ఒక్కసారిగా రూ. 60000 పెరిగిన స్కోడా స్లావియా ధరలు.. ఇప్పుడు ప్రారంభ ధర ఎంతంటే?
చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా (Skoda) భారతీయ మార్కెట్లో కొన్ని నెలలకు ముందు 'స్కోడా స్లావియా' (Skoda Slavia) అనే మిడ్-సైజ్ సెడాన్ ను విడుదల చేసింది. విడుదల సమయంలో ఈ సెడాన్ ధర రూ. 10.69 లక్షలతో ప్రారంభమై రూ. 15.39 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉండేది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ సెడాన్ ధర గరిష్టంగా రూ. 60,000 పెరిగింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

స్కోడా స్లావియా మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ వేరియంట్లు. ప్రస్తుతం ధరల పెరుగుదల తరువాత స్కోడా స్లావియా ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అదే సమయంలో ఇందులోని టాప్ వేరియంట్ ధర రూ. 18.39 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది.

స్కోడా స్లావియా యొక్క టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 60,000 పెరిగింది, అదే సమయంలో దాని 1-లీటర్ టిఎస్ఐ ధరలు రూ. 40,000 వరకు పెరిగాయి. ఇక స్కోడా స్లావియా యొక్క 1.5-లీటర్ టిఎస్ఐ వేరియంట్ ధరలు కూడా రూ. 60,000 వరకు పెరిగాయి. ధరల పెరుగుదలలు అమ్మకాలపైన ప్రభావం చూపుతాయా.. లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది.

| Skoda Slavia 1.0-litre TSI | |||
| Variant | Old Price | New Price | Difference |
| Active MT | ₹10.69 Lakh | ₹10.99 Lakh | ₹30,000 |
| Ambition MT | ₹12.39 Lakh | ₹12.69 Lakh | ₹30,000 |
| Ambition AT | ₹13.59 Lakh | ₹13.89 Lakh | ₹30,000 |
| Style MT without sunroof | ₹13.59 Lakh | ₹13.99 Lakh | ₹40,000 |
| Style MT with sunroof | ₹13.99 Lakh | ₹14.39 Lakh | ₹40,000 |
| Style AT with sunroof | ₹15.39 Lakh | ₹15.79 Lakh | ₹40,000 |
| Skoda Slavia 1.5-litre TSI | |||
| Variant | Old Price | New Price | Difference |
| Style MT with sunroof | ₹16.19 Lakh | ₹16.79 Lakh | ₹60,000 |
| Style AT with sunroof | ₹17.79 Lakh | ₹18.39 Lakh | ₹60,000 |

ధరల పెరుగుదల మాత్రమే కాకుండా స్కోడా కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, సెమీకండక్టర్ చిప్ కొరత వల్ల స్కోడా స్లావియాలో టచ్‌స్క్రీన్‌ను ఇప్పుడు 10-ఇంచెస్ నుంచి 8-ఇంచెస్ కు తగ్గించింది. అయితే ఇది కూడా ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికీ మద్దతు ఇస్తుంది. కానీ ఇది కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి వాటికీ సపోర్ట్ చేస్తుందా, లేదా అనేది తెలియాలి. స్కోడా స్లావియా యొక్క బేస్-స్పెక్ యాక్టివ్ వేరియంట్ లో మాత్రం 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది.

కొత్త స్కోడా స్లావియా అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. స్లావియా అనేది కంపెనీ స్థానికీకరించిన MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన సెడాన్. ఇది సిగ్నేచర్ బటర్‌ఫ్లై షేప్ ఫ్రంట్ గ్రిల్ మరియు పెద్ద రేడియేటర్ గ్రిల్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇది L- షేప్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, 16-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు బూట్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ వంటివి కూడా పొందుతుంది. ఈ కారు యొక్క ORVMలపై టర్న్ ఇండికేటర్లను మరియు సైడ్ బాడీలో లైనింగ్‌ను పొందుతుంది.

స్కోడా స్లావియా మొత్తం 5 కలర్ అప్సన్స్ లో అందించనుంది. అవి కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, టోర్నాడో రెడ్ మరియు క్రిస్టల్ బ్లూ కలర్స్. దీని కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం 2,651 మి.మీ వరకు ఉంటుంది.

కొత్త స్కోడా స్లావియాను కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్లతో విడుదల చేయనుంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇక రెండవ ఇంజిన్ 1.5-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజన్ ఇది 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇవి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను పొందుతాయి.


Click it and Unblock the Notifications








