టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల; ధర కేవలం రూ.8.1 లక్షలే!!

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో విక్రయిస్తున్న టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) లో కంపెనీ నేడు ఓ కొత్త ఆటోమేటిక్ వేరియంట్ ను విడుదల చేసింది. ఈ కొత్త ఆటోమేటిక్ వెర్షన్ ను కంపెనీ "టాటా ఆల్ట్రోజ్ డిసిఏ" (Tata Altroz DCA) పేరుతో ప్రవేశపెట్టింది. దేశీయ విపణిలో కొత్త టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ వెర్షన్ ధరలు రూ.8.09 లక్షల నుండి ప్రారంభమై రూ.9.89 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకూ ఉంటాయి.

టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల; ధర కేవలం రూ.8.1 లక్షలే!!

టాటా ఆల్ట్రోజ్ డిసిఏ లో డిసిఏ అంటే డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ (Dual Clutch Automatic) అని అర్థం. ఇప్పటి వరకూ టాటా ఆల్ట్రోజ్ కారు కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే లభ్యమయ్యేది. కాగా, ఇప్పుడు ఇది ఆటోమేటిక్ వెర్షన్ లో అందుబాటులోకి రావడంతో, ఈ సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్ లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కోరుకునే కస్టమర్ల కల కూడా నెరవేరనుంది. కొత్త Tata Altroz ​​DCA ఆటోమేటిక్ వెర్షన్ ను కంపెనీ XM+, XT, XZ, XZ+ అనే నాలుగు వేరియంట్లతో పాటుగా రెండు Dark Edition లలో కూడా విడుదల చేసింది.

టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల; ధర కేవలం రూ.8.1 లక్షలే!!

టాటా ఆల్ట్రోజ్ డిసిఏ ఆటోమేటిక్ వెర్షన్ లో లభించే వేరియంట్లు మరియు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

Altroz DCA Price
XTA ₹8,59,900
XMA+ ₹8,09,900
XZA ₹9,09,900
XZA (O) ₹9,21,900
XZA+ ₹9,59,900
XTA Dark ₹9,05,900
XZA+ Dark ₹9,89,900
టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల; ధర కేవలం రూ.8.1 లక్షలే!!

టాటా ఆల్ట్రోజ్ డిసిఏ ఆటోమేటిక్ వెర్షన్ కోసం కంపెనీ బుకింగ్ లను కూడా స్వీకరిస్తోంది. ఆసక్తిగల కస్టమర్లు రూ. 21,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి కంపెనీ వెబ్‌సైట్ లో లేదా అధీకృత డీలర్‌షిప్ ‌ని సందర్శించి బుక్ చేసుకోవచ్చు. ఈ నెలాఖరు నాటికి ఆల్ట్రోజ్ డిసిఏ డెలివరీలు కూడా ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. టాటా మోటార్స్ ఈ ఆటోమేటిక్ కారును డౌన్‌టౌన్ రెడ్, ఆర్కేడ్ గ్రే, అవెన్యూ వైట్ మరియు హార్బర్ బ్లూ కలర్ ఆప్షన్‌లతో పాటు కొత్తగా ఒపెరా బ్లూ కలర్ ఆప్షన్‌ లో కూడా తీసుకువచ్చింది.

టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల; ధర కేవలం రూ.8.1 లక్షలే!!

ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ కారులో ఉపయోగించిన గేర్‌బాక్స్ ఒక అధునాతన డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ అని, ఇది ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల కోసం రూపొందించబడిందని కంపెనీ తెలిపింది. కొత్త ఆల్ట్రోజ్ డిసిఏ కోసం కంపెనీ 45 పేటెంట్‌లతో కూడిన వినూత్న సాంకేతికత మరియు ప్లానెటరీ గేర్ సిస్టమ్‌తో రూపొందించిన ప్రపంచంలోనే మొదటి DCT అని టాటా మోటార్స్ తెలిపింది.

టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల; ధర కేవలం రూ.8.1 లక్షలే!!

టాటా ఆల్ట్రోజ్ యొక్క DCA వెర్షన్‌లో వెట్ క్లచ్ విత్ యాక్టివ్ కూలింగ్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, షిఫ్ట్ బై వైర్ టెక్నాలజీ, సెల్ఫ్-హీలింగ్ మెకానిజం మరియు ఆటో పార్క్ లాక్ వంటి అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌లు ఉన్నాయి. ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కంపెనీ యొక్క పాపులర్ 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 109 బిహెచ్‌పి పవర్ ను మరియు 140 న్యూటన్ మీటర్ల టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల; ధర కేవలం రూ.8.1 లక్షలే!!

కొత్త Tata Altroz DCA కారులో అందించే ఫీచర్ల విషయానికి వస్తే, కంపెనీ ఇందులో ప్రీమియం లెథెరెట్ సీట్లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, హర్మాన్ బ్రాండ్‌కి చెందిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్, 7 ఇంచ్ టిఎఫ్‌టి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ ప్యాసింజర్ల కోసం ఏసి వెంట్స్ మరియు ఐఆర్ఏ కనెక్టెడ్ ఫీచర్లతో స్టాండర్డ్ వేరియంట్లలో లభించే ఇతర అన్ని ఫీచర్లను అందిస్తోంది.

టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల; ధర కేవలం రూ.8.1 లక్షలే!!

సరికొత్త డిసిఏ (DCA) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ గురించి క్లుప్తంగా..

సాధారణంగా, ఇతర కార్లలో ఉపయోగించే సాంప్రదాయ డిసిటి (డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్, DCT) ఆటోమేటిక్ గేర్‌‌బాక్స్‌లు దాదాపు 20 గేర్‌లను కలిగి ఉంటాయని, అయితే Altroz DCA లో కేవలం 13 గేర్లు మాత్రమే ఉంటాయని కంపెనీ తెలిపింది. గేర్‌బాక్స్ లో తక్కువ కదిలే భాగాల కారణంగా, గేర్ షిఫ్ట్ నాణ్యత మెరుగ్గా ఉంటుందని మరియు ఈ గేర్‌బాక్స్ యూనిట్ మరింత విశ్వసనీయంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. కొత్త Tata Altroz DCA గేర్‌బాక్స్ యొక్క జీవితకాలాన్ని పెంచేందుకు ఇది సెల్ఫ్-డస్ట్ రిమూవల్ టెక్నాలజీతో వస్తుందని టాటా మోటార్స్ తెలిపింది.

టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల; ధర కేవలం రూ.8.1 లక్షలే!!

అంతేకాకుండా, కొత్త ఆల్ట్రోజ్ డిసిఏ ఆటో-పార్క్ లాక్ ఫీచర్‌తో కూడా వస్తుంది. ఈ ఫీచర్ యొక్క ప్రధాన ఉపయోగం ఏంటంటే, ఒకవేళ కారు స్విచ్ ఆన్ చేయబడి ఉండి, బ్రేక్ మరియు యాక్సిలరేటర్ పెడల్స్ ఉపయోగించబడనప్పుడు, అలాగే డ్రైవర్ వైపు సీట్‌బెల్ట్ తొలగించబడి ఉన్నప్పుడు మరియు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేయబడి ఉన్నప్పుడు కారు లోపల హ్యాండ్ బ్రేక్ ఆన్ చేయకపోయి ఉన్న సరే ఇది కారు కదలికను నిరోధిస్తుంది.

టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల; ధర కేవలం రూ.8.1 లక్షలే!!

కొత్త Tata Altroz DCA ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది, ఇది డ్రైవర్ యొక్క ప్రవర్తన నుండి నేర్చుకుంటుంది మరియు సున్నితమైన గేర్ షిఫ్ట్‌ల కోసం డ్రైవింగ్ అనుభవాన్ని కస్టమైజ్ చేస్తుంది. టాటా ఆల్ట్రోజ్ డిసిఏలో గేర్ షిఫ్ట్ సమయాలు 250 మిల్లీసెకన్ల కంటే తక్కువ సమయం తీసుకుంటాయని టాటా మోటార్స్ తెలిపింది. టాటా ఆల్ట్రోజ్ ఈ విభాగంలో లభిస్తున్న 5-స్టార్ సేఫ్టీ రేటెడ్ (గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ ద్వారా) ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. కంపెనీ దీని తొలిసారిగా జనవరి 2020 లో మార్కెట్లో విడుదల చేసింది.

టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల; ధర కేవలం రూ.8.1 లక్షలే!!

టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ ఇంజన్ తో పాటుగా డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో కూడా లభిస్తోంది. టాటా ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్లలో 1.5 లీటర్ రెవోటార్క్ డీజిల్ ఇంజన్ ను ఉపయోగించారు. సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ గ్లేర్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, క్రూయిజ్ కంట్రోల్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ అండ్ కెమెరా మరియు హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్‌ మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Article Published On: Monday, March 21, 2022, 12:39 [IST]
English summary
Tata altroz dca dual clutch automatic launched in india price starts at rs 8 09 lakhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+