బెస్ట్ మైలేజ్ అందించే హైబ్రిడ్ కార్లు.. మైలేజ్ వివరాలు

సాధారణంగా ఎక్కువమంది వాహన కొనుగోలుదారులు ఎక్కువ మైలేజ్ అందించే వాహనాలను కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు కూడా ఎక్కువ మైలేజ్ అందించే వాహనాలను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంటారు. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో ఉత్తమ మైలేజ్ అందించే కొన్ని హైబ్రిడ్ కార్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ హైబ్రిడ్ కార్లను గురించిన మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

బెస్ట్ మైలేజ్ అందించే హైబ్రిడ్ కార్లు.. మైలేజ్ వివరాలు

కొన్ని నివేదికల ప్రకారం, ప్రస్తుతం అత్యధిక మైలేజ్ అందించే హైబ్రిడ్ కార్ల జాబితాలో 'మారుతి సుజుకి' (Maruti Suzuki) యొక్క 'గ్రాండ్ వితారా' (Grand Vitara) ఉంది. ఇది కంపెనీ నుంచి ఇటీవల కాలంలోనే గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించబడింది. మారుతి సుజుకి యొక్క కొత్త గ్రాండ్ విటారా 1.5-లీటర్ పెట్రోల్ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 115.56 హెచ్‌పి పవర్ మరియు 122 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. E-CVT గేర్‌బాక్స్‌తో జతచేయబడిన ఈ ఇంజన్ 27.97 కిమీ/లీ మైలేజీని ఇస్తుంది.

బెస్ట్ మైలేజ్ అందించే హైబ్రిడ్ కార్లు.. మైలేజ్ వివరాలు

మారుతి గ్రాండ్ వితారా తరువాత స్థానంలో 'హోండా' (Honda) కంపెనీ యొక్క 'హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ' (Honda City e:HEV) ఉంది. ఇందులోని 1.5 లీటర్ అట్కిన్సన్ i-VTEC పెట్రోల్ ఇంజన్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో కలిసి గరిష్టంగా 109 బిహెచ్‌పి పవర్ మరియు 253 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తాయి. ఈ కొత్త హైబ్రిడ్ కారు యొక్క మైలేజ్ విషయానికి వస్తే, ఇది ఒక లీటరుకు గరిష్టంగా 26.5 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది.

బెస్ట్ మైలేజ్ అందించే హైబ్రిడ్ కార్లు.. మైలేజ్ వివరాలు

హోండా సిటీ హైబ్రిడ్ తరువాత 'టయోటా' (Toyota) యొక్క క్యామ్రీ (Camry) ఉంది. టొయోట యొక్క ఈ హైబ్రిడ్ కారు ఇప్పటికే భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతోంది. ఈ సెడాన్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే, ఇది ఒక లీటరుకు గరిష్టంగా 22.8 కిమీ మైలేజ్ అందిస్తుందని ధృవీకరించబడింది.

బెస్ట్ మైలేజ్ అందించే హైబ్రిడ్ కార్లు.. మైలేజ్ వివరాలు

ఎక్కువ మైలేజ్ అందించే కార్ల జాబితాలో 'లెక్సస్' (Lexus) యొక్క 'ఈఎస్' (ES) మోడల్ నాల్గవ స్థానంలో ఉంది. ఇది 2.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్‌తో కలిసి 212 బిహెచ్‌పి పవర్ మరియు 213 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. లెక్సస్ ఈఎస్ అనేది విలాసవంతమైన కారు అయినప్పటికీ మంచి మైలేజ్ అందిస్తుంది. ఇది ఒక లీటరుకు గరిష్టంగా 22.6 కిమీ మైలేజ్ అందిస్తుంది.

బెస్ట్ మైలేజ్ అందించే హైబ్రిడ్ కార్లు.. మైలేజ్ వివరాలు

ఇక టొయోట కంపెనీ యొక్క లగ్జరీ మోడల్ అయిన వెల్‌ఫైర్ (Vellfire) ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. ఈ లగ్జరీ MPV 2.5 లీటర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇంజిన్ 141 బిహెచ్‌పి పవర్ మరియు 198 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేసే రెండు ఎలక్ట్రిక్ మోటార్‌ల ద్వారా శక్తిని పొందుతుంది. మైలేజ్ విషయానికి వస్తే, ఇది ఒక లీటరుకు 16.4 కిమీ మైలేజ్ అందిస్తుంది.

బెస్ట్ మైలేజ్ అందించే హైబ్రిడ్ కార్లు.. మైలేజ్ వివరాలు

టొయోట వెల్‌ఫైర్ తరువాత, లెక్సస్ బ్రాండ్ యొక్క 'లెక్సస్ ఎల్ఎస్' (Lexus LS), లెక్సస్ ఎల్సి (Lexus LC) మరియు లెక్సస్ ఆర్ఎక్స్ (Lexus RX) వంటివి ఉన్నాయి. వీటి మైలేజ్ విషయానికి వస్తే, వరుసగా ఒక లీటరుకు 15.4 కిమీ, 12.3 కిమీ మరియు 12 కిమీ అందిస్తాయి. ఇవన్నీ కూడా బలమైన హైబ్రిడ్ ఇంజిన్ ఆప్సన్ కలిగి ఉంటాయి. కావున మంచి మైలేజ్ అందిస్తాయి.

బెస్ట్ మైలేజ్ అందించే హైబ్రిడ్ కార్లు.. మైలేజ్ వివరాలు

కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లోనే ఎక్కువ మైలేజ్ అందించే హైబ్రిడ్ కార్ల జాబితాలో టొయోట అగ్రగామిగా ఉంది. నిజానికి ఎక్కువమంది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉన్న కార్లను మాత్రమే కాకుండా ఎక్కువ మైలేజ్ అందించే వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.

బెస్ట్ మైలేజ్ అందించే హైబ్రిడ్ కార్లు.. మైలేజ్ వివరాలు

ఎక్కువ మైలేజ్ అందించే వాహనాలను కొనుగోలు చేయడానికి కొన్ని ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇంధన (పెట్రోల్ & డీజిల్) ధరలు ఎప్పుడో సెంచరీ దాటేశాయి. దానికి తోడు ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కువ మైలేజ్ అందించే వాహనాలను కారణం అవుతున్నాయి.

బెస్ట్ మైలేజ్ అందించే హైబ్రిడ్ కార్లు.. మైలేజ్ వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ప్రస్తుతం మనం చెప్పుకున్న ఎక్కువ మైలేజ్ అందించే వాహనాల జాబితాలో మారుతి సుజుకి యొక్క గ్రాండ్ వితారా అగ్రస్థానంలో ఉంది. ఈ హైబ్రిడ్ భారతీయ మార్కెట్లో త్వరలోనే విడుదలకానుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు కొత్త కార్లు మరియు బైకులకు సంబంధించిన ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, July 21, 2022, 15:35 [IST]
English summary
Strong hybrid cars with most mileage in india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+