స్కోడా స్లావియా (Skoda Slavia)కి మొదటి నెలలో 10,000 బుకింగ్స్! ఈ కారుకి ఎందుకింత క్రేజ్..?

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో (Skoda Auto) గడచిన ఫిబ్రవరి నెలాఖరున భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త మిడ్-సైజ్ సెడాన్ 'స్కోడా స్లావియా' (Skoda Slavia) కస్టమర్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. సరసమైన ధరలు, అత్యుత్తమ ఫీచర్లు, ప్రీమియం ఇంటీరియర్ మరియు విభిన్న ఇంజన్ అండ్ గేర్‌బాక్స్ ఆప్షన్ల కారణంగా కస్టమర్లు ఈ కారు కోసం క్యూ కడుతున్నారు. ఈ కారును మార్కెట్లో విడుదల చేసిన మొదటి నెలలో 10,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ ప్రకటించింది.

స్కోడా స్లావియా (Skoda Slavia)కి మొదటి నెలలో 10,000 బుకింగ్స్! ఈ కారుకి ఎందుకింత క్రేజ్..?

భారత మార్కెట్లో స్కోడా స్లావియా సెడాన్ ధరలు రూ. 10.69 లక్షల నుండి రూ. 17.79 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్యలో ఉన్నాయి. స్కోడా స్లావియా (Skoda Slavia) సెడాన్ ఈ విభాగంలో మారుతి సుజుకి సియాజ్ (Maruti Suzuki Ciaz), హోండా సిటీ (Honda City), హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna) మరియు ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) వంటి మిడ్-సైజ్ సెడాన్లకు పోటీగా మరియు చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇది ఈ విభాగంలోని పోటీదారులతో పోలిస్తే, సరికొత్త మోడల్ కావడంతో దీనికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది.

స్కోడా స్లావియా (Skoda Slavia)కి మొదటి నెలలో 10,000 బుకింగ్స్! ఈ కారుకి ఎందుకింత క్రేజ్..?

స్కోడా స్లావియా పట్ల ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించి కానీ లేదా అధీకృత స్కోడా డీలర్‌షిప్ ను సందర్శించి కానీ రూ.11,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవ్చచు. స్కోడా స్లావియా మొత్తం మూడు ట్రిమ్ లలో (యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్) మరియు 8 వేరియంట్లలో విడుదల చేశారు. ఇది 1.0 లీటర్ టిఎస్ఐ మరియు 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

స్కోడా స్లావియా (Skoda Slavia)కి మొదటి నెలలో 10,000 బుకింగ్స్! ఈ కారుకి ఎందుకింత క్రేజ్..?

స్కోడా స్లావియా సెడాన్ యొక్క వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

* స్లావియా యాక్టివ్ 1.0 టిఎస్ఐ మ్యాన్యువల్ - రూ.10.69 లక్షలు

* స్లావియా యాంబిషన్ 1.0 టిఎస్ఐ మ్యాన్యువల్ - రూ.12.39 లక్షలు

* స్లావియా యాంబిషన్ 1.0 టిఎస్ఐ ఆటోమేటిక్ - రూ.13.59 లక్షలు

* స్లావియా స్టైల్ 1.0 టిఎస్ఐ మ్యాన్యువల్ (సన్‌రూఫ్ లేకుండా) - రూ.13.59 లక్షలు

* స్లావియా స్టైల్ 1.0 టిఎస్ఐ మ్యాన్యువల్ - రూ.13.99 లక్షలు

* స్లావియా స్టైల్ 1.0 టిఎస్ఐ ఆటోమేటిక్ - రూ.15.39 లక్షలు

* స్లావియా స్టైల్ 1.5 టిఎస్ఐ మ్యాన్యువల్ - రూ.16.19 లక్షలు

* స్లావియా స్టైల్ 1.5 టిఎస్ఐ ఆటోమేటిక్ - రూ.17.79 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

స్కోడా స్లావియా (Skoda Slavia)కి మొదటి నెలలో 10,000 బుకింగ్స్! ఈ కారుకి ఎందుకింత క్రేజ్..?

స్లావియా సెడాన్‌కు 10,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ రావడం పట్ల స్కోడా ఆటో ఇండియా హెడ్ జాక్ హోలిస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్‌లో.. సమయం చాలా వేగంగా గడిచిపోతోందని, తాము స్కోడా స్లావియా సెడాన్‌ని ప్రారంభించి ఇప్పటికే ఒక నెల పూర్తయ్యిందని, ఈ కారు కోసం ఇప్పటికే 10,000 లకు పైగా బుకింగ్‌లు వచ్చాయని అన్నారు. రోడ్లపై అనేక స్లావియా కార్లు తిరగడం చూస్తుంటే, భారతదేశంలో తమ దీర్ఘకాలిక లక్ష్యాల వైపు తాము సరైన మార్గంలో ప్రయాణిస్తుండటాన్ని సూచిస్తుందని, ఇది తమకు మరింత భరోసాను ఇస్తుందని అన్నారు.

స్కోడా స్లావియా (Skoda Slavia)కి మొదటి నెలలో 10,000 బుకింగ్స్! ఈ కారుకి ఎందుకింత క్రేజ్..?

కొత్త స్కోడా స్లావియా సెడాన్ విషయానికి వస్తే, కంపెనీ ఈ కారును ప్రత్యేకించి భారత మార్కెట్ కోసం డిజైన్ చేసింది. స్కోడా ర్యాపిడ్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు వచ్చిన స్కోడా స్లావియా సెడాన్ చాలా అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కారులో స్కోడా యొక్క సిగ్నేచర్ బటర్‌ఫ్లై షేప్ ఫ్రంట్ గ్రిల్ మరియు పెద్ద రేడియేటర్ గ్రిల్, L-ఆకారపు ప్రొజెక్టర్ హెడ్‌లైట్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్, షార్ప్ సైడ్ బాడీ లైన్స్ మరియు బూట్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ను ఇందులో గమనించవచ్చు.

స్కోడా స్లావియా (Skoda Slavia)కి మొదటి నెలలో 10,000 బుకింగ్స్! ఈ కారుకి ఎందుకింత క్రేజ్..?

స్కోడా స్లావియా సెడాన్ లో ప్రధానంగా లభించే ఫీచర్లను పరిశీలిస్తే, కంపెనీ ఈ కారులో డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో కూడిన క్యాబిన్ లేఅవుట్, ప్రీమియం అప్‌హోలెస్ట్రీ, డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్ మౌంటెండ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు స్కోడా కనెక్ట్ యాప్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 8 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ మొదలైన అనేక ఇతర ఫీచర్లను అందిస్తోంది.

స్కోడా స్లావియా (Skoda Slavia)కి మొదటి నెలలో 10,000 బుకింగ్స్! ఈ కారుకి ఎందుకింత క్రేజ్..?

ఇదివరకు చెప్పుకున్నట్లుగా స్కోడా స్లావియా రెండు రకాల పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో మొదటిది 1.0 లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్‌పి పవర్ ను మరియు 178 న్యూటన్ మీటర్ల టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇకపోతే, రెండవది 1.5 లీటర్ టిఎస్ఐ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్ ను మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో అందుబాటులో ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, April 4, 2022, 16:18 [IST]
English summary
Skoda slavia booking crosses 10000 units details
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+