Skoda Slavia: వేరియంట్స్, ఫీచర్స్ మరియు పూర్తి వివరాలు

'స్కోడా' (Skoda) కంపెనీ భారతీయ మార్కెట్లో ఇటీవల కాలంలోనే కొత్త 'స్లావియా' (Slavia) సెడాన్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త స్కోడా స్లావియా ప్రారంభ ధర రూ. 10.69 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ సెడాన్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. కావున ఎక్కువమంది కొనుగోలుదారులను తప్పకుండా ఆకర్షిస్తుంది.

స్కోడా స్లావియా మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ వేరియంట్లు. స్కొడా స్లావియా యొక్క ఈ మూడు వేరియట్ల ధరలు ఫీచర్స్ మరియు ఇంజిన్ వంటి మరిన్ని వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

Skoda Slavia: వేరియంట్స్, ఫీచర్స్ మరియు పూర్తి వివరాలు

స్కోడా స్లావియా యాక్టివ్:

స్కోడా స్లావియా యొక్క మూడు వేరియంట్లలో 'యాక్టివ్' ఒకటి. దీని ధర రూ. 10.69 లక్షలు. ఈ సెడాన్ ఆధునిక డిజైన్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో కూడిన హాలోజన్ హెడ్‌లైట్లు, వీల్ కవర్‌లతో కూడిన 15-ఇంచెస్ స్టీల్ వీల్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్‌లు మరియు మాన్యువల్‌ ఫోల్డబుల్ ఎక్స్‌టీరియర్ మిర్రర్‌ వంటి వున్నాయి. అంతే కాకూండా ఈ వేరియంట్ గ్రైనీ మరియు పియానో ​​బ్లాక్ ఇంటీరియర్ పొందుతుంది.

Skoda Slavia: వేరియంట్స్, ఫీచర్స్ మరియు పూర్తి వివరాలు

ఇందులో 7.0-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, 4-స్పీకర్ సౌండ్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, MID విత్ అనలాగ్ డయల్ మరియు మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్ తో పాటు, ఎలక్ట్రానిక్‌ అడ్జస్టబుల్ ORVMలు, కీలెస్ ఎంట్రీ వంటి కూడా ఉంటాయి.

Skoda Slavia: వేరియంట్స్, ఫీచర్స్ మరియు పూర్తి వివరాలు

స్కోడా స్లావియా యాక్టివ్ వేరియంట్ టెలిస్కోపికల్‌ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, బ్లాక్ ఫాబ్రిక్ అపోల్స్ట్రే, రియర్ డీఫాగర్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్‌, మల్టీ-కొలిజన్ బ్రేక్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు కూడా పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

స్లావియా యాక్టివ్ వేరియంట్ 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌తో మాన్యువల్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

Skoda Slavia: వేరియంట్స్, ఫీచర్స్ మరియు పూర్తి వివరాలు

స్కోడా స్లావియా యాంబిషన్:

స్కోడా స్లావియా యాంబిషన్ ధర రూ. 12.39 లక్షల నుండి రూ. 13.59 లక్షల వరకు ఉంటుంది. ఈ వేరియంట్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో కూడిన 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ వేరియంట్‌లో 16-ఇంచెస్ సింగిల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, స్ప్లిట్-ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్స్, ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ORVMలు మరియు సిల్వర్ ఇన్‌సర్ట్‌లతో కూడిన పియానో ​​బ్లాక్ డ్యాష్‌బోర్డ్ ఉన్నాయి.

Skoda Slavia: వేరియంట్స్, ఫీచర్స్ మరియు పూర్తి వివరాలు

అంతే కాకుండా ఈ వేరియంట్‌లో 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, అడ్వాన్స్‌డ్ అనలాగ్ డయల్ విత్ MID, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.

Skoda Slavia: వేరియంట్స్, ఫీచర్స్ మరియు పూర్తి వివరాలు

స్కోడా స్లావియా యాంబిషన్ వేరియంట్ ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, కప్‌హోల్డర్‌లతో రియర్ ఆర్మ్‌రెస్ట్, డ్రైవర్ విండో వన్-టచ్ ఆటో అప్/డౌన్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, పుష్-బటన్ స్టార్ట్, పాడిల్ షిఫ్టర్స్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు హిల్ హోల్డ్ కంట్రోల్ వంటివి కూడా పొందుతాయి.

Skoda Slavia: వేరియంట్స్, ఫీచర్స్ మరియు పూర్తి వివరాలు

స్కోడా స్లావియా స్టైల్ (సన్‌రూఫ్ లేకుండా)

సన్‌రూఫ్ లేకుండా స్కోడా స్లావియా స్టైల్ వేరియంట్స్ ధర - రూ. 13.59 లక్షలు. ఈ వేరియంట్ 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌తో మాన్యువల్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది. ఈ వేరియంట్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, 16-ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, విండో లైన్‌లో క్రోమ్ గార్నిష్, పియానో ​​బ్లాక్ ఇన్సర్ట్ మరియు వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌ కలిగి ఉంటుంది.

Skoda Slavia: వేరియంట్స్, ఫీచర్స్ మరియు పూర్తి వివరాలు

అంతే కాకుండా.. ఈ వేరియంట్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్, మైస్కోడా కనెక్ట్ చేయబడిన కార్ టెక్, హైట్ అడ్జస్టబుల్ కో-డ్రైవర్ సీటు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎంలు మరియు సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Skoda Slavia: వేరియంట్స్, ఫీచర్స్ మరియు పూర్తి వివరాలు

స్కోడా స్లావియా స్టైల్ (సన్‌రూఫ్‌)

సన్‌రూఫ్‌ కలిగిన స్కోడా స్లావియా స్టైల్ వేరియంట్ ధర రూ. 13.99 లక్షల నుంచి రూ. 17.79 లక్షల వరకు ఉంటుంది. స్లావియా యొక్క ఈ వేరియంట్ 1.0 లీటర్ టిఎస్ఐ మాన్యువల్ గేర్‌బాక్స్, 1.0 లీటర్ టిఎస్ఐ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 1.5 టిఎస్ఐ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 1.5 టిఎస్ఐ DCT గేర్‌బాక్స్‌లలో విక్రయిస్తోంది. ఈ వేరియంట్ 8.0 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సింగిల్-పాన్ సన్‌రూఫ్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు మరియు సబ్ వూఫర్‌లను పొందుతుంది. మొత్తం మీద ఇది సన్ రూప్ కలిగి ఉండటం వల్ల మిగిలిన వేరియంట్స్ కంటే కూడా చాలా ఆధునికంగా చాలా అనుకూలంగా ఉంటుంది.

Skoda Slavia: వేరియంట్స్, ఫీచర్స్ మరియు పూర్తి వివరాలు

స్లావియా మొత్తం 5 కలర్ అప్సన్స్ లో అందించనుంది. అవి కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, టోర్నాడో రెడ్ మరియు క్రిస్టల్ బ్లూ కలర్స్. దీని కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, March 11, 2022, 13:34 [IST]
English summary
Skoda slavia sedan variant wise features and price details
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+