మార్చి 21న ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల.. బుకింగ్స్ ప్రారంభం!

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో టాటా మోటార్స్ (Tata Motors) విక్రయిస్తున్న టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) లో కంపెనీ ఓ కొత్త వేరియంట్ ను ఈ నెల 21వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు టాటా మోటార్స్ తమ కొత్త ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ వెర్షన్ టీజర్ ను కూడా విడుదల చేసింది. ఈ కొత్త ఆటోమేటిక్ వెర్షన్ ను కంపెనీ "టాటా ఆల్ట్రోజ్ డిసిఏ" (Tata Altroz DCA) పేరుతో పిలువనుంది. ఇందులో డిసిఏ అంటే డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ (Dual Clutch Automatic) అని అర్థం.

మార్చి 21న ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల.. బుకింగ్స్ ప్రారంభం!

ప్రస్తుతం, టాటా ఆల్ట్రోజ్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. కాగా, కంపెనీ ఇప్పుడు ఇందులో డిసిఏ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను ప్రవేశపెట్టనుంది. కొత్త టాటా ఆల్ట్రోజ్ డిసిఏ మార్చి 21, 2022న భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, కంపెనీ ఇప్పటికే ఈ ఆటోమేటిక్ వెర్షన్ కోసం బుకింగ్ లను కూడా ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు రూ. 21,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి కంపెనీ వెబ్‌సైట్ లో లేదా అధీకృత డీలర్‌షిప్ ‌ని సందర్శించి బుక్ చేసుకోవచ్చు.

మార్చి 21న ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల.. బుకింగ్స్ ప్రారంభం!

కొత్త Tata Altroz ​​DCA ఆటోమేటిక్ వెర్షన్ ను కంపెనీ XT, XZ, XZ+ మరియు Dark Edition వేరియంట్‌లలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నెలాఖరు నుండే ఆల్ట్రోజ్ డిసిఏ డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. టాటా మోటార్స్ ఈ ఆటోమేటిక్ కారును డౌన్‌టౌన్ రెడ్, ఆర్కేడ్ గ్రే, అవెన్యూ వైట్ మరియు హార్బర్ బ్లూ కలర్ ఆప్షన్‌లతో పాటు కొత్తగా ఒపెరా బ్లూ కలర్ ఆప్షన్‌ లో కూడా తీసుకురానుంది. కొత్త కలర్ ఆప్షన్ తో పాటుగా కొత్త ఆల్ట్రోజ్ డిసిఏ కారులోని టాప్-ఎండ్ వేరియంట్లలో కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా లభించవచ్చని సమాచారం.

మార్చి 21న ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల.. బుకింగ్స్ ప్రారంభం!

ప్రస్తుతం, టాటా ఆల్ట్రోజ్ కారులో అందిస్తున్న 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్థానంలో సన్నటి బెజెల్ తో కూడిన అప్‌గ్రేడెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ను ఇందులో ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఈ మార్పుల మినహా కొత్త టాటా ఆల్ట్రోజ్ డిసిఏ ఆటోమేటిక్ వేరియంట్లలో వేరే ఇతర మార్పులు ఉండకపోవచ్చు. ఇంజన్ పరంగా మరియు మెకానికల్స్ పరంగా కూడా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ఈ కొత్త వేరియంట్లను కూడా అదే పాత 1.2 లీటర్ రెవోట్రాన్ ఇంజన్‌తో తీసుకురానున్నారు.

మార్చి 21న ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల.. బుకింగ్స్ ప్రారంభం!

మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్లలోని ఇదే 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 109 బిహెచ్‌పి పవర్ ను మరియు 140 న్యూటన్ మీటర్ల టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణంగా ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో లభిస్తుంది. కాకపోతే, ఆటోమేటిక్ వేరియంట్లలో ఇదే ఇంజన్ 7 స్పీడ్ డ్యుయెల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. మరి కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను జోడించడం వలన ఇంజన్ పవర్, టార్క్ గణాంకాలు ఏమైనా మారుతాయేమో చూడాలి.

మార్చి 21న ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల.. బుకింగ్స్ ప్రారంభం!

టాటా మోటార్స్ తమ ఆల్ట్రోజ్ కారును తొతలిసారిగా జనవరి 2020 లో మార్కెట్లో విడుదల చేసింది మరియు ఇప్పటి వరకు కంపెనీ 1.25 లక్షల యూనిట్ల ఆల్ట్రోజ్ కార్లను మార్కెట్లో విక్రయించింది. ఇప్పటి వరకూ టాటా ఆల్ట్రోజ్ కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభించేది. అయితే, దేశంలో ఆటోమేటిక్ వేరియంట్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఇప్పుడు కొత్త ఆటోమేటిక్ ఆల్ట్రోజ్ కారును తీసుకురాబోతోంది. టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ ఇంజన్ తో పాటుగా డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో కూడా లభిస్తోంది.

మార్చి 21న ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల.. బుకింగ్స్ ప్రారంభం!

టాటా ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్లలో 1.5 లీటర్ రెవోటార్క్ డీజిల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 90 బిహెచ్‌పి పవర్ ను మరియు 1250 ఆర్‌పిఎమ్ నుండి 3000 ఆర్‌పిఎమ్ మధ్యలో 200 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. టాటా ఆల్ట్రోజ్ కారును టాటా మోటార్స్ యొక్క కొత్త 'ఇంపాక్ట్ 2.0' డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా రూపొందించారు. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా మోటార్స్ యొక్క కొత్త 'ఆల్ఫా' ఆర్కిటెక్చర్‌ని ఉపయోగించుకొని తయారైన మొదటి ఉత్పత్తి.

మార్చి 21న ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల.. బుకింగ్స్ ప్రారంభం!

ఆల్ట్రోజ్ డిజైన్ ఎలిమెంట్స్‌ను గమనిస్తే, ఈ కారులో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌కు దిగువన విడిగా అమర్చబడి ఉంటాయి. ఫ్రంట్ బంపర్ మధ్యలో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ ఇవ్వబడింది. గ్రిల్ మరియు ఎయిర్ ఇన్‌టేక్ రెండూ కూడా బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడి ఉంటాయి. టాటా ఆల్ట్రోజ్ సైడ్స్ మరియు వెనుక వైపున అప్‌స్వెప్ట్ విండో లైన్‌లను పొందుతుంది. ఇందులో 16 ఇంచ్ లేజర్ కట్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌ లభిస్తాయి. వెనుక భాగంలో క్రోమ్ ఎలిమెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి, దానికి బదులుగా బూట్‌ డోర్ పై బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి.

మార్చి 21న ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల.. బుకింగ్స్ ప్రారంభం!

టాటా మోటార్స్ ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారులో అనేక ఫీచర్లు మరియు పరికరాలను అందిస్తోంది. ఇందులో మూడ్ లైటింగ్, మెటల్-ఫినిష్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు టెయిల్‌ లైట్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 90 డిగ్రీల వరకు తెరుచుకునే తలుపులు, ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్, ఫాబ్రిక్ సీట్లు, కూల్డ్ గ్లోవ్ బాక్స్ మొదలైనవి ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో Apple CarPlay మరియు Android Auto ను సపోర్ట్ చేసే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కూడా ఉంటుంది.

మార్చి 21న ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) విడుదల.. బుకింగ్స్ ప్రారంభం!

ఇక సేఫ్టీ విషయానికి వస్తే, టాటా ఆల్ట్రోజ్ ప్రస్తుతం భారతదేశంలో లభిస్తున్న అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉంది. ఇది గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది. ఈ కారులో రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ గ్లేర్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, క్రూయిజ్ కంట్రోల్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ అండ్ కెమెరా మరియు హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్‌ మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Article Published On: Tuesday, March 15, 2022, 18:51 [IST]
English summary
Tata altroz dca dual clutch automatic version to be launched in india on 21st march bookings open
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+