ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదలైన Skoda Slavia: ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు
దేశీయ మార్కెట్లో వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త 'స్కోడా స్లావియా' (Skoda Slavia) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైంది. భారతీయ మార్కెట్లో ఈ రోజు 1.0 TSI పవర్డ్ వెర్షన్‌ల ధరలను మాత్రమే కంపెనీ వెల్లడించింది. దీని ధర రూ. 10.69 లక్షలతో ప్రారంభమై రూ. 15.39 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉన్నాయి. స్కోడా స్లావియా డెలివరీలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త స్లావియా గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

వేరియంట్స్:
స్కోడా స్లావియా మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
అవి:
- యాక్టివ్
- యాంబిషన్
- స్టైల్

స్కోడా స్లావియా ధరలు:
| Model | 1.0 TSI (MT) | 1.0 TSI (AT) |
| Active | ₹10,69,000 | - |
| Ambition | ₹12,39,000 | ₹13,59,000 |
| Style (Non-Sunroof Version) | ₹13,59,000 | - |
| Style | ₹13,99,000 | ₹15,39,000 |

కొత్త స్కోడా స్లావియా అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సెడాన్ సిగ్నేచర్ బటర్‌ఫ్లై షేప్ ఫ్రంట్ గ్రిల్ మరియు పెద్ద రేడియేటర్ గ్రిల్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇది L- షేప్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, 16-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు బూట్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ వంటివి కూడా పొందుతుంది. ఈ కారు యొక్క ORVMలపై టర్న్ ఇండికేటర్లను మరియు సైడ్ బాడీలో లైనింగ్‌ను పొందుతుంది.

స్కోడా స్లావియా యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులోని ఇంటీరియర్ కూడా చాలావరకు అప్డేట్ చేయబడ్డాయి. ఇందులోని క్యాబిన్ డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ మరియు అప్హోల్స్టరీ కూడా డ్యూయల్-టోన్‌లో ఉంచబడ్డాయి. డ్యాష్‌బోర్డ్‌కు డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో బ్లాక్ పియానో ఫినిషింగ్ ఇవ్వబడింది, ఇది మరింత ప్రీమియం అవుతుంది.

ఇందులో డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్ మౌంట్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 25.4 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 20.32 సెం.మీ డిజిటల్ కాక్‌పిట్ వంటి ఫీచర్లు ఇందులో అందించబడ్డాయి.

స్లావియా మొత్తం 5 కలర్ అప్సన్స్ లో అందించనుంది. అవి కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, టోర్నాడో రెడ్ మరియు క్రిస్టల్ బ్లూ కలర్స్. దీని కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది.

కొత్త స్కోడా స్లావియాను కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్లతో విడుదల చేయనుంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇక రెండవ ఇంజిన్ 1.5-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజన్ ఇది 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇవి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను పొందుతాయి.

స్కోడా స్లావియా అనేది కంపెనీ స్థానికీకరించిన MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన సెడాన్. దీని డిజైన్ ఇటీవల అప్‌డేట్ చేయబడిన ఆక్టావియా మరియు సూపర్బ్ వంటి సెడాన్‌ల నుండి ప్రేరణ పొందింది. స్లావియా యొక్క ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభించబడింది, వేలాది మంది నిపుణుల సహాయంతో కంపెనీ దీనిని తయారు చేస్తోంది. వీటిని 500 ఆధునిక రోబోట్లు పూర్తిగా పరీక్షిస్తున్నాయి.

స్కోడా స్లావియా ప్రస్తుతం 1.0 TSI పవర్డ్ వెర్షన్ మాత్రమే విడుదల చేసింది. అయితే 1.5 లీటర్ టిఎస్ఐ వేరియంట్ మార్చి 3న విడుదలవుతుంది. ధర కూడా అప్పుడే ప్రకటించబడుతుంది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు స్కోడా యొక్క స్లావియా దేశీయ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. కావున ఇది మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే విషయం త్వరలో తెలుస్తుంది.
భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త స్కోడా స్లావియా సెడాన్ హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది


Click it and Unblock the Notifications








