ఉన్నట్టుండి మంటల్లో కాలిపోయిన 'స్కోడా స్లావియా'.. కంపెనీ దీనికి రీప్లే ఇలా ఇచ్చింది
స్కోడా (Skoda) కంపెనీ దేశీయ మార్కెట్లో ఈ సంవత్సరం ప్రారంభంలో తన 'స్లావియా' (Slavia) ను లాంచ్ చేసింది. కంపెనీ ఈ సెడాన్ ను మార్కెట్లో విడుదలచేసినప్పటినుంచి కూడా మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెల్తూనే ఉంది. అయితే ఇటీవల జరిగిన ఒక సంఘటనలో స్కోడా స్లావియా పూర్తిగా మంటల్లో కాలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

నివేదికల ప్రకారం.. ఈ సంఘటన లక్నోలో జరిగినట్లు తెలిసింది. స్కోడా స్లావియా ఓనర్ 'అభిషేక్ భాటియా' రోజూ మాదిరిగానే కారుని డ్రైవ్ చేసిన తమ ఇంటి యొక్క బేస్ ప్రదేశంలో పార్క్ చేసాడు, అయితే ఈ రోజు ఉదయం 3 గంటల సమయలో మంటలు చెలరేగాయని సమీపంలోని వాచ్ మెన్ చెప్పారని తెలిసింది.

కారులో మంటలు చెలరేగిన వెంటనే మంటలను ఆర్పడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా పూర్తిగా మంటలను ఆర్పలేకపోయాయారు. చివరికి కారు మొత్తం కాలిపోయింది. కారు కాలిపోవడానికి ఖచ్చితమైన కారణం తెలియదు. అయితే ఈ కారుకి భీమా ఉండటం వల్ల కాలిపోయిన కారు స్థానంలో మరో కొత్త కారుని పొందగలిగాడు. ఈ సంఘటన గత జూన్ నెలలో జరిగింది.

ఈ సంఘటన జరిగిన నాలుగు నెలల తరువాత కొత్త కారుని పొందగలిగాడు. మొదట్లో సంబంధిత అధికారులు తగిన విధంగా స్పందించలేదు, అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, పోస్ట్‌లు ఇంటర్నెట్లో వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

అభిషేక్ భాటియా ఈ స్కోడా స్లావియా కారుని మార్చిలో రిజిస్టర్ చేసుకున్నాడు. అయితే కారు ఓడోమీటర్ రీడింగ్ ప్రకారం ఇది కేవలం 4,000 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియోను అతడు ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అయితే స్కోడా కంపెనీ యొక్క అధికారులు ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ నుంచి తొలగించాలని కోరారు. అయితే అనేక అభ్యర్థనల తరువాత వీడియో తొలగించబడిందని అభిషేక్ చెప్పాడు.

స్కోడా స్లావియా అనేది కంపెనీ యొక్క MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన సెడాన్. కావున ఇది ఆధునిక డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. స్లావియా మొత్తం 5 కలర్ అప్సన్స్ లో అందించనుంది. అవి కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, టోర్నాడో రెడ్ మరియు క్రిస్టల్ బ్లూ కలర్స్.

కొత్త స్కోడా స్లావియా అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సెడాన్ సిగ్నేచర్ బటర్‌ఫ్లై షేప్ ఫ్రంట్ గ్రిల్ మరియు పెద్ద రేడియేటర్ గ్రిల్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇది L- షేప్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, 16-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు బూట్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ వంటివి కూడా పొందుతుంది. ఈ కారు యొక్క ORVMలపై టర్న్ ఇండికేటర్లను మరియు సైడ్ బాడీలో లైనింగ్‌ను పొందుతుంది.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్ మౌంట్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 25.4 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 20.32 సెం.మీ డిజిటల్ కాక్‌పిట్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి.
స్కోడా యొక్క స్లావియా రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. అవి ఒకటి 1.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్, మరొకటి 1.5-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజన్.
1.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కాగా రెండవ ఇంజిన్ 1.5-లీటర్ TSI టర్బో-పెట్రోల్ విషయానికి వస్తే, ఇది 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇవి రెండూ కూడా 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'స్కోడా స్లావియా'లో మంటలు చెలరేగటం దానికి ఒక స్పష్టమైన కారణం తెలియకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అయితే స్లావియా కాలిపోవడం వెనుక ఉన్న నిజాలను కంపెనీ వెల్లడించాల్సి అవసరం ఉంది. దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








