Just In
- 8 hrs ago 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 10 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 11 hrs ago కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 13 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మీకు తెలుసా.. దేశవ్యాప్తంగా సిట్రోయెన్ సి3 అందుబాటులో ఉన్న డీలర్‌షిప్‌లు, ఇవే
ప్రముఖ ప్రెంచ్ కార్ తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) భారతీయ మార్కెట్లో తన మొదటి కారుని విడుదల చేసి బాగా ప్రాచుర్యం పొందిన తరువాత ఇటీవల ఒక బుజ్జి ఎస్యూవీ (సిట్రోయెన్ సి3) లాంచ్ చేసింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ప్రస్తుత తరానికి సరిపోయే విధంగా రూపొందించడం జరిగింది.
సిట్రోయెన్ సి3 ప్రారంభ ధర రూ. 5.71 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 8.06 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయకముందే.. బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఇటీవల డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు దేశం మొత్తం మీద సిట్రోయెన్ కంపెనీ యొక్క అధికారిక డీలర్‌షిప్‌లు ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
భారతదేశం మొత్తం మీద సిట్రోయెన్ కంపెనీకి 17 నగరాల్లో మొత్తం 18 డీలర్‌షిప్‌లు ఉన్నాయి. అవి
- ఆంధ్రప్రదేశ్ - విశాఖపట్నం
- తెలంగాణ - హైదరాబాద్
- కర్ణాటక - బెంగళూరు (2 డీలర్‌షిప్‌లు)
- తమిళనాడు - చెన్నై, కోయంబత్తూరు
- కేరళ - కాలికట్, కొచ్చి
- మహారాష్ట్ర - పూణే, ముంబై
- గుజరాత్ - అహ్మదాబాద్, సూరత్
- న్యూఢిల్లీ
- చండీగఢ్
- పశ్చిమ బెంగాల్ - కోల్‌కతా
- ఉత్తరప్రదేశ్ - లక్నో
- రాజస్థాన్ - జైపూర్
- హర్యానా - గురుగ్రామ్
అయితే పైన తెలిపిన నగరాల్లో మాత్రమే కాకూండా కంపెనీ మొత్తం 90 నగరాల్లో ఆన్లైన్ ద్వారా తన వాహనాలను విక్రయిస్తుంది. కావున సిట్రోయెన్ సి3 కొనాలనే కస్టమర్లు ఏ మాత్రం చింతించాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా కంపెనీ ఈ సంవత్సరం చివరి నాటికి దేశం మొత్తం మీద 30 షోరూమ్‌లను తీసుకురానున్నట్లు తెలిపింది. అప్పుడు ఈ అన్ని షోరూమ్‌లలో సిట్రోయెన్ వాహనాలు విక్రయించబడతాయి.
ఆన్లైన్ ప్రక్రియ మొత్తం 3D కాన్ఫిగరేషన్ లో జరుగుతుంది. కావున ఇంహులో ఇన్సూరెన్స్ మరియు ఫైనాన్స్ మరియు సర్వీస్ ప్యాకేజీ వంటి అన్నీ కూడా పొందవచ్చు. కంపెనీ ఈ ప్రక్రియలో వాహనాలనునేరుగా కస్టమర్ కి హోమ్ డెలివరీ చేస్తుంది.
ఇక సిట్రోయెన్ కంపెనీ యొక్క సి3 విషయానికి వస్తే, ఇది రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో ఒకటి 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ కాగా, మరొకటి 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్.
1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వెర్షన్ 81 బిహెచ్పి పవర్ మరియు 115 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. టర్బోచార్జ్డ్ వెర్షన్ యొక్క 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 108 బిహెచ్పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది.
సిట్రోయెన్ సి3 ప్రస్తుతం లైవ్ మరియు ఫీల్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఎస్యూవీ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇప్పుడు కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్లో రూ.21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. సిట్రోయెన్ సి3 భారతదేశంలో ఉత్పత్తి కానున్న మేడ్-ఇన్-ఇండియా ప్రోడక్ట్. ఎందుకంటే ఇది భారతదేశంలో ఉత్పత్తి కానున్న సిట్రోయెన్ కంపెనీ యొక్క మొదటి ఉత్పత్తి.
సిట్రోయెన్ సి3 ముందు భాగంలోని బంపర్లపై కలర్-కోడెడ్ ఇన్సర్ట్లు, గ్రిల్‌తో కలిసే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, హెక్సా గోనల్ ఎయిర్ డ్యామ్, X-షేప్ లో ఉండే ఫాక్స్ స్కఫ్ ప్లేట్, రూఫ్ రెయిల్స్ మరియు బాడీ క్లాడింగ్ ఉన్నాయి. ఇది 15 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇక వెనుక భాగంలో ర్యాపరౌండ్ టెయిల్-లైట్స్ చక్కగా అమర్చబడి ఉన్నాయి.
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో యుఎస్బి ఛార్జింగ్ సాకేట్, ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, వర్టికల్ ఏసీ వెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్ విత్ ఈబిడి, సెంట్రల్ లాక్/అన్‌లాక్ బటన్, డీఫాగర్, పవర్డ్ వింగ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ మరియు సీట్‌బెల్ట్ రిమైండర్ వంటివి ఉన్నాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన కోట్ సిట్రోయెన్ సి3 టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ మరియు మారుతి సుజుకి ఇగ్నిస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.