Skoda Slavia లో తప్పక తెలుసుకోవలసిన విషయాలు.. ఇక్కడ చూడండి

స్కోడా కంపెనీ యొక్క కొత్త స్లావియా దేశీయ మార్కెట్లో విడుదలైంది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ సెడాన్ యొక్క ప్రారంభ ధర రూ. 10.69 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే టాప్ వేరియంట్ ధర రూ. 15.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). స్కోడా స్లావియా MQB-AO-IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన కంపెనీ యొక్క రెండవ మోడల్. ఇప్పటికే కంపెనీ యొక్క కుషాక్ ఈ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది.

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త సెడాన్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. వీటి గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Skoda Slavia లో తప్పక తెలుసుకోవలసిన విషయాలు.. ఇక్కడ చూడండి

డిజైన్ మరియు కలర్ ఆప్సన్స్:

స్కోడా స్లావియా అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది LED హెడ్‌లైట్, LED DRLలు, క్రోమ్ సరౌండ్‌తో షట్కోణ ఫ్రంట్ గ్రిల్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, డోర్ హ్యాండిల్స్‌పై క్రోమ్ యాక్సెంట్‌లు మరియు యాంటీ-పించ్ టెక్నాలజీ వంటి ఫీచర్లను పొందుతుంది. అంతే కాకుండా ఇది L- షేప్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, 16-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు బూట్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ వంటివి కూడా పొందుతుంది.

Skoda Slavia లో తప్పక తెలుసుకోవలసిన విషయాలు.. ఇక్కడ చూడండి

స్లావియా మొత్తం 5 కలర్ అప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, టోర్నాడో రెడ్ మరియు క్రిస్టల్ బ్లూ కలర్స్.

Skoda Slavia లో తప్పక తెలుసుకోవలసిన విషయాలు.. ఇక్కడ చూడండి

వేరియంట్స్ & ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ ఆప్సన్స్:

స్కోడా స్లావియా మొత్తం 3 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ వేరియంట్స్.

Skoda Slavia లో తప్పక తెలుసుకోవలసిన విషయాలు.. ఇక్కడ చూడండి

స్కోడా స్లావియా 1.0 లీటర్ మరియు 1.5 లీటర్ TSI పెట్రోల్ ఇంజన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో 1.0 లీ ఇంజిన్ అన్ని వేరియంట్‌లలో అందించబడుతోంది, అయితే 1.5L ఇంజిన్ టాప్ వేరియంట్ స్టైలింగ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 1.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

ఇక రెండవ ఇంజిన్ 1.5-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజన్ ఇది 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇవి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను పొందుతాయి.

Skoda Slavia లో తప్పక తెలుసుకోవలసిన విషయాలు.. ఇక్కడ చూడండి

ఇంటీరియర్ మరియు ఫీచర్స్:

స్కోడా స్లావియా అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు స్కోడా కనెక్ట్ యాప్ ఉన్నాయి. ఇది కాకుండా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, డిజిటల్ 8-ఇంచెస్ డ్రైవర్ డిస్‌ప్లే, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ మరియు మల్టిపుల్ స్పీకర్స్ వంటివి కలిగి ఉంటాయి.

Skoda Slavia లో తప్పక తెలుసుకోవలసిన విషయాలు.. ఇక్కడ చూడండి

కొలతలు:

స్కోడా స్లావియా యొక్క పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది. పరిమాణం పరంగా, స్కోడా స్లావియా దాని విభాగంలో హోండా సిటీ తర్వాత రెండవ అతిపెద్ద సెడాన్. ఇందులో 521 లీటర్ల బూట్ స్పేస్ కూడా అందుబాటులో ఉంటుంది.

Skoda Slavia లో తప్పక తెలుసుకోవలసిన విషయాలు.. ఇక్కడ చూడండి

ప్రత్యర్థులు:

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త స్కోడా స్లావియా సెడాన్ హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Skoda Slavia లో తప్పక తెలుసుకోవలసిన విషయాలు.. ఇక్కడ చూడండి

స్లావియా యొక్క ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభించబడింది, వేలాది మంది నిపుణుల సహాయంతో కంపెనీ దీనిని తయారు చేస్తోంది. వీటిని 500 ఆధునిక రోబోట్లు పూర్తిగా పరీక్షిస్తున్నాయి. స్కోడా స్లావియా ప్రస్తుతం 1.0 TSI పవర్డ్ వెర్షన్‌ మాత్రమే విడుదల చేసింది. అయితే 1.5 లీటర్ టిఎస్ఐ వేరియంట్ మార్చి 3న విడుదలవుతుంది. ధర కూడా అప్పుడే ప్రకటించబడుతుంది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు స్కోడా యొక్క స్లావియా దేశీయ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. కావున ఇది మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే విషయం త్వరలో తెలుస్తుంది.

Skoda Slavia లో తప్పక తెలుసుకోవలసిన విషయాలు.. ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త స్కోడా స్లావియా సెడాన్ హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే స్లావియా వీటికి మార్కెట్లో ప్రత్యర్థిగా నిలుస్తుందా.. కంపెనీ యొక్క అమ్మకాలను పెంచడంలో సహాయపడుతుందా.. అనే మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. అప్పటి వరకు కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి మా అధికారిక డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, March 2, 2022, 10:51 [IST]
English summary
Skoda slavia top 5 things to know price engine transmission features details
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+