Slavia డెలివరీలు ఎప్పుడో చెప్పేసిన Skoda సీఈఓ: వివరాలు

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా (Skoda) దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న తదుపరి మోడల్ స్కోడా స్లావియా (Skoda Slavia). ఇప్పటికే కంపెనీ ఈ సెడాన్ ని భారత మార్కెట్లో ఆవిష్కరించింది. అయితే వచ్చే నెలలో అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. కావున డెలివరీలను మార్చిలో ప్రారంభించే అవకాశం ఉంటుంది. బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. స్కోడా స్లావియా త్వరలో డీలర్‌షిప్‌లకు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది, తరువాత టెస్ట్ డ్రైవ్ కూడా ప్రారంభమవుతుంది.

Slavia డెలివరీలు ఎప్పుడో చెప్పేసిన Skoda సీఈఓ: వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త స్కోడా స్లావియా డెలివరీకి సంబంధించి, కంపెనీ సిఇఒ 'జాక్ హోలిస్' మాట్లాడుతూ.. మార్చి ప్రారంభంలో డెలివరీలు ప్రారంభమవుతాయని తెలిపారు. అయితే ఈ కొత్త సెడాన్ ని ఇప్పటికే షోరూమ్‌లో కూడా చూడవచ్చు. ఈ కొత్త కారుని భారతీయ వినియోగదారులకు అందించడానికి చాలా ఉత్సాహంగా ఉందని కూడా అయన వెల్లడించాడు.

Slavia డెలివరీలు ఎప్పుడో చెప్పేసిన Skoda సీఈఓ: వివరాలు

నివేదికల ప్రకారం కంపెనీ ఈ కొత్త స్లావియా యొక్క విడుదల తేదీని త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంటుంది. ఈ కొత్త సెడాన్ విడుదలైన తరువాత ప్రతి నెలా 3000 నుంచి 4000 యూనిట్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ దీనివైపు కృషి చేస్తుంది.

Slavia డెలివరీలు ఎప్పుడో చెప్పేసిన Skoda సీఈఓ: వివరాలు

కొత్త స్కోడా స్లావియా మొత్తం 5 కలర్ అప్సన్స్ లో అందించనుంది. అవి కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, టోర్నాడో రెడ్ మరియు క్రిస్టల్ బ్లూ కలర్స్. మార్కెట్లో ఆవిష్కరించబడిన ఈ కొత్త స్లావియా ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించ్చలేదు. అయితే ఈ సెడాన్ విడుదల సమయంలో ధర అధికారికంగా వెల్లడవుతుంది. ఈ సెడాన్ చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది

Slavia డెలివరీలు ఎప్పుడో చెప్పేసిన Skoda సీఈఓ: వివరాలు

కంపెనీ యొక్క ఈ కొత్త స్కోడా స్లావియా రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ 3 సిలిండర్ కాగా, మరొకటి 1.5-లీటర్ టిఎస్ఐ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

Slavia డెలివరీలు ఎప్పుడో చెప్పేసిన Skoda సీఈఓ: వివరాలు

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ 3-సిలిండర్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్‌తో అందించబడుతుంది. ఇక 1.5-లీటర్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

Slavia డెలివరీలు ఎప్పుడో చెప్పేసిన Skoda సీఈఓ: వివరాలు

స్కోడా స్లావియా MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన సెడాన్. దీని డిజైన్ ఇటీవల అప్‌డేట్ చేయబడిన ఆక్టావియా వంటి సెడాన్‌ల నుండి ప్రేరణ పొందింది. కొత్త స్కోడా స్లావియా కంపెనీ ప్రస్తుత ర్యాపిడ్ మోడల్ కంటే పెద్దదిగా ఉంటుంది. కావున దీని కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది.

Slavia డెలివరీలు ఎప్పుడో చెప్పేసిన Skoda సీఈఓ: వివరాలు

ఈ సెడాన్ చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ సెడాన్‌లో కంపెనీ సిగ్నేచర్ బటర్‌ఫ్లై ఆకారపు ఫ్రంట్ గ్రిల్ మరియు పెద్ద రేడియేటర్ గ్రిల్ అందించింది. అంతే కాకుండా ఇందులో ఎల్-షేప్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు బూట్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ రీసెస్‌ను కూడా పొందుతుంది. ఈ కారు యొక్క ORVMలపై టర్న్ ఇండికేటర్లను మరియు సైడ్ బాడీలో లైనింగ్‌ను పొందుతుంది.

Slavia డెలివరీలు ఎప్పుడో చెప్పేసిన Skoda సీఈఓ: వివరాలు

కంపెనీ ఇంతకుముందే ఈ స్లావియా సెడాన్ యొక్క ఇంటీరియర్‌ను కూడా అప్‌డేట్ చేసింది. ఇది ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని క్యాబిన్‌ను డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో పరిచయం చేసింది, ఇది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్ మరియు అపోల్స్ట్రే కూడా డ్యూయల్-టోన్‌లో ఉంచబడ్డాయి.

Slavia డెలివరీలు ఎప్పుడో చెప్పేసిన Skoda సీఈఓ: వివరాలు

అంతే కాకుండా డ్యాష్‌బోర్డ్‌కి డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో బ్లాక్ పియానో ​​ఫినిషింగ్ కూడా ఇవ్వబడింది, కావున ఇది మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. ఇందులో డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్ మౌంట్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 25.4 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 20.32 సెం.మీ డిజిటల్ కాక్‌పిట్ వంటి ఫీచర్లను పొందుతుంది.

Slavia డెలివరీలు ఎప్పుడో చెప్పేసిన Skoda సీఈఓ: వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త స్లావియా హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త సెడాన్ మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నాము. ఎందుకంటే కంపెనీ యొక్క స్కోడా కుషాక్ కూడా అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన SUV గా అవతరించింది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 18, 2022, 18:30 [IST]
English summary
Skoda slavia delivery to start from march 2022 details
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+