విడుదలకు ముందే లీక్ అయిన 'Skoda Slavia' ధరలు: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో ఎక్కువమంది వాహన ప్రియులు ఎదురుచూస్తున్న సెడాన్ స్కోడా (Skoda) యొక్క స్లావియా (Slavia). ఈ సెడాన్ ఇప్పటికే భారత మార్కెట్లో ఆవిష్కరించబడింది. కంపెనీ ఈ స్లావియా గురించి దాదాపు చాలా సమాచారాన్ని విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ సెడాన్ యొక్క అంచనా ధరలు విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

విడుదలకు ముందే లీక్ అయిన 'Skoda Slavia' ధరలు: పూర్తి వివరాలు

కంపెనీ అందిచిన సమాచారం ప్రకారం, స్కోడా స్లావియా యొక్క ప్రారంభ ధర రూ. 10.80 లక్షలు. అయితే ఇందులోని టాప్ వేరియంట్ ధర రూ. 17.70 లక్షల వరకు ఉంటుంది. ఇప్పటికే ఈ కొత్త సెడాన్ డీలర్షిప్ చేరుకోవడం కూడా ప్రారంభిచింది. త్వరలో టెస్ట్ డ్రైవ్ కూడా ప్రారంభం కానుంది.

విడుదలకు ముందే లీక్ అయిన 'Skoda Slavia' ధరలు: పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న కొత్త స్కోడా స్లావియా యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ అనే మూడు వేరియంట్‌లలో విడుదల కానుంది. ఇందులో 1.0 లీటర్ TSI మాన్యువల్ ధర రూ. 10.80 లక్షల నుండి రూ. 14.50 లక్షల వరకు ఉంటుంది. అదే విధంగా యాంబిషన్ ఆటోమేటిక్ ధర రూ. 14 లక్షలు కాగా, స్టైల్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 15.75 లక్షలు.

విడుదలకు ముందే లీక్ అయిన 'Skoda Slavia' ధరలు: పూర్తి వివరాలు

ఇక ఇందులోని 1.5 లీటర్ స్టైల్ మాన్యువల్ ధర రూ. 16.70 లక్షలు మరియు ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 17.70 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరకు కేవలం అంచనా మాత్రమే, కంపెనీ వీటి ధరలను విడుదల సమయంలో అధికారికంగా వెల్లడించనుంది.

విడుదలకు ముందే లీక్ అయిన 'Skoda Slavia' ధరలు: పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతుం 'స్కోడా స్లావియా' రెండు ఇంజన్ ఆప్షన్‌లలో విడుదలకానుంది. కావున ఇవి రెండూ కూడా వేరువేరు రోజుల్లో మార్కెట్లో విడుదలవుతుంది. ఇందులోకి 1.0 లీటర్ టిఎస్ఐ మోడల్ ఈ నెల 28 న విడుదల కానుంది. అదే విధంగా 1.5 లీటర్ టిఎస్ఐ మోడల్ 2022 మార్చి 03 న విడుదల కానుంది.

విడుదలకు ముందే లీక్ అయిన 'Skoda Slavia' ధరలు: పూర్తి వివరాలు

స్కోడా స్లావియా ఇప్పుడు డీలర్‌షిప్‌లకు చేరుకోవడం ప్రారంభించింది. అంతే కాకుండా ఉత్పత్తి కూడా ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీలోని ఎంతోమంది నిపుణుల సహాయంతో మరియు 500 ఆధునిక రోబోలతో పనిచేస్తోంది. ఇప్పటికే ఈ కారు చాలా సార్లు పరీక్షించబడింది. స్కోడా స్లావియా మహారాష్ట్రలోని చకాన్‌లో ఉత్పత్తి చేయబడుతోంది

విడుదలకు ముందే లీక్ అయిన 'Skoda Slavia' ధరలు: పూర్తి వివరాలు

స్కోడా స్లావియా కంపెనీ యొక్క ఉత్పత్తి అయిన రాపిడ్ స్థానంలో తీసుకురాబడుతోంది, అయితే ఇది పూర్తిగా కొత్త మోడల్, ఇటీవల కంపెనీ తన వెబ్‌సైట్ నుండి రాపిడ్‌ను తొలగించింది. స్కోడా రాపిడ్ కంపెనీ యొక్క బెస్ట్ మోడల్. స్కోడా స్లావియా MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన సెడాన్. దీని డిజైన్ ఇటీవల అప్‌డేట్ చేయబడిన ఆక్టావియా వంటి సెడాన్‌ల నుండి ప్రేరణ పొందింది. కొత్త స్కోడా స్లావియా కంపెనీ ప్రస్తుత ర్యాపిడ్ మోడల్ కంటే పెద్దదిగా ఉంటుంది.

విడుదలకు ముందే లీక్ అయిన 'Skoda Slavia' ధరలు: పూర్తి వివరాలు

స్కోడా స్లావియా యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది. కొత్త స్కోడా స్లావియా మొత్తం 5 కలర్ అప్సన్స్ లో అందించనుంది. అవి కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, టోర్నాడో రెడ్ మరియు క్రిస్టల్ బ్లూ కలర్స్.

విడుదలకు ముందే లీక్ అయిన 'Skoda Slavia' ధరలు: పూర్తి వివరాలు

స్కోడా స్లావియా చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ సెడాన్‌లో కంపెనీ సిగ్నేచర్ బటర్‌ఫ్లై ఆకారపు ఫ్రంట్ గ్రిల్ మరియు పెద్ద రేడియేటర్ గ్రిల్ అందించింది. అంతే కాకుండా ఇందులో ఎల్-షేప్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు బూట్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ రీసెస్‌ను కూడా పొందుతుంది. ఈ కారు యొక్క ORVMలపై టర్న్ ఇండికేటర్లను మరియు సైడ్ బాడీలో లైనింగ్‌ను పొందుతుంది.

విడుదలకు ముందే లీక్ అయిన 'Skoda Slavia' ధరలు: పూర్తి వివరాలు

కంపెనీ ఇంతకుముందే ఈ స్లావియా సెడాన్ యొక్క ఇంటీరియర్‌ను కూడా అప్‌డేట్ చేసింది. ఇది ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని క్యాబిన్‌ను డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో పరిచయం చేసింది, ఇది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్ మరియు అపోల్స్ట్రే కూడా డ్యూయల్-టోన్‌లో ఉంచబడ్డాయి.

విడుదలకు ముందే లీక్ అయిన 'Skoda Slavia' ధరలు: పూర్తి వివరాలు

అంతే కాకుండా డ్యాష్‌బోర్డ్‌కి డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో బ్లాక్ పియానో ​​ఫినిషింగ్ కూడా ఇవ్వబడింది, కావున ఇది మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. ఇందులో డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్ మౌంట్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 25.4 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 20.32 సెం.మీ డిజిటల్ కాక్‌పిట్ వంటి ఫీచర్లను పొందుతుంది.

విడుదలకు ముందే లీక్ అయిన 'Skoda Slavia' ధరలు: పూర్తి వివరాలు

కంపెనీ యొక్క ఈ కొత్త స్కోడా స్లావియా రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ 3 సిలిండర్ కాగా, మరొకటి 1.5-లీటర్ టిఎస్ఐ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

విడుదలకు ముందే లీక్ అయిన 'Skoda Slavia' ధరలు: పూర్తి వివరాలు

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ 3-సిలిండర్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్‌తో అందించబడుతుంది. ఇక 1.5-లీటర్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త స్లావియా హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Source: Team BHP

More from DriveSpark

Article Published On: Saturday, February 12, 2022, 13:03 [IST]
English summary
Skoda slavia price revealed by dealer details
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+