స్కోడా స్లావియా (Skoda Slavia) కీలక ఫీచర్లు వెల్లడి.. త్వరలోనే విడుదల!

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో (Skoda Auto) ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన కుషాక్ ఎస్‌యూవీ విజయం తర్వాత, ఆ బ్రాండ్ నుండి వస్తున్న తదుపరి మోడల్ 'స్కోడా స్లావియా' (Skoda Slavia) పై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కుషాక్ బాటలోనే స్లావియా కూడా మంచి విజయాన్ని సాధించగలదని కంపెనీ ధీమాగా ఉంది. తాజాగా స్కోడా స్లావియా సెడాన్ యొక్క కొన్ని ముఖ్య ఫీచర్లను వెల్లడి చేసే ఓ వీడియోని కంపెనీ విడుదల చేసింది.

ఈ వీడియోను బట్టి చూస్తే, స్కోడా స్లావియా సెడాన్ ను కంపెనీ సాటిలేని ఫీచర్లతో అమర్చినట్లు స్పష్టంగా తెలుస్తుంది. కంపెనీ ఇటీవలే ఈ కొత్త మిడ్-సైజ్ సెడాన్ ను మార్కెట్లో ఆవిష్కరించింది. అలాగే, దాని ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ వివరాలను కూడా వెల్లడించింది. మార్కెట్ సమాచారం ప్రకారం, ఇప్పటికే కొందరు స్కోడా డీలర్లు అనధికారికంగా ఈ మోడల్ కోసం బుకింగ్ లను కూడా స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

స్కోడా స్లావియా (Skoda Slavia) కీలక ఫీచర్లు వెల్లడి.. త్వరలోనే విడుదల!

తాజా విషయం ఏంటంటే, కంపెనీ ఇప్పుడు ఈ కారును భారతదేశంలో ఉత్పత్తి చేయడం కూడా ప్రారంభించింది. స్కోడా విడుదల చేసిన వీడియోల ప్రకారం, ఈ సరికొత్త స్లావియా సెడాన్ కారులో 8 ఇంచ్ ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిస్ కంట్రోల్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, రెండు USB-C పోర్ట్‌లు వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నట్లు సమాచారం. ఇంకా ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసి వెంట్స్, కీలెస్ ఎంట్రీ మరియు ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

స్కోడా స్లావియా (Skoda Slavia) కీలక ఫీచర్లు వెల్లడి.. త్వరలోనే విడుదల!

స్కోడా ఆటో ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయిస్తున్న ర్యాపిడ్ సెడాన్ ను ఈ కొత్త స్లావియా సెడాన్ తో రీప్లేస్ చేయనుంది. ఈ నేపథ్యంలో, స్కోడా స్లావియా సెడాన్‌కు రాబోయే బలమైన డిమాండ్‌ను కంపెనీ ముందుగానే ఊహించి, ఇప్పటికే ఈ కారును భారీ మొత్తంలో ఉత్పత్తి చేయడం కూడా ప్రారంభించింది. స్కోడా ఆటో పేర్కొన్న సమాచారం ప్రకారం, స్కోడా స్లావియా సెడాన్ ను పూణేలోని చకాన్‌లో ఉన్న స్కోడా యొక్క అత్యాధునిక తయారీ కేంద్రంలో ప్రారంభించనున్నారు.

స్కోడా స్లావియా (Skoda Slavia) కీలక ఫీచర్లు వెల్లడి.. త్వరలోనే విడుదల!

స్లావియా సెడాన్ విషయానికి వస్తే, స్కోడా ఆటో తమ ఇండియా ప్రాజెక్ట్ 2.0 లో భాగంగా, ఇక్కడి మార్కెట్లో స్థానికంగా తయారు చేస్తున్న రెండవ మేడ్ ఇన్ ఇండియా మోడల్ ఇది. తాజా సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 2022 నాటికి స్కోడా స్లావియా భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. స్కోడా ఆటో తమ ఇండియా స్ట్రాటజీలో భాగంగా, వాహనాల ఉత్పత్తిని సాధ్యమైనంత వరకు స్థానికీకరించడం ద్వారా తమ వాహనాల తయారీ వ్యయాన్ని తగ్గించడం ద్వారా దేశంలో లాభదాయకమైన వ్యాపారాన్ని స్థాపించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

స్కోడా స్లావియా (Skoda Slavia) కీలక ఫీచర్లు వెల్లడి.. త్వరలోనే విడుదల!

స్కోడా తమ వాహనాల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం కోసం కార్ల తయారీలో MQB-A0-IN అనే ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుంది. ఇది విభిన్నమైన బాడీ టైప్ వాహనాల తయారీకి అనుమతిస్తుంది. కంపెనీ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన స్కోడా కుషాక్ (Skoda Kushaq) ఎస్‌యూవీ కూడా ప్లాట్‌ఫారమ్ పై తయారు చేయబడింది. కొత్త స్లావియా సెడాన్ కూడా ఇదే MQB-A0 IN ప్లాట్‌ఫారమ్‌ పై తయారైంది. ఫలితంగా, ఈ కారులో మంచి ఇంటీరియర్ స్పేస్ మరియు అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది.

స్కోడా స్లావియా (Skoda Slavia) కీలక ఫీచర్లు వెల్లడి.. త్వరలోనే విడుదల!

స్కోడా స్లావియా మరియు స్కోడా కుషాక్ రెండు ఎస్‌యూవీలు కూడా పూర్తిగా ఒకే ప్లాట్‌ఫామ్ తయారైన నేపథ్యంలో, ఈ రెండింటిలో దాదాపు అన్ని పరికరాలు మరియు ఫీచర్లు ఒకేలా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా, స్లావియా సెడాన్ ధర కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. స్కోడా స్లావియా సెడాన్ లో కూడా స్కోడా కుషాక్ ఎస్‌యూవీలో ఉపయోగించిన ఇంజన్లనే ఉపయోగించనున్నారు.

స్కోడా స్లావియా (Skoda Slavia) కీలక ఫీచర్లు వెల్లడి.. త్వరలోనే విడుదల!

ఇందులో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో మొదటిది 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌. ఈ ఇంజన్ గరిష్టంగా 113 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అలాగే ఆప్షనల్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో లభిస్తుంది. ఇకపోతే, రెండవ ఇంజన్ ఆప్షన్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 148 బిహెచ్‌పి పవర్ ను మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది.

స్కోడా స్లావియా (Skoda Slavia) కీలక ఫీచర్లు వెల్లడి.. త్వరలోనే విడుదల!

సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBS తో కూడిన ABS, ESC, ISOFIX మౌంట్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా మరియు రియర్ పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి. స్కోడా స్లావియా ఒక 5 డోర్ సెడాన్, అయితే ఇది కూప్ బాడీ టైప్ లాంటి రూఫ్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు మొత్తం పొడవు 4,541 మిమీ, వెడల్పు 1,752 మిమీ, ఎత్తు 1,487 మిమీ మరియు 2,651 మిమీ అద్భుతమైన బెస్ట్-ఇన్-క్లాస్ వీల్‌బేస్‌ ను కలిగి ఉంటుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Article Published On: Monday, January 31, 2022, 15:46 [IST]
English summary
Skoda slavia features revealed in a new video features fully digital instrument cluster and more
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+