పెట్రోల్ కార్లు వద్దు.. ఎలక్ట్రిక్ కార్లే ముద్దు.. 439 శాతం పెరిగిన టాటా ఎలక్ట్రిక్ కార్ సేల్స్!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం ప్రారంభమైంది. గతేడాది దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం, మార్కెట్లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న టాటా మోటార్స్ (Tata Motors), గడచిన డిసెంబర్ 2021 నెల అమ్మకాలలో ఏకంగా 439 శాతం వృద్ధిని కనబరిచింది. టాటా మోటార్స్ డిసెంబర్ 2020 నెలలో కేవలం 418 ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయిస్తే, గత డిసెంబర్ 2021 నెలలో ఏకంగా 2,255 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది.

పెట్రోల్ కార్లు వద్దు.. ఎలక్ట్రిక్ కార్లే ముద్దు.. 439 శాతం పెరిగిన టాటా ఎలక్ట్రిక్ కార్ సేల్స్!

ఇందుకు ప్రధాన కారణం, టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన టాటా టిగోర్ ఈవీ మరియు అప్‌డేటెడ్ టాటా నెక్సాన్ ఈవీ. మరోవైపు దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు కూడా టాటా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ ను పెంచేలా చేశాయి. గడచి డిసెంబర్ నెలలో టాటా వాహనాల విక్రయాలు తొలిసారిగా 2000 యూనిట్లను దాటగా, ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఇప్పటి వరకూ 10,000 యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. టాటా మోటార్స్ అందిస్తున్న Nexon EV మరియు Tigor EV లకు మార్కెట్ నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

పెట్రోల్ కార్లు వద్దు.. ఎలక్ట్రిక్ కార్లే ముద్దు.. 439 శాతం పెరిగిన టాటా ఎలక్ట్రిక్ కార్ సేల్స్!

టాటా మోటార్స్ కొంతకాలం క్రితమే తమ టిగోర్ ఈవీ మరింత అదనపు రేంజ్ మరియు లేటెస్ట్ జిప్‌ట్రాన్ టెక్నాలజీతో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం, భారతదేశంలో లభిస్తున్న అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారుగా టాటా టిగోర్ అందుబాటులో ఉంది. ఫలితంగా, ఇది మెరుగైన విక్రయాలకు దారితీసింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం టాటా మోటార్స్ విక్రయిస్తున్న నెక్సాన్ ఈవీలో కూడా మరింత ఎక్కువ రేంజ్ తో కూడిన ఓ లాంగ్ రేంజ్ వేరియంట్ ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

పెట్రోల్ కార్లు వద్దు.. ఎలక్ట్రిక్ కార్లే ముద్దు.. 439 శాతం పెరిగిన టాటా ఎలక్ట్రిక్ కార్ సేల్స్!

ప్రస్తుతం, టాటా నెక్సాన్ ఈవీ అమ్మకాల పరంగా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా మొదటి స్థానంలో ఉంది. ఎలక్ట్రిక్ కార్ల విషయంలో కస్టమర్లు ప్రధానంగా చూసేది, వాటి బ్యాటరీ యొక్క రేంజ్. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ తమ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ ఈవీలో ఓ లాంగ్ రేంజ్ వేరియంట్ ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. మార్కెట్ సమాచారం ప్రకారం, ఈ అప్‌డేటెడ్ వెర్షన్ 2022 మధ్యలో మార్కెట్లోకి విడుదల చేయబడుతుందని తెలుస్తోంది.

పెట్రోల్ కార్లు వద్దు.. ఎలక్ట్రిక్ కార్లే ముద్దు.. 439 శాతం పెరిగిన టాటా ఎలక్ట్రిక్ కార్ సేల్స్!

కొత్తగా రాబోయే టాటా నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కారులో పెద్ద 40kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుందని సమాచారం. ప్రస్తుత నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో ఈ విభాగంలో దాని పోటీదారులతో పోలిస్తే ఇది చిన్న 30.2kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. దీని బ్యాటరీ మరియు రేంజ్ తక్కువగా ఉన్నప్పటికీ, దీని సరసమైన ధర కారణంగా కొనుగోలుదారులు ఈ ఎలక్ట్రిక్ కారు పట్ల ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఇందులో అధిక రేంజ్ కోరుకునే కస్టమర్ల కోసం కంపెనీ ఓ ప్రీమియం వేరియంట్ ను ఈ ఏడాది విడుదల చేసే అవకాశం ఉంది.

పెట్రోల్ కార్లు వద్దు.. ఎలక్ట్రిక్ కార్లే ముద్దు.. 439 శాతం పెరిగిన టాటా ఎలక్ట్రిక్ కార్ సేల్స్!

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాటా నెక్సాన్ మోడల్ పూర్తి చార్జ్ పై 312 కిమీల రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే, టాటా నెక్సాన్ ఈవీ యజమానుల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్, ఈవీలలో పెరుగుతున్న అవుట్‌డోర్ ప్రయాణాలను చూపిస్తుందని తేలింది. ఎలక్ట్రిక్ కార్లలో దూర ప్రయాణాలు చేయాలంటే లాంగ్ రేంజ్ బ్యాటరీలు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో, పూర్తిగా చార్జ్ పై గరిష్టంగా దాదాపు 400 కిమీ రేంజ్ ను ఆఫర్ చేసే సామర్థ్యంతో టాటా తమ కొత్త నెక్సాన్ ఈవీని డెవలప్ చేస్తోంది.

పెట్రోల్ కార్లు వద్దు.. ఎలక్ట్రిక్ కార్లే ముద్దు.. 439 శాతం పెరిగిన టాటా ఎలక్ట్రిక్ కార్ సేల్స్!

కొత్త 2022 టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో అమర్చబోయే పెద్ద 40kWh బ్యాటరీ ప్యాక్‌ ప్రస్తుతం ఉపయోగిస్తున్న 30.2kWh బ్యాటరీ ప్యాక్ కంటే 30 శాతం ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఫలితంగా, దాని పరిమాణం కూడా పెద్దదిగా ఉంటుంది. మరి ఇంత పెద్ద బ్యాటరీ ప్యాక్ ను ఈ కారులో అమర్చాలంటే, టాటా ఇంజనీర్లు దాని ఫ్లోర్ పాన్‌లో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. పెరిగిన పెద్ద బ్యాటరీ ప్యాక్ వలన ఈ కారులో బూట్ స్పేస్‌ను కూడా స్వల్పంగా తగ్గే అవకాశం ఉంటుంది.

పెట్రోల్ కార్లు వద్దు.. ఎలక్ట్రిక్ కార్లే ముద్దు.. 439 శాతం పెరిగిన టాటా ఎలక్ట్రిక్ కార్ సేల్స్!

అంతేకాకుండా, పెద్ద బ్యాటరీని ఉపయోగించిన కారణంగా కొత్త అప్‌డేటెడ్ Tata Nexon EV బరువు కూడా దాదాపు 100 కిలోల వరకు పెరగవచ్చు. అప్‌డేట్ చేయబడిన టాటా నెక్సాన్ ఈవీ లోకల్ టెస్ట్ సైకిల్ లో ఒకే ఛార్జ్‌పై సుమారు 400 కిమీ కంటే ఎక్కువ రేంజ్ ను కలిగి ఉంటుందని, అయితే వాస్తవ ప్రపంచ పరిధి అది దాదాపు 300-320 కిమీ రేంజ్ ను ఆఫర్ చేస్తుందని అంచనా వేయబడింది. కొత్త టాటా నెక్సాన్ ఈవీ కూడా స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీలని సపోర్ట్ చేయనుంది.

పెట్రోల్ కార్లు వద్దు.. ఎలక్ట్రిక్ కార్లే ముద్దు.. 439 శాతం పెరిగిన టాటా ఎలక్ట్రిక్ కార్ సేల్స్!

ప్రస్తుత మోడల్ విషయానికి వస్తే, ఇందులోని బ్యాటరీ ప్యాక్ ను హోమ్ ఛార్జర్ ద్వారా పూర్తిగా ఛార్జ్ చేయటానికి సుమారు 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, కేవలం 60 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. కొత్తగా అప్‌డేట్ చేయబడిన Tata Nexon EV మార్కెట్లో MG ZS EV మరియు Hyundai Kona EV లతో పోటీ పడుతుంది.

Most Read Articles

English summary
Tata electric car sales up by 439 percent in december 2021 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X