Skoda Slavia టెస్ట్ డ్రైవ్ స్టార్ట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

చెక్ రిపబ్లిక్ కార్ తయారీ దిగ్గజం అయిన స్కోడా (Skoda) భారతీయ మార్కెట్లో తన 'స్కోడా స్లావియా' (Skoda Slavia) సెడాన్ 2022 ఫిబ్రవరి 28 న అధికారికంగా విడుదల చేయనుంది. ఇప్పటికే కంపెనీ ఈ కొత్త కారు గురించిన చాలా సమాచారం వెల్లడించింది. అయితే ఇప్పుడు టెస్ట్ డ్రైవ్స్ కూడా ప్రారంభించింది. కానీ డెలివరీలు స్లావియా విడుదలైన తరువాత జరుగుతాయి. అధికారిక ధరలు కూడా అప్పుడే ప్రకటించబడతాయి.

Skoda Slavia టెస్ట్ డ్రైవ్ స్టార్ట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

కొత్త స్కోడా స్లావియా ఇప్పటికే డీలర్‌షిప్‌లకు చేరుకోవడం ప్రారంభించింది. కావున డెలివరీలు కూడా త్వరలోనే జరుగాయి. దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతుం 'స్కోడా స్లావియా' రెండు ఇంజన్ ఆప్షన్‌లలో విడుదలకానుంది. కావున ఇవి రెండూ కూడా వేరువేరు రోజుల్లో మార్కెట్లో విడుదలవుతాయి. ఇందులోకి 1.0 లీటర్ టిఎస్ఐ మోడల్ ఈ నెల 28 న విడుదల కానుంది. అదే విధంగా 1.5 లీటర్ టిఎస్ఐ మోడల్ 2022 మార్చి 03 న విడుదల కానుంది.

Skoda Slavia టెస్ట్ డ్రైవ్ స్టార్ట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

స్కోడా స్లావియా కోసం బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారభించబడింది. కొత్త స్లావియా మహారాష్ట్రలోని చకాన్‌ ప్లాంట్ లో ఉత్పత్తి చేయబడుతోంది. ఇందులో 500 ఆధునిక రోబోట్లు కారు మొత్తాన్ని పూర్తిగా పరీక్షిస్థాయి.

స్కోడా స్లావియా మొత్తం మూడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. అవి యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. స్కోడా స్లావియా కంపెనీ యొక్క ఉత్పత్తి అయిన రాపిడ్ స్థానంలో తీసుకురాబడుతోంది, అయితే ఇది పూర్తిగా కొత్త మోడల్, ఇటీవల కంపెనీ తన వెబ్‌సైట్ నుండి రాపిడ్‌ను తొలగించింది. స్కోడా రాపిడ్ కంపెనీ యొక్క బెస్ట్ మోడల్.

Skoda Slavia టెస్ట్ డ్రైవ్ స్టార్ట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

ఇప్పటికి వెలువడిన నివేదికల సమాచారం ప్రకారం, కొత్త స్కోడా స్లావియా యొక్క 1.0 లీటర్ TSI మాన్యువల్ ధర రూ. 10.80 లక్షల నుండి రూ. 14.50 లక్షల వరకు ఉంటుంది. అదే విధంగా యాంబిషన్ ఆటోమేటిక్ ధర రూ. 14 లక్షలు కాగా, స్టైల్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 15.75 లక్షలు. ఇక ఇందులోని 1.5 లీటర్ స్టైల్ మాన్యువల్ ధర రూ. 16.70 లక్షలు మరియు ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 17.70 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరకు కేవలం అంచనా మాత్రమే, కంపెనీ వీటి ధరలను విడుదల సమయంలో అధికారికంగా వెల్లడించనుంది.

Skoda Slavia టెస్ట్ డ్రైవ్ స్టార్ట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

స్లావియా మొత్తం 5 కలర్ అప్సన్స్ లో అందించనుంది. అవి కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, టోర్నాడో రెడ్ మరియు క్రిస్టల్ బ్లూ కలర్స్. దీని కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది.

Skoda Slavia టెస్ట్ డ్రైవ్ స్టార్ట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

స్కోడా స్లావియా MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన సెడాన్. దీని డిజైన్ ఇటీవల అప్‌డేట్ చేయబడిన ఆక్టావియా వంటి సెడాన్‌ల నుండి ప్రేరణ పొందింది. కొత్త స్కోడా స్లావియా కంపెనీ ప్రస్తుత ర్యాపిడ్ మోడల్ కంటే పెద్దదిగా ఉంటుంది.

Skoda Slavia టెస్ట్ డ్రైవ్ స్టార్ట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

కంపెనీ యొక్క ఈ కొత్త స్కోడా స్లావియా రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ 3 సిలిండర్ కాగా, మరొకటి 1.5-లీటర్ టిఎస్ఐ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

Skoda Slavia టెస్ట్ డ్రైవ్ స్టార్ట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ 3-సిలిండర్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్‌తో అందించబడుతుంది. ఇక 1.5-లీటర్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

Skoda Slavia టెస్ట్ డ్రైవ్ స్టార్ట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

స్కోడా స్లావియా చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ సెడాన్‌లో కంపెనీ సిగ్నేచర్ బటర్‌ఫ్లై ఆకారపు ఫ్రంట్ గ్రిల్ మరియు పెద్ద రేడియేటర్ గ్రిల్ అందించింది. అంతే కాకుండా ఇందులో ఎల్-షేప్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు బూట్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ రీసెస్‌ను కూడా పొందుతుంది. ఈ కారు యొక్క ORVMలపై టర్న్ ఇండికేటర్లను మరియు సైడ్ బాడీలో లైనింగ్‌ను పొందుతుంది.

Skoda Slavia టెస్ట్ డ్రైవ్ స్టార్ట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

కంపెనీ ఇంతకుముందే ఈ స్లావియా సెడాన్ యొక్క ఇంటీరియర్‌ను కూడా అప్‌డేట్ చేసింది. ఇది ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని క్యాబిన్‌ను డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో పరిచయం చేసింది, ఇది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్ మరియు అపోల్స్ట్రే కూడా డ్యూయల్-టోన్‌లో ఉంచబడ్డాయి.

Skoda Slavia టెస్ట్ డ్రైవ్ స్టార్ట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

అంతే కాకుండా డ్యాష్‌బోర్డ్‌కి డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో బ్లాక్ పియానో ​​ఫినిషింగ్ కూడా ఇవ్వబడింది, కావున ఇది మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. ఇందులో డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్ మౌంట్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 25.4 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 20.32 సెం.మీ డిజిటల్ కాక్‌పిట్ వంటి ఫీచర్లను పొందుతుంది.

Skoda Slavia టెస్ట్ డ్రైవ్ స్టార్ట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ESC, ఐసోఫిక్స్ మౌంట్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా మరియు రియర్ పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి. భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త స్లావియా హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, February 25, 2022, 10:01 [IST]
English summary
Skoda slavia test drive start delivery details revealed
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+