స్కోడా కుషాక్ ఇప్పుడు కొత్త 'యానివెర్సరీ ఎడిషన్' లో.. ధర రూ. 15.59 లక్షలు
స్కోడా కంపెనీ యొక్క కుషాక్ SUV భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కూడా మంచి అమ్మకాలతో దూసుకెళుతోనే ఉంది. అయితే కంపెనీ తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు ఇందులో కొత్త కొత్త అప్డేట్స్ తీసుకువస్తూనే ఉంది. ఇందులో భాగంగానే స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్ మరియు కుషాక్ ఎన్ఎస్ఆర్ వంటివి మార్కెట్లో విడుదలయ్యాయి. కాగా ఇప్పుడు ఇందులో నుంచి మరో కొత్త వేరియంట్ లాంచ్ అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కంపెనీ ఇప్పుడు దేశీయ మార్కెట్లో 'కుషాక్ యానివెర్సరీ ఎడిషన్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 15.59 లక్షలు. ఇది ప్రస్తుతం స్టైల్ 1.0 మరియు స్టైల్ 1.5 అనే రెండు ట్రిమ్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో స్టైల్ 1.0 ధర రూ. 15.59 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా స్టైల్ 1.5 ధర రూ. 19.09 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).
| Engine | Kushaq Style | Kushaq Anniversary Edition | Premium |
| 1-litre TSI MT | ₹15.29 Lakh | ₹15.59 Lakh | ₹30,000 |
| 1-litre TSI AT | ₹16.99 Lakh | ₹17.29 Lakh | ₹30,000 |
| 1.5-litre TSI MT | ₹17.19 Lakh | ₹17.49 Lakh | ₹30,000 |
| 1.5-litre TSI DSG | ₹18.79 Lakh | ₹19.09 Lakh | ₹30,000 |

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త 'కుషాక్ యానివర్సరీ ఎడిషన్' డిజైన్ మరియు ఫీచర్ చాలా వరకు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటాయి. ఎక్స్టీరియర్ కలర్ కూడా మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు.

కుషాక్ యానివర్సరీ ఎడిషన్ ఇప్పటికే మార్కెట్లో విడుదలైన కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యానివర్సరీ ఎడిషన్ మాదిరిగానే స్టీరింగ్ వీల్‌పై 'యానివర్సరీ ఎడిషన్' బ్యాడ్జ్, కొత్త డోర్-ఎడ్జ్ ప్రొటెక్టర్లు, కొత్త కాంట్రాస్ట్ స్టిచింగ్ మరియు క్రోమ్ అప్లిక్ వంటి వాటిని పొందుతుంది. అదే సమయంలో ఫ్రంట్ బంపర్, సన్‌రూఫ్ మరియు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌పై ఫాక్స్ డిఫ్యూజర్ ఎలిమెంట్ పొందుతుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కి సపోర్ట్ చేసే 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో డిజిటల్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

కొత్త కుషాక్ యానివర్సరీ ఎడిషన్ టాప్-స్పెక్ స్టైల్ 1.0 మరియు 1.5 ట్రిమ్‌లపై ఆధారపడి ఉంటుంది. కావున ఇది 1.0-లీటర్, త్రీ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ పొందుతుంది.

1.0-లీటర్, త్రీ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ అందుబాటులో ఉంటుంది. 1.5 లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్‌తో 7 స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ ఆప్సన్ కలిగి ఉంది.

సేఫ్టీ విషయంలో కూడా ఇందులో ఆధునిక ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి, కావున కుషాక్ యానివర్సరీ ఎడిషన్ లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐసోఫిక్స్ సీట్లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు మల్టీ-కొలిక్షన్ బ్రేక్‌లు, ఎబిడి విత్ ఇబిడి వంటివి ఉన్నాయి.

స్కోడా కుషాక్ యొక్క యానివర్సరీ ఎడిషన్ దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, నిస్సాన్ కిక్స్, ఎమ్‌జి ఆస్టర్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఇది గట్టి పోటీని ఎదురికివాల్సి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
స్కోడా కంపెనీ యొక్క అమ్మకాలు పెరగడానికి కుషాక్ ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ SUV ఆధునిక డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ కలిగి కొనుగోలుదారులను ఆకర్శించడంలో విజయం సాధించింది. అయితే ఈ సమయంలో కుషాక్ యానివర్సరీ ఎడిషన్ విడుదల కావడం మరింత మంచి అమ్మకాలు పొందటానికి దోహదపడే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.
Source: Autocar India


Click it and Unblock the Notifications








