స్కోడా స్లావియా సెడాన్‌లో సైజ్ తగ్గిన ఇన్ఫోటైన్‌మెంట్.. 10 ఇంచ్ డిస్‌ప్లే స్థానంలో 8 ఇంచ్ డిస్‌ప్లే..

స్కోడా ర్యాపిడ్ (Skoda Rapid) స్థానాన్ని రీప్లేస్ చేయడానికి వచ్చి మార్కెట్లో భారీ ఆదరణ దక్కించుకున్న చెక్ రిపబ్లిక్ బ్రాండ్ స్కోడా ఆటో (Skoda Auto) యొక్క లేటెస్ట్ మిడ్-సైజ్ సెడాన్ 'స్కోడా స్లావియా' (Skoda Slavia), ఇప్పుడు కొత్త కస్టమర్ల నుండి విమర్శలు ఎదుర్కుంటోంది. ఇందుకు ప్రధాన కారణం, కంపెనీ ఇందులోని 10 ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే యూనిట్‌ని తొలగించి దాని స్థానంలో డౌన్‌గ్రేడ్ చేయబడిన 8 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించడమే. ఈ మార్పు కారణంగా, కస్టమర్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా స్కోడా కంపెనీపై విమర్శలు చేస్తున్నారు.

స్కోడా స్లావియా సెడాన్‌లో సైజ్ తగ్గిన ఇన్ఫోటైన్‌మెంట్..

స్కోడా ఆటో గడచిన ఫిబ్రవరి నెలలో తమ స్లావియా సెడాన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆ సమయంలో కంపెనీ ఇందులో 10-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను అందించడం మొదలు పెట్టింది. పెద్ద డిస్‌ప్లే కారణంగా కస్టమర్లు కూడా దీనిని ఎంతగానో ఇష్టపడ్డారు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెమీ కండక్టర్ చిప్ కొరత కారణంగా, కంపెనీ తమ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను విడిభాగాల తయారీదారుల నుండి కొనుగోలు చేయడంలో సమస్యలు ఎదుర్కుంటోంది.

స్కోడా స్లావియా సెడాన్‌లో సైజ్ తగ్గిన ఇన్ఫోటైన్‌మెంట్..

ఈ నేపథ్యంలో, పెద్ద యూనిట్ స్థానంలో కంపెనీ విదేశీ మార్కెట్లలో తమ ఇతర స్కోడా కార్లలో ఉపయోగిస్తున్న 8 ఇంచ్ యూనిట్‌ను భారత్‌లోని స్కోడా స్లావియాలో కూడా ఉపయోగిస్తోంది. ఈ విషయాన్ని స్కోడా ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ ధృవీకరించారు. స్కోడా స్లావియా సెడాన్ యొక్క టాప్-స్పెక్ వేరియంట్‌లు ఇప్పుడు చిన్న 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌తో వస్తాయని తెలిపారు. దీంతో ఇప్పుడు ట్విట్టర్ వేదికగా పెద్ద చర్చే జరుగుతోంది. కస్టమర్లంతా స్కోడా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ట్విట్టర్ పోస్టులు పెడుతున్నారు.

స్కోడా స్లావియా సెడాన్‌లో సైజ్ తగ్గిన ఇన్ఫోటైన్‌మెంట్..

ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన సెమీ-కండక్టర్ చిప్ కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, డౌన్‌గ్రేడ్ చేయబడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ చవకదేమీ కాదని, యూరప్ మార్కెట్లో కస్టమర్లు దీనిని చాలా ఎక్కువగా ఆదరిస్తున్నారని కంపెనీ చెబుతోంది. ఈ కొత్త 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ మునుపటి 10 ఇంచ్ యూనిట్‌లోని చాలా ఫీచర్లను కలిగి ఉన్నప్పటికీ, ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ ఫీచర్‌ను కోల్పోతుంది. ఈ ఒక్క మార్పు మినహా దాదాపుగా మిగిలిన ఫీచర్లన్నీ కూడా ఈ రెండు యూనిట్లలో ఒకేలా ఉంటాయి.

స్కోడా స్లావియా సెడాన్‌లో సైజ్ తగ్గిన ఇన్ఫోటైన్‌మెంట్..

అయితే, గతంలో ఈ కారులో వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ను కూడా తొలగించారనే పుకార్లు జోరందుకున్నాయి. కాగా, కంపెనీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. వైర్‌లెస్ చార్జింగ్ ఆప్షన్ తొలగించారా అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, జాక్ హోలిస్ ఆ ఫీచర్ ను తొలగించలేదని సమాధానం ఇచ్చారు. స్కోడా స్లావియా సెడాన్ లో ఈ ఒక్క మార్పు (ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ సైజ్ తగ్గించడం) మినహా వేరే ఏ ఇతర మార్పులు చేయలేదు.

స్కోడా స్లావియా సెడాన్‌లో సైజ్ తగ్గిన ఇన్ఫోటైన్‌మెంట్..

కొత్త స్కోడా స్లావియా మరియు కుషాక్ మోడళ్లలో ఉపయోగిస్తున్న ఈ 8 ఇంచ్ ఇన్ఫోటైన్‌‌మెంట్ సిస్టమ్ థర్డ్ పార్టీకి చెందినది కాదని, ఇదొక గ్లోబల్ యూనిట్ అని, చిప్ కొరత కారణంగా కస్టమర్ల బుకింగ్స్ మరింత ఆలస్యం కాకుండా చూసేందుకు, వీలైనంత త్వరగా కస్టమర్లకు డెలివరీలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. స్కోడా స్లావియా మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

స్కోడా స్లావియా సెడాన్‌లో సైజ్ తగ్గిన ఇన్ఫోటైన్‌మెంట్..

భారత మార్కెట్లో స్కోడా స్లావియా సెడాన్ ను తొలిసారిగా విడుదల చేసినప్పుడు కంపెనీ దీనిని రూ. 10.69 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిచయ ప్రారంభ ధరతో విక్రయించింది. కాగా, ఇటీవలే కంపెనీ దీని ధరను భారీగా పెంచేసింది. ధరల పెంపు అనంతరం స్కోడా స్లావియా సెడాన్ ప్రారంభ ధర రూ.10.99 (ఎక్స్-షోరూమ్) కి చేరుకుంది. స్కోడా స్లావియా 1.0 లీటర్ టిఎస్ఐ మరియు 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

స్కోడా స్లావియా సెడాన్‌లో సైజ్ తగ్గిన ఇన్ఫోటైన్‌మెంట్..

స్కోడా స్లావియా మొత్తం మూడు ట్రిమ్ లలో (యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్) మరియు 8 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో యాక్టివ్ వేరియంట్ ఒక్కటే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్‌తో వస్తుంది. కాగా, మిగిలిన అన్ని వేరియంట్‌లు గతంలో 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఆఫర్ చేయబడేవి. అవి కాస్తా ఇప్పుడు10 ఇంచ్ టచ్ స్క్రీన్‌కు బదులుగా చిన్న 8 ఇంచ్ స్క్రీన్‌ను పొందుతాయి.

స్కోడా స్లావియా సెడాన్‌లో సైజ్ తగ్గిన ఇన్ఫోటైన్‌మెంట్..

స్కోడా స్లావియా సెడాన్‌లోని ఇతర ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ప్రీమియం లెథెరెట్ అప్‌హోలెస్ట్రీ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ చార్జింగ్, రియర్ ఏసి వెంట్లు మొదలైనవి ఉన్నాయి. అలాగే, సేఫ్టీ విషయానికి వస్తే, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ESC, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ సిస్టమ్ (EDS), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి మరెన్నో భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda slavia now gets 8 inch infotainment display instead of 10 inch unit
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X