భారత్‌లో స్కోడా స్లావియా (Skoda Slavia) ఉత్పత్తి ప్రారంభం; ఫిబ్రవరిలో బుకింగ్స్ ఓపెన్!

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కోడా ఆటో (Skoda Auto) నుండి భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తదుపరి మోడల్ 'స్కోడా స్లావియా' (Skoda Slavia). కంపెనీ ఇటీవలే ఈ కొత్త మిడ్-సైజ్ సెడాన్ ను మార్కెట్లో ఆవిష్కరించింది. అలాగే, దాని ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ వివరాలను కూడా వెల్లడించింది. కొందరు స్కోడా డీలర్లు అనధికారికంగా ఈ మోడల్ కోసం బుకింగ్ లను కూడా స్వీకరిస్తున్నట్లు సమాచారం. తాజా విషయం ఏంటంటే, కంపెనీ ఇప్పుడు ఈ కారును భారతదేశంలో ఉత్పత్తి చేయడం కూడా ప్రారంభించింది.

భారత్‌లో స్కోడా స్లావియా (Skoda Slavia) ఉత్పత్తి ప్రారంభం; ఫిబ్రవరిలో బుకింగ్స్ ఓపెన్!

స్కోడా ఆటో ఇండియా ప్రస్తుతం దేశీయ విపణిలో విక్రయిస్తున్న స్కోడా ర్యాపిడ్ సెడాన్ స్థానాన్ని ఈ స్లావియా సెడాన్ భర్తీ చేయవచ్చని భావిస్తున్నారు. మార్చి 2022 నాటికి కంపెనీ ఈ కారును అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే, ఫిబ్రవరి 2022లో స్కోడా స్లావియా కోసం అధికారిక బుకింగ్ లను కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం. స్కోడా కుషాక్ మరియు కొత్త తరం స్కోడా కొడియాక్ మోడళ్ల తర్వాత ఈ చెక్ రిపబ్లిక్ బ్రాండ్ నుండి వస్తున్న మూడవ అధునాతన ఉత్పత్తి ఈ స్లావియా సెడాన్.

భారత్‌లో స్కోడా స్లావియా (Skoda Slavia) ఉత్పత్తి ప్రారంభం; ఫిబ్రవరిలో బుకింగ్స్ ఓపెన్!

కుషాక్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని తయారు చేసినట్లుగానే కంపెనీ ఈ స్లావియా సెడాన్ ను కూడా భారతదేశం కోసం స్థానికీకరించిన MQB A0-IN ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారు చేయనుంది. ఇది ఈ ప్లాట్‌ఫామ్ నుండి వస్తున్న రెండవ మోడల్. ప్రస్తుతం, కంపెనీ ఈ మోడల్ ను మహారాష్ట్రలో ఉన్న చాకన్ ప్లాంట్ లో తయారు చేస్తోంది. ఈ కారు తయారీలో చాలా వరకూ స్థానికీకరణ ఉంటుందని కంపెనీ తెలిపింది. అంటే, స్థానికంగా లభించే విడిభాగాలు మరియు పరికరాలతో కంపెనీ ఈ తయారు చేయనుంది.

భారత్‌లో స్కోడా స్లావియా (Skoda Slavia) ఉత్పత్తి ప్రారంభం; ఫిబ్రవరిలో బుకింగ్స్ ఓపెన్!

స్కోడా స్లావియా ఉత్పత్తిలో అధిక భాగం స్థానికీకరణ చేస్తున్న కారణంగా, కంపెనీ దీని ధరను కూడా అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. కంపెనీ ఇదే తరహా వ్యూహాన్ని తమ కుషాక్‌ ఎస్‌యూవీ విషయంలో కూడా ప్రయత్నించింది. స్కోడా పేర్కొన్న సమాచారం ప్రకారం, స్లావియా ప్రత్యేకించి భారత మార్కెట్‌పై దృష్టి సారించి అభివృద్ధి చేయబడిన ఉత్పత్తి. స్లావియా భారతీయ మార్కెట్లో తమ ఉద్దేశ్యం మరియు సామర్థ్యానికి బలమైన నిదర్శనమని స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ క్రిస్టియన్ కెన్ వాన్ సీలెన్ అన్నారు.

భారత్‌లో స్కోడా స్లావియా (Skoda Slavia) ఉత్పత్తి ప్రారంభం; ఫిబ్రవరిలో బుకింగ్స్ ఓపెన్!

స్లావియా సెడాన్ ప్రీమియం సెగ్మెంట్‌కు ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా, డిజైన్, ప్యాకేజింగ్, డైనమిక్స్, టెక్నాలజీ మరియు విలువలో సెడాన్‌లలో స్కోడా ఆటో యొక్క నైపుణ్యం మరియు వారసత్వాన్ని కూడా ప్రదర్శిస్తుందని ఆయన తెలిపారు. స్కోడా స్లావియా ఒక 5 డోర్ సెడాన్, అయితే ఇది కూప్ బాడీ టైప్ లాంటి రూఫ్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు మొత్తం పొడవు 4,541 మిమీ, వెడల్పు 1,752 మిమీ, ఎత్తు 1,487 మిమీ మరియు 2,651 మిమీ అద్భుతమైన బెస్ట్-ఇన్-క్లాస్ వీల్‌బేస్‌ ను కలిగి ఉంటుంది.

భారత్‌లో స్కోడా స్లావియా (Skoda Slavia) ఉత్పత్తి ప్రారంభం; ఫిబ్రవరిలో బుకింగ్స్ ఓపెన్!

స్కోడా స్లావియా సెడాన్ ప్రస్తుత స్కోడా ర్యాపిడ్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చినప్పటికీ, కొలతల పరంగా స్లావియా రాపిడ్ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఫలితంగా, కారు లోపలి భాగంలో కూడా విశాలమైన క్యాబిన్ స్పేస్ మరియు ప్రయాణీకుల కోసం విశాలమైన హెడ్ అండ్ లెగ్ రూమ్ లభిస్తుంది. ఇక డిజైన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో నిలువుగా ఉండే క్రోమ్ స్లాట్‌లు మరియు మందపాటి క్రోమ్ అంచులతో కూడిన స్కోడా యొక్క సిగ్నేచర్ బటర్‌ఫ్లై గ్రిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

భారత్‌లో స్కోడా స్లావియా (Skoda Slavia) ఉత్పత్తి ప్రారంభం; ఫిబ్రవరిలో బుకింగ్స్ ఓపెన్!

ఇంకా, ఇందులో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, స్పోర్టీ మల్టీ-స్పోక్ 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ మరియు కారు ఎయిర్‌డ్యామ్ కోసం వెడల్పాటి మెష్-టైప్ గ్రిల్‌తో కూడిన అగ్రెసివ్ ఫ్రంట్ బంపర్‌ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే, కారు వెనుక భాగంలో, C-ఆకారపు ఎల్ఈడి టెయిల్‌ల్యాంప్‌లు ఉంటాయి మరియు వీటిని రెండు భాగాలుగా విభజించి, బూట్ లిడ్‌ వరకూ విస్తరించినట్లు ఉంటాయి.

భారత్‌లో స్కోడా స్లావియా (Skoda Slavia) ఉత్పత్తి ప్రారంభం; ఫిబ్రవరిలో బుకింగ్స్ ఓపెన్!

ఇక ఇంటీరియర్ వివరాలను పరిశీలిస్తే, లోపలి భాగంలో, స్లావియా కొత్తగా రూపొందించిన క్యాబిన్‌తో గుండ్రటి ఏసి వెంట్‌లు, టూ స్పోక్ స్టీరింగ్ వీల్ (స్కోడా కుషాక్ నుండి తీసుకోబడింది) మరియు దానిపై మ్యూజిక్ మరియు కాల్స్ కోసం బటన్‌లు ఉంటాయి. టాప్ స్పెక్ మోడల్ లో స్టీరింగ్ వీల్ వెనుక భాగంలో ప్యాడిల్ షిఫ్టర్ కూడా ఉంటుంది, ఇది గేర్లను సులువుగా మార్చేందుకు సహకరిస్తుంది. ఇంకా ఇందులో డ్రైవర్ సమాచారం కోసం 8 ఇంచ్ టిఎఫ్‌టి టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది.

భారత్‌లో స్కోడా స్లావియా (Skoda Slavia) ఉత్పత్తి ప్రారంభం; ఫిబ్రవరిలో బుకింగ్స్ ఓపెన్!

ఇందులోని డ్యాష్‌బోర్డ్ హార్డ్ టచ్ ప్లాస్టిక్‌ మెటీరియల్ తో తయారు చేయబడింది మరియు డ్యాష్‌బోర్డు మధ్యలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అమర్చబడి ఉంటుంది. ఇది 10 ఇంచ్ యూనిట్ రూపంలో ఉంటుంది మరియు స్మార్ట్‌ఫోన్‌కు మొత్తం కనెక్టివిటీ ఆప్షన్లను అందిస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేతో పాటుగా బ్రాండ్ యొక్క కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉంటాయి. సంగీతం కోసం ఇందులో హై క్యాలిటీ స్పీకర్లు కూడా అందించబడ్డాయి. టాప్ వేరియంట్‌లో సబ్-వూఫర్ కూడా ఉంటుంది.

భారత్‌లో స్కోడా స్లావియా (Skoda Slavia) ఉత్పత్తి ప్రారంభం; ఫిబ్రవరిలో బుకింగ్స్ ఓపెన్!

అంతేకాకుండా, ఈ కారులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో డే/నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ఎయిర్ కేర్ ఫంక్షన్‌తో కూడిన టచ్ కంట్రోల్ క్లైమేట్రానిక్ మరియు రియర్ ఏసి వెంట్‌లు మరియు టాప్ ఎండ్ స్టైల్ ట్రిమ్ కోసం MySKODA Connect మొబైల్ ఆన్‌లైన్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBS తో కూడిన ABS, ESC, ISOFIX మౌంట్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా మరియు రియర్ పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి.

భారత్‌లో స్కోడా స్లావియా (Skoda Slavia) ఉత్పత్తి ప్రారంభం; ఫిబ్రవరిలో బుకింగ్స్ ఓపెన్!

ఇక చివరిగా ఇంజన్ విషయానికి వస్తే, స్కోడా స్లావియా సెడాన్ లో 1.0-లీటర్ TSI త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ టిఎస్ఐ ఇంజన్ ఉన్నాయి. ఇది యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది. ఇందులో మొదటి ఇంజన్ గరిష్టంగా 113 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అలాగే ఆప్షనల్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో లభిస్తుంది.

భారత్‌లో స్కోడా స్లావియా (Skoda Slavia) ఉత్పత్తి ప్రారంభం; ఫిబ్రవరిలో బుకింగ్స్ ఓపెన్!

ఇక ఇందులోని పెద్ద ఇంజన్ అయిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది గరిష్టంగా 148 బిహెచ్‌పి పవర్ ను మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది. స్లావియా సెడా్ 1.0-లీటర్ ఇంజన్ ఆప్షన్ తో మూడు వేరియంట్‌ల లభ్యం కానుంది. అయితే, పెద్ద 1.5 TSI ఇంజన్ మాత్రం కేవలం స్టైల్ ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుందని సమాచారం.

Article Published On: Saturday, January 22, 2022, 9:38 [IST]
English summary
Skoda slavia production begins in india launch details
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+