టాటా మోటార్స్ నుంచి Altroz డార్క్ ఎడిషన్ వచ్చేసింది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన 'టాటా మోటార్స్' (Tata Motors) ఎట్టకేలకు 'ఆల్ట్రోజ్ యొక్క డార్క్ ఎడిషన్' విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్ XT ట్రిమ్‌లో మాత్రమే అందుబటులో ఉంటుంది. ఈ కొత్త ఎడిషన్ యొక్క ప్రారంభ ధర రూ. 7.96 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). టాటా ఆల్ట్రోజ్ ఎక్స్‌టి డార్క్ ఎడిషన్‌ను విడుదల చేయడం భారతదేశంలో ప్రీమియం టాటా హ్యాచ్‌బ్యాక్ ప్రారంభించిన 2 వ యానివెర్షరీని సూచిస్తుంది.

టాటా మోటార్స్ నుంచి Altroz డార్క్ ఎడిషన్ వచ్చేసింది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త 'టాటా ఆల్ట్రోజ్ XT డార్క్ ఎడిషన్' దాని స్టాండర్డ్ వేరియంట్ కంటే కూడా ఎక్కువ కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లను పొందుతుంది. ఇందులో కాస్మో డార్క్ పెయింట్ జాబ్ మరియు ఎక్ట్సీరియర్‌లో డార్క్ బ్యాడ్జింగ్ వంటివి ఉన్నాయి. బయటవైపు కూడా డార్క్-టిన్టెడ్ హైపర్‌స్టైల్ వీల్స్ పొందుతుంది. టాటా ఆల్ట్రోజ్ XT డార్క్ పెట్రోల్ ధర దాని స్టాండర్డ్ వేరియంట్ కంటే కూడా దాదాపు రూ. 46,000 ఎక్కువ.

టాటా మోటార్స్ నుంచి Altroz డార్క్ ఎడిషన్ వచ్చేసింది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

Altroz XT డార్క్ పెట్రోల్ వెర్షన్ ఆల్-బ్లాక్ ఇంటీరియర్ థీమ్, లెథెరెట్ సీట్లు, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఫ్రంట్ సీట్‌బెల్ట్‌లు మరియు రియర్ హెడ్‌రెస్ట్‌లు మరియు లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ మరియు గేర్ లివర్ వంటి వాటిని పొందుతుంది.

టాటా మోటార్స్ నుంచి Altroz డార్క్ ఎడిషన్ వచ్చేసింది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

మార్కెట్లో విడుదలైన కొత్త Altroz XT డార్క్ ఎడిషన్ 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ యూనిట్ మరియు 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ పొందుతుంది. ఇందులోని 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

టాటా మోటార్స్ నుంచి Altroz డార్క్ ఎడిషన్ వచ్చేసింది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

అదే విధంగా 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ విషయానికి వస్తే, ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 108 బిహెచ్‌పి పవర్ మరియు 1,500 ఆర్‌పిఎమ్ వద్ద 140 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లు కూడా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కంపెనీ ఇంకా Altroz XT డార్క్ టర్బో-పెట్రోల్ ధరలు ఇంకా ప్రకటించబడలేదు, అయితే దాని స్టాండర్డ్ Altroz XT iTurbo వేరియంట్ కంటే కూడా రూ. 40,000 నుంచి రూ. 50,000 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కావున ఇది కొంత ఖరీదైనదిగా వుండే అవకాశం ఉంటుంది.

టాటా మోటార్స్ నుంచి Altroz డార్క్ ఎడిషన్ వచ్చేసింది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ ఎక్స్‌జెడ్ ప్లస్ డార్క్ ఎడిషన్ డీజిల్ వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. డీజిల్ ఆల్ట్రోజ్ యొక్క XZ ప్లస్ డీజిల్ డార్క్ ఎడిషన్ వేరియంట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు బ్రేక్ స్వే కంట్రోల్ వంటి సేఫ్టీ గబ్బిన్‌లతో సహా స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే మరికొన్ని స్టాండర్డ్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

టాటా మోటార్స్ నుంచి Altroz డార్క్ ఎడిషన్ వచ్చేసింది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

టాటా ఆల్ట్రోజ్ XZ ప్లస్ డార్క్ ఎడిషన్ 1.5-లీటర్ టర్బోడీజిల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద వద్ద 89 బిహెచ్‌పి పవర్ మరియు కేవలం 1,250 ఆర్‌పిఎమ్ వద్ద వద్ద 200 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

టాటా మోటార్స్ నుంచి Altroz డార్క్ ఎడిషన్ వచ్చేసింది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

Altroz ​​యొక్క XZ ప్లస్ డార్క్ ఎడిషన్ డీజిల్ వేరియంట్ ధరను కూడా టాటా మోటార్స్ ఇప్పటి వరకు వెల్లడించలేదు. అయితే స్టాండర్డ్ 'డార్క్ ఎడిషన్' మోడల్ కంటే దాదాపు రూ. 40 నుండి రూ. 50 వేల వరకు ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. Altroz ​​XZ Plus డీజిల్ ధర ప్రస్తుతం రూ. 9.70 లక్షలు (ఎక్స్-షోరూమ్).

టాటా మోటార్స్ నుంచి Altroz డార్క్ ఎడిషన్ వచ్చేసింది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

Tata Altroz ​​XT డార్క్ ఎడిషన్ ఆల్ట్రోజ్ అమ్మకానికి జరుగుతున్న రెండవ సంవత్సరాన్ని పురస్కరించుకుని లాంచ్ చేయబడింది. టాటా ఆల్ట్రోజ్ యొక్క మిడ్-స్పెక్ XT వేరియంట్ యొక్క డార్క్ ఎడిషన్ వెర్షన్ ఆకర్షణీయమైన ధర వద్ద కొన్ని కాస్మెటిక్ మార్పులను తీసుకువస్తుంది. కావున ఇది చాలా అద్భుతంగా ఉంటుంది, కావున మార్కెట్లో మరిన్ని మంచి అమ్మకాలను పొందుతుంది అని భావిస్తున్నాము.

టాటా మోటార్స్ నుంచి Altroz డార్క్ ఎడిషన్ వచ్చేసింది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'టాటా ఆల్ట్రోజ్ డార్క్ ఎడిషన్' మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ i20, హోండా జాజ్, టయోటా గ్లాంజా మరియు ఫోక్స్‌వ్యాగన్ పోలో వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, February 11, 2022, 13:13 [IST]
English summary
Tata altroz xt dark edition launched price features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+