కారులో మీ ప్రయాణం సురక్షితంగా సాగాలంటే, మీ డ్రైవింగ్ పొజిషన్‌ను ఇలా సెట్ చేసుకోండి..!

రోడ్డుపై వాహనం నడపడం అనేది ఎవ్వరికీ జన్మతహా వచ్చే హక్కు కాదు. వాహనాన్ని డ్రైవింగ్ చేయడం అనేది ఓ విశేషాధికారం లాంటిది మరియు ఈ అధికారాన్ని పొందాలంటే, సదరు వ్యక్తి తన నైపుణ్యం మరియు తెలివితేటలతో దానిని సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం సదరు వ్యక్తులు రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కలిగి ఉండాలి. అలాగే, తాను ఉపయోగించే వాహనం గురించి కూడా పూర్తిగా తెలుసుకొని ఉండాలి.

కారులో మీ ప్రయాణం సురక్షితంగా సాగాలంటే, మీ డ్రైవింగ్ పొజిషన్‌ను ఇలా సెట్ చేసుకోండి..!

ఎవరైనా సరే రోడ్డుపై వాహనం నడపడానికంటే ముందుగా, సదరు వాహనం యొక్క స్థితిగతుల గురించి తెలుసుకొని ఉండాలి. అలాకాకుండా, వాహనం గురించి ఏమీ తెలియకుండా నేరుగా డ్రైవ్ చేయడం ప్రారంభిస్తే, ప్రమాదాలను కొని తెచ్చుకోవడం ఖాయం. ఉదాహరణకు, కారును నడిపేటప్పుడు డ్రైవర్ సీటును సర్దుబాటు చేసుకోవడం మరియు ఆ సీటు సర్దుబాటుకి అనుగుణంగా సైడ్ మిర్రర్స్ మరియు ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ ని సర్దుబాటు చేసుకోవడం చాలా అవసరం.

కారులో మీ ప్రయాణం సురక్షితంగా సాగాలంటే, మీ డ్రైవింగ్ పొజిషన్‌ను ఇలా సెట్ చేసుకోండి..!

ఈనాటి మన కథనంలో కారు లోపల డ్రైవర్ సీటుని ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మనదేశంలో విభిన్న డ్రైవింగ్ భంగిమలను (డ్రైవర్ పొజిషన్స్) అనుసరించే రకరకాల డ్రైవర్లను సర్వసాధారణంగా చూస్తుంటాం. అయితే, ఈ డ్రైవింగ్ పొజిషన్ అంశాన్ని తేలికగా తీసుకుంటే, ఆ తర్వాత తీవ్ర పరిణామాలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి, సరైన డ్రైవింగ్ పొజిషన్‌ను ఎలా సెట్ చేయాలనే దానిని దశల వారీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

కారులో మీ ప్రయాణం సురక్షితంగా సాగాలంటే, మీ డ్రైవింగ్ పొజిషన్‌ను ఇలా సెట్ చేసుకోండి..!

ఒకప్పటి కార్లలో డ్రైవర్ పొజిషన్ ను మ్యాన్యువల్ గా సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చేది. అలాంటి కార్లలో డ్రైవర్ సీటును కేవలం ముందుకు లేదా ఎత్తుకు మాత్రమే సర్దుబాటు చేసుకునే వెసలుబాటు ఉండేది. అంతకు ముందు కార్లలో ఎయితే, అసలు ఎత్తు సర్దుబాటు సౌలభ్యమే ఉండేది కాదు. కాబట్టి, కాస్తంత కురచగా ఉండే డ్రైవర్లు తమ సీటు ఎత్తును పెంచుకోవడం కోసం సీటుపై ఎత్తుగా ఉండే మ్యాట్స్ లేదా దిండ్లు మొదలైన వాటిని ఉపయోగించేవారు. అయితే, ఆధునిక కార్లలో ఇప్పుడు ఆ సమస్యలు లేవు.

కారులో మీ ప్రయాణం సురక్షితంగా సాగాలంటే, మీ డ్రైవింగ్ పొజిషన్‌ను ఇలా సెట్ చేసుకోండి..!

ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న అనేక ఆధునిక కార్లు డ్రైవర్ సీటును వివిధ రకాలుగా సర్దుబాటు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. వీటిలో డ్రైవర్ సీట్ ఎత్తు, హెడ్‌రెస్ట్ ఎత్తు, లంబార్ సపోర్ట్ (వెన్నెముక మద్దతు కోసం), డ్రైవర్ సీటును ముందుకు లేదా వెనుకకు సర్దుబాటు చేసుకోవడం మొదలైన సదుపాయాలు ఉన్నాయి. కొన్ని కార్లలో ఈ ఫీచర్లు మ్యాన్యువల్ రూపంలో ఉంటే, మరికొన్ని ప్రీమియం కార్లలో ఈ ఫీచర్ ఎలక్ట్రిక్ రూపంలో ఉంటుంది.

కారులో మీ ప్రయాణం సురక్షితంగా సాగాలంటే, మీ డ్రైవింగ్ పొజిషన్‌ను ఇలా సెట్ చేసుకోండి..!

ప్రీమియం కార్లలో డ్రైవర్ పొజిషన్‌ను ఒక్కసారి పూర్తిగా సర్దుబాటు చేసుకున్న తర్వాత ఆ పొజిషన్‌ను అలానే సేవ్ చేసుకునే మెమరీ ఫంక్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. కాబట్టి, ఇలాంటి ప్రీమియం కార్లలో డ్రైవర్ మారిన ప్రతిసారి తన సీటును తిరిగి యధాస్థానానికి సర్దుబాటు చేసుకోవడానికి కేవలం ఒక్క బటన్ నొక్కితే సరిపోతుంది. ఇదంతా వినడానికి బాగానే ఉన్నప్పటికీ, రియాలిటీలో డ్రైవర్ పొజిషన్ సరిగ్గా లేకుంటే, రోడ్డుపై మన పొజిషన్ కూడా సరిగ్గా లేనట్లే అనే విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

కారులో మీ ప్రయాణం సురక్షితంగా సాగాలంటే, మీ డ్రైవింగ్ పొజిషన్‌ను ఇలా సెట్ చేసుకోండి..!

మొదటి దశ: సీటు ఎత్తు సర్దుబాటు చేయడం

డ్రైవర్ సీటును ఎత్తును సర్దుబాటు చేసుకునేటప్పుడు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మీరు మీ కారు సీటు ఎత్తును సర్దుబాటు చేసేటప్పుడు మీ సీటింగ్ పొజిషన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కు స్టీరింగ్ వీల్ అడ్డుపడని విధంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే, మీ కారు ఎంత వేగంలో వెళ్తుంది, కారులో ఇంధనం ఎంత మిగిలి ఉంది మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై ప్రత్యక్షమయ్యే కొన్ని అత్యవసర సంజ్ఞలు (వార్నింగ్ లైట్స్) మొదలైన వాటిని మీరు గమనించకుండాపోయే ప్రమాదం ఉంటుంది.

కారులో మీ ప్రయాణం సురక్షితంగా సాగాలంటే, మీ డ్రైవింగ్ పొజిషన్‌ను ఇలా సెట్ చేసుకోండి..!

రెండవ దశ: సీటింగ్ దూరం సర్దుబాటు చేయడం

డ్రైవర్ సీటు ఎత్తును సర్దుబాటు చేసుకున్నట్లుగానే, సీటింగ్ దూరాన్ని కూడా సౌకర్యంగా ఉండేలా సర్దుబాటు చేసుకోవాలి. మీ కాలి నుండి పెడల్స్ ఎక్కువ దూరం లేకుండా చూసుకోవాలి. అత్యవసర సమయాల్లో మీ కాలు బ్రేక్ పెడల్‌ను పూర్తిగా చేరుకునేలా ఉండాలి. అలాగే, కారు సీటు దూరాన్ని మరీ దగ్గరగా కూడా సర్దుబాటు చేసుకోకూడదు. ఇలా చేయడం వలన స్టీరింగ్ వీల్ మీ కాళ్లకు తగిలే అకాశం ఉంటుంది మరియు మీరు కారు లోపలికి మరియు వెలుపలికి ప్రవేశించడంలో కాస్తంత ఇబ్బందిగా అనిపిస్తుంది.

కారులో మీ ప్రయాణం సురక్షితంగా సాగాలంటే, మీ డ్రైవింగ్ పొజిషన్‌ను ఇలా సెట్ చేసుకోండి..!

కారు సీటు దూరాన్ని సర్దుబాటు చేసేటప్పుడు, సదరు డ్రైవర్ బ్రేక్‌లపై ఒత్తిడిని వర్తింపజేసేటప్పుడు డ్రైవర్‌ను డ్రైవర్ సీటులోకి వెనక్కి నెట్టే విధంగా సీటును సెట్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన బ్రేకింగ్ యొక్క ప్రభావాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా, అత్యవసరంగా బ్రేక్ (పానిక్ బ్రేకింగ్) వేయాల్సి వచ్చినప్పుడు పెడల్ పై నుండి డ్రైవర్ కాలు జారిపోకుండా కూడా నివారించవచ్చు. అలాగే, సీటు దూరాన్ని మరియు ఎత్తును సర్దుబాటు చేసేటప్పుడు మూడు అద్దాలు (రెండు సైడ్ మిర్రర్స్, ఒక ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్) రెండింటినీ కూడా పూర్తి దృశ్యమానత (విజిబిలిటీ) ఉండేలా సర్దుబాటు చేసుకోవాలి.

కారులో మీ ప్రయాణం సురక్షితంగా సాగాలంటే, మీ డ్రైవింగ్ పొజిషన్‌ను ఇలా సెట్ చేసుకోండి..!

మూడవ దశ: సీట్ బ్యాక్‌రెస్ట్‌ను సర్దుబాటు చేయడం

కారును డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్ సీటు ఎత్తు మరియు దూరాన్ని సెట్ చేయడం ఎంత ముఖ్యమో, సౌకర్యవంతమైన డ్రైవింగ్ పొజిషన్ కోసం డ్రైవర్ సీట్ యొక్క బ్యాక్‌రెస్ట్ ను సర్దుబాటు చేయడం కూడా అంతే ముఖ్యం. డ్రైవర్ సీట్ బ్యాక్‌రెస్ట్‌ను సర్దుబాటు చేసేటప్పుడు, డ్రైవర్ యొక్క భుజం డ్రైవర్ సీటు వెనుక భాగంలో ఉండేలా బ్యాక్‌రెస్ట్‌ను ఉంచడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వలన వాహనంలో ఎక్కువ దూరం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సౌకర్యవంతమైన డ్రైవింగ్ పొజిషన్ లభిస్తుంది మరియు ప్రయాణంలో డ్రైవర్ అలసిపోవడాన్ని నివారిస్తుంది.

కారులో మీ ప్రయాణం సురక్షితంగా సాగాలంటే, మీ డ్రైవింగ్ పొజిషన్‌ను ఇలా సెట్ చేసుకోండి..!

నాల్గవ దశ: స్టీరింగ్ వీల్‌ను సర్దుబాటు చేయడం

డ్రైవింగ్ పొజిషన్ సెట్ చేసుకునేటప్పుడు కేవలం సీటును మాత్రమే పరిగణలోకి తీసుకుంటే సరిపోదు. ఈ విషయంలో వాహనం యొక్క స్టీరింగ్ సర్దుబాటు కూడా చాలా కీలకం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పైన తెలిపినట్లుగా మీరు డ్రైవింగ్ పొజిషన్‌ను సర్దుబాటు చేసిన తర్వాత చివరిగా మీ స్టీరింగ్ వీల్‌ను కూడా మీ డ్రైవింగ్ పొజిషన్‌కు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలి. చాలా కార్లలో టిల్ట్ మరియు అడ్జస్టబల్ స్టీరింగ్ సదుపాయం ఉంటోంది మరియు ఇది డ్రైవర్ సీటింగ్ పొజిషన్‌కు అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు సహకరిస్తుంది. కాబట్టి, పైన తెలిపినట్లుగా మీ కారును బయటకు తీయడానికి ముందే మీరు మీ డ్రైవింగ్ పొజిషన్‌ను సెట్ చేసుకున్నట్లయితే, రోడ్డుపై మీ ప్రయాణం సౌకర్యవంతంగా మరియు చాలా సురక్షితంగా సాగిపోతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 2, 2022, 11:00 [IST]
English summary
Step by step guide on how to setup a safest and comfortable driving position
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+