మళ్ళీ పెరిగిన స్కోడా స్లావియా ధరలు.. పూర్తి వివరాలు

చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా (Skoda) భారతీయ మార్కెట్లో తన విజయవంతమైన 'స్లావియా' సెడాన్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. కంపెనీ ఈ సెడాన్ ను లాంచ్ చేసిన అతి తక్కువ కాలంలోనే మంచి రెస్పాన్స్ పొందింది. అయితే స్లావియా ధరలు ఇప్పటికే ఒకసారి పెరిగాయి, కాగా ఇప్పుడు మరోసారి ధరల పెరుగుదలను పొందింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

మళ్ళీ పెరిగిన స్కోడా స్లావియా ధరలు.. పూర్తి వివరాలు

స్కోడా కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, స్లావియా ధరలు ఇప్పుడు రూ. 40,000 వరకు పెరిగాయి. గతంలో 2022 జూన్ నెలలో ఏకంగా రూ. 60,000 పెరుగుదలను అందుకుంది. దీన్ని బట్టి చూస్తే విడుదల సమయంలో కంటే కూడా ఇప్పుడు స్లావియా ఒక లక్ష రూపాయల ఎక్కువ ధర వద్ద లభిస్తుంది.

మళ్ళీ పెరిగిన స్కోడా స్లావియా ధరలు.. పూర్తి వివరాలు

ఇక వేరియంట్ల వారీగా ధరల పెరుగుదలను గమనించినట్లయితే, స్కోడా స్లావియా యాంబిషన్ 1.0 AT వేరియంట్ ధర రూ. 40,000, స్టైల్ 1.0 MT వేరియంట్ ధర రూ. 31,000, యాక్టివ్ 1.0 MT వేరియంట్ మరియు యాంబిషన్ 1.0 MT వేరియంట్ ధరలు రూ. 30,000 పెరుగుదలను పొందాయి.

మళ్ళీ పెరిగిన స్కోడా స్లావియా ధరలు.. పూర్తి వివరాలు

అదే సమయంలో స్కోడా స్లావియా స్టైల్ 1.0 MT NSR (నాన్-సన్‌రూఫ్) మరియు స్టైల్ 1.5 MT వేరియంట్ ధరలు ధర రూ. 21,000 పెరిగాయి. ఇక టాప్ టాప్-స్పెక్ స్టైల్ 1.5 DSG ధర రూ. 1,000, స్టైల్ 1.0 AT వేరియంట్ ధర రూ. 11,000 రూపాయల పెరుగుదలను పొందాయి. దీన్ని బట్టి చూస్తే, కంపెనీ యొక్క అన్ని వేరియంట్స్ ధరలు పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

మళ్ళీ పెరిగిన స్కోడా స్లావియా ధరలు.. పూర్తి వివరాలు

స్కోడా స్లావియా రెండు ఇంజన్ ఆప్షన్లతో విడుదలైంది. అవి ఒకటి 1.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇక రెండవ ఇంజిన్ 1.5-లీటర్ TSI టర్బో-పెట్రోల్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇవి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ ను పొందుతాయి.

మళ్ళీ పెరిగిన స్కోడా స్లావియా ధరలు.. పూర్తి వివరాలు

స్కోడా స్లావియా MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన సెడాన్. కావున ఇది మంచి డిజైన్ పొందుతుంది. ఈ సెడాన్‌ సిగ్నేచర్ బటర్‌ఫ్లై షేప్ ఫ్రంట్ గ్రిల్ మరియు పెద్ద రేడియేటర్ గ్రిల్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇది L- షేప్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, 16-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు బూట్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ వంటివి కూడా పొందుతుంది. ఈ కారు యొక్క ORVMలపై టర్న్ ఇండికేటర్లను మరియు సైడ్ బాడీలో లైనింగ్‌ను పొందుతుంది.

మళ్ళీ పెరిగిన స్కోడా స్లావియా ధరలు.. పూర్తి వివరాలు

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులోని క్యాబిన్ డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ మరియు అప్హోల్స్టరీ కూడా డ్యూయల్-టోన్‌లో ఉంచబడ్డాయి. డ్యాష్‌బోర్డ్‌కు డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో బ్లాక్ పియానో ​​ఫినిషింగ్ ఇవ్వబడింది, ఇది మరింత ప్రీమియం అవుతుంది. ఇందులో డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్ మౌంట్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 25.4 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 20.32 సెం.మీ డిజిటల్ కాక్‌పిట్ వంటి ఫీచర్లు ఇందులో అందించబడ్డాయి.

మళ్ళీ పెరిగిన స్కోడా స్లావియా ధరలు.. పూర్తి వివరాలు

స్లావియా మొత్తం 5 కలర్ అప్సన్స్ లో అందించనుంది. అవి కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, టోర్నాడో రెడ్ మరియు క్రిస్టల్ బ్లూ కలర్స్. దీని కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది.

మళ్ళీ పెరిగిన స్కోడా స్లావియా ధరలు.. పూర్తి వివరాలు

చివరగా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్ విత్ ఈబిడి, రివర్స్ పార్కింగ్ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

మళ్ళీ పెరిగిన స్కోడా స్లావియా ధరలు.. పూర్తి వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

స్కోడా కంపెనీ యొక్క విజయవంతమైన మోడల్స్ లో స్లావియా ఒకటి. ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న ఈ సెడాన్ ఇప్పుడు మరో సారి ధరల పెరుగుదలను పొందటం వల్ల అమ్మకాలపైనే ఏమైనా ప్రభావం చూపుతుందా అనేది తలెత్తుతున్న ప్రశ్న. అంతే కాకుండా స్కోడా కుషాక్ కూడా ధరల పెరుగుదలను పొందింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Sunday, November 6, 2022, 8:00 [IST]
English summary
Skoda slavia sedan price hike second time details
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+