSI | ₹9.99 Lakh | - | - |
| Active 1.0 TSI | ₹11.29 Lakh | ₹10.99 Lakh | ₹30,000 |
| Ambition Classic 1.0 TSI | ₹12.69 Lakh | - | - |
| Ambition 1.0 TSI | ₹12.99 Lakh | ₹12.79 Lakh | ₹20,000 |
| Style 1.0 TSI | ₹15.29 Lakh | ₹14.89 Lakh | ₹40,000 |
| Style 1.5 TSI | ₹17.19 Lakh | ₹16.49 Lakh | ₹70,000 |
| Skoda Kushaq AT | |||
| Variants | New Price | Old Price | Difference |
| Ambition Classic 1.0 TSI AT | ₹14.09 Lakh | - | - |
| Ambition 1.0 TSI AT | ₹14.59 Lakh | ₹14.19 Lakh | ₹40,000 |
| Style 1.0 TSI AT | ₹16.09 Lakh | ₹16.09 Lakh | 0 |
| Style 1.0 TSI AT 6 Airbags | ₹16.99 Lakh | - | - |
| Style 1.5 TSI DSG | ₹17.79 Lakh | ₹17.79 Lakh | 0 |
| Style 1.5 TSI DSG 6 Airbags | ₹18.79 Lakh | ₹18.19 Lakh | ₹60,000 |

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, స్కోడా కుషాక్ యొక్క యాక్టివ్ 1.0 లీ టిఎస్ఐ ధర రూ. 30,000 పెరిగింది, కావున ఈ మోడల్ ధర ఇప్పుడు దేశీయ మార్కెట్లో రూ. 11.29 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ధరల పెరుగుదలకు ముందు దీని ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). అదే విధంగా యాంబిషన్ 1.0 లీ టిఎస్ఐ ధర రూ. 20,000 పెరిగి రూ. 12.99 లక్షలకు చేరింది.

ఇక కుషాక్ స్టైల్ 1.0లీ టిఎస్ఐ వేరియంట్ ధర రూ. 40,000 మరియు స్టైల్ 1.5లీ టిఎస్ఐ ధర రూ. 70,000 పెరిగాయి. ఇప్పుడు వీటి ధరలు వరుసగా రూ. 14.89 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) మరియు రూ. 16.49 లక్షలకు(ఎక్స్-షోరూమ్, ఇండియా) చేరాయి. అదే విధంగా యాంబిషన్ 1.0 లీ టిఎస్ఐ వేరియంట్ ధర రూ. 40,000 మరియు స్టైల్ 1.5 లీ టిఎస్ఐ డిఎస్జి ధర రూ. 60,000 పెరిగింది.

స్కోడా కుషాక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది 1.0-లీటర్ మూడు సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ అనే రెండు ఇంజిన్స్ అందుబటులో ఉంటాయి. ఇందులో మొదటిది 115 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక రెండవ ఇంజిన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరుని అందిస్తాయి.

స్కోడా కుషాక్ ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో మల్టిఫుల్ ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐసోఫిక్స్ సీట్లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు మల్టీ-కొలిక్షన్ బ్రేక్‌లు, ఎబిడి విత్ ఇబిడి వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

ఇదిలా ఉండగా స్కోడా కంపెనీ దేశీయ మార్కెట్లో ఈ నెల 09 న ' కుషాక్ మోంటే కార్లో ఎడిషన్' విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. స్కోడా మోంటే కార్లో ఎడిషన్ ఇప్పుడు అధికారికంగా మార్కెట్లో విడుదలకాకముందే డీలర్ స్టాక్‌యార్డ్‌లో కనిపించింది. ఈ కొత్త ఎడిషన్ వివిధ కలర్ ఆప్సన్స్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








