Kaziranga Editions లో రానున్న టాటా కార్స్ ఇవే.. ఇక్కడ చూడండి

ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) కొత్త కజిరంగా ఎడిషన్ తీసుకురానుంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పటికే వెలువడ్డాయి. 2022 IPL లో టాటా పంచ్ యొక్క కజిరంగా ఎడిషన్ ప్రవేశపెట్టింది. అయితే కంపెనీ ఇదే నేపథ్యంలో ఇప్పుడు నెక్సాన్, హారియార్ మరియు సఫారీ వంటి వాటిని కూడా కజిరంగా ఎడిషన్ తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.

Kaziranga Editions లో రానున్న టాటా కార్స్ ఇవే.. ఇక్కడ చూడండి

మొదట కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2022 IPL లో ప్రవేశపెట్టిన టాటా పంచ్ కజిరంగా ఎడిషన్ వేలంలో విక్రయించనున్నట్లు తెలిసింది. అయితే ఇప్పుడు కంపెనీ తీసుకురానున్న నెక్సాన్, హారియార్ మరియు సఫారీ కజిరంగా ఎడిషన్స్ వేలంలో విక్రయిస్తుందా.. లేదా సాధారణ కస్టమర్లకు అందుబాటులో ఉంచుతుందా అనే సమాచారం అందుబాటులో లేదు.

Kaziranga Editions లో రానున్న టాటా కార్స్ ఇవే.. ఇక్కడ చూడండి

అయితే వీటికి సంబంధించిన కొత్త టీజర్ ప్రకారం, ఈ కొత్త మోడల్స్ మెటోర్ బ్రాంజ్ కలర్‌లో ఉంటాయి. అయితే ఈ మూడు మోడల్స్ అన్నీ కూడా రినో లోగోతో వస్తాయి. ఇవి ఫెండర్లు, రియర్ విండ్‌స్క్రీన్ మరియు గ్లోవ్‌బాక్స్‌పై ఇవ్వబడతాయి. అంతే కాకూండా కజిరంగా స్కఫ్ ప్లేట్స్ కూడా ఇవ్వబడతాయి.

Kaziranga Editions లో రానున్న టాటా కార్స్ ఇవే.. ఇక్కడ చూడండి

ఇక వీటి యొక్క ఇంటీరియర్‌లోని గ్లోవ్ బాక్స్‌పై రినోని చూడవచ్చు. ఇందులో ఇది తప్పా ఇతర మార్పులు కనిపించవు. ఈ స్పెషల్ ఎడిషన్‌లలో స్టీరింగ్ వీల్‌పై లెదర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌లైట్ మరియు వైపర్లు, క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

Kaziranga Editions లో రానున్న టాటా కార్స్ ఇవే.. ఇక్కడ చూడండి

అయితే రానున్న ఈ కొత్త మోడల్స్ యొక్క హారియర్ మినహా, మిగిలిన వాటిలో IRA కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ మోడల్ ఎంతవరకు ఆదరణ పొందుతాయి ఏ విషయాలు తెలియాలి.

Kaziranga Editions లో రానున్న టాటా కార్స్ ఇవే.. ఇక్కడ చూడండి

ఇదిలా ఉండగా టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ మనం ఇది వరకు చెప్పుకున్నట్లుగా ఇటీవల 2022 IPL కజిరంగా ఎడిషన్ లో ప్రవేశపెట్టింది. అయితే టాటా పంచ్ యోక్స్ స్టాండర్డ్ ఎడిషన్ ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్‌ వేరియంట్స్. ఈ నాలు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి.

Kaziranga Editions లో రానున్న టాటా కార్స్ ఇవే.. ఇక్కడ చూడండి

దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త Tata Punch మొత్తం 7 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఓర్క్స్ వైట్, అటామిక్ ఆరెంజ్ ,డేటోనా గ్రే, మెటోర్ బ్రాంజ్, కాలిప్సో రెడ్, ట్రాపికల్ మిస్ట్ మరియు టోర్నాడో బ్లూ కలర్స్.

Kaziranga Editions లో రానున్న టాటా కార్స్ ఇవే.. ఇక్కడ చూడండి

Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. Tata Punch యొక్క సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.

Kaziranga Editions లో రానున్న టాటా కార్స్ ఇవే.. ఇక్కడ చూడండి

Tata Punch యొక్క ఇంటీరియర్ డ్యూయల్-టోన్ థీమ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉపయోగించబడింది. ఇదే డ్యూయెల్ టోన్ కలర్ దాని డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఇది కాకుండా, దానిలో కనిపించే AC వెంట్‌లపై బ్లూ హైలైట్‌లు మరియు లోపలి డోర్ హ్యాండిల్స్‌లో వైట్ ఇన్సర్ట్‌లు ఉపయోగించబడ్డాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

Tata Punch మైక్రో SUV కంపెనీ కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ (ALFA) ఆర్కిటెక్చర్‌పై ఆధారపడింది. ఈ SUV పరిమాణం పరంగా కూడా అద్బుతంగా ఉంటుంది. ఈ కాంపాక్ట్ SUV పొడవు 3,827 మిమీ, 1,742 మిమీ వెడల్పు మరియు 1,615 మిమీ ఎత్తు, 2,445 మిమీ వీల్‌బేస్ మరియు 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది.

Kaziranga Editions లో రానున్న టాటా కార్స్ ఇవే.. ఇక్కడ చూడండి

Tata Punch 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, February 18, 2022, 13:26 [IST]
English summary
Tata cars kaziranga edition details revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+