భారతదేశంలో మొట్టమొదటి CNG ట్రక్కులు విడుదల చేసిన టాటా మోటార్స్: వివరాలు

భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) దేశీయ మార్కెట్లో ఇప్పటికే అనేక కమర్షియల్ వాహనాలను విడుదల చేసి ఆ విభాగంలో తిరుగులేని పురోగతిని పొందింది. అయితే కంపెనీ ఈ రోజు భారతదేశంలోనే మొట్టమొదటి CNG పవర్ తో కూడిన మీడియం & హెవీ కమర్షియల్ వెహికల్స్ విడుదల చేసింది.

Recommended Video

భారతీయ మార్కెట్లో Tata Nexon కొత్త వేరియంట్ లాంచ్ | వివరాలు

ఇంతకీ కంపెనీ విడుదల చేసిన ఈ లేటెస్ట్ ట్రక్కుల ప్రత్యేకత ఏమిటి, ఇందులోని అప్డేటెడ్ ఫీచర్స్ ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనల్లో తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో భారీ CNG ట్రక్కులు విడుదల: టాటా మోటార్స్

టాటా మోటార్స్ విడుదల చేసిన ప్రైమా, సిగ్మా మరియు అల్ట్రా కమర్షియల్ ట్రక్స్ ఇప్పుడు ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. అంతే కాకుండా కంపెనీ అధునాతన ఇంటర్మీడియట్ & లైట్ కమర్షియల్ వెహికల్ టిప్పర్లు & ట్రక్కుల యొక్క కొత్త సిరీస్‌ను కూడా పరిచయం చేసింది.

భారతీయ మార్కెట్లో భారీ CNG ట్రక్కులు విడుదల: టాటా మోటార్స్

టాటా మోటార్స్ భారతదేశంలోనే మొట్టమొదటి CNG ఆధారిత మినీ మరియు హెవీ కమర్షియల్ వెహికల్స్ ని 28 టన్నులు మరియు 19 టన్నులు నోడ్స్ లో విడుదల చేసింది. కంపెనీ యొక్క సరికొత్త సిగ్మా CNG ట్రక్కులు వినియోగానికి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తక్కువగానే అవుతాయి. అంతే కాకూండా ఇవన్నీ బహుళ వినియోగాలకు ఉపయోగపడతాయి, అదే సమయంలో ఎక్కువ కాలం మన్నికకు కూడా వస్తాయి. కావున టాటా మోటార్స్ యొక్క కొత్త ట్రక్కులు తప్పకుండా ఆధునిక యుగంలో చాలా అనుకూలంగా ఉంటాయి.

భారతీయ మార్కెట్లో భారీ CNG ట్రక్కులు విడుదల: టాటా మోటార్స్

ఈ CNG మోడల్‌ ట్రక్కులు వివిధ రకాల వీల్‌బేస్ మరియు లోడ్ డెక్ పొడవు కలిగి ఉంటాయి. అంతే కాకూండా క్యాబిన్ కస్టమైజేషన్ కోసం కౌల్ ఆప్సన్ కూడా అందించబడుతుంది. ఈ మోడల్స్ 5.7 లీటర్ SGI (సెక్యూటిల్ గ్యాస్ ఇంజక్షన్) ఇంజిన్ పొందుతాయి. కావున 180 బిహెచ్‌పి పవర్ మరియు 650 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. ఇది 1000 కిమీ పరిధిని అందిస్తుంది.

భారతీయ మార్కెట్లో భారీ CNG ట్రక్కులు విడుదల: టాటా మోటార్స్

కొత్త టాటా ప్రైమా ట్రక్ అధునాతన డ్రైవర్ యాక్టివ్ మరియు పాసివ్ సేఫ్టీ ఫీచర్స్ అయిన కొలిషన్ మిటిగేషన్ సిస్టమ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా పొందుతుంది. అంతే కాకుండా మౌంటెడ్ కంట్రోల్స్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ పొందుతాయి. ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ మరియు కొత్త ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వాటి ఆధునిక ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

భారతీయ మార్కెట్లో భారీ CNG ట్రక్కులు విడుదల: టాటా మోటార్స్

ఇక టాటా మోటార్స్ యొక్క ఇంటర్మీడియట్ & లైట్ కమర్షియల్ వెహికల్స్ విషయానికి వస్తే, ఇందులో మొత్తం 7 వాహనాలు విడుదలయ్యాయి. అవి LPK 610, LPT 709g XD, SK 710, అల్ట్రా T.12g, అల్ట్రా K.14, LPT 1512g మరియు అల్ట్రా T.16 Cx వాహనాలు.

భారతీయ మార్కెట్లో భారీ CNG ట్రక్కులు విడుదల: టాటా మోటార్స్

ఇందులో LPK 610 వాహనాలు అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి సమర్థవంతమైన బ్రేకింగ్ సిస్టం పొందుతాయి. అదే సమయంలో LPT 709g XD వాహనాలు 5 స్కోయర్ ఫీట్ తో వస్తాయి. ఇవి దాదాపు 10 శాతం అధిక ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి. కావున వాహన వినియోగదారులు ఉపయోగించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటాయి.

భారతీయ మార్కెట్లో భారీ CNG ట్రక్కులు విడుదల: టాటా మోటార్స్

SK 710 టిప్పర్ అనేది అత్యంత విశ్వసనీయమైన SFC ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా రూపొందిచబడి ఉంటుంది. కావున ఇది కమర్షియల్ విభాగంలో వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అల్ట్రా T.12g ట్రక్కు 3.8-లీటర్ SGI టర్బోచార్జ్డ్ ఇంజన్‌తో వస్తుంది. అల్ట్రా K.14 ట్రక్కు ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్‌తో పాటు అత్యధిక గ్రేడ్-ఎబిలిటీ పొంది ఈ క్లాస్ లో మంచి సౌకర్యవంతమైన ట్రక్కుగా నిలుస్తుంది.

భారతీయ మార్కెట్లో భారీ CNG ట్రక్కులు విడుదల: టాటా మోటార్స్

LPT 1512g అత్యధిక CNG సామర్థ్యంతో పాటు 10% మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందించేలా రూపొందించబడింది. ఇక చివరగా అల్ట్రా T.16 Cx ట్రక్కు 3.3-లీటర్ ఇంజన్ కలిగి మంచి పనితీరుని అందించడమే కాకుండా, సౌకర్యవంతమైన అల్ట్రా క్యాబిన్‌తో వస్తుంది. మొత్తమ్ మీద ఇవన్నీ కూడా ఆధునిక ప్రపంచంలో వినియోగించడానికి చాలా అనుకూలంగా ఉంటాయి.

భారతీయ మార్కెట్లో భారీ CNG ట్రక్కులు విడుదల: టాటా మోటార్స్

కంపెనీ విడుదల చేసిన ఈ ఏడు డీజిల్ ట్రక్కులు ఆప్టిమైజ్డ్ డ్రైవ్‌లైన్‌లు, విస్కస్ రియర్ యాక్సెల్ ఆయిల్, ఇ-విస్కోస్ రేడియేటర్ ఫ్యాన్, గేర్‌షిఫ్ట్ అడ్వైజర్ మరియు లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్‌ వంటి వాటిని పొందుతాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Most Read Articles

English summary
Tata introduces updated and cng truck lineup for india find here all new details
Story first published: Monday, September 5, 2022, 16:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X