నెక్సాన్, హారియర్ మరియు సఫారీ మోడళ్లలో స్పెషల్ ఎడిషన్ల విడుదల.. వీటిలో ఆ స్పెషల్ ఏంటంటే..?
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) యొక్క అత్యంత ప్రజాధారణ పొందిన నెక్సాన్, హారియర్ మరియు సఫారి ఇప్పుడు జెట్ ఎడిషన్‌లో విడుదలయ్యాయి. కావున ఇవి మూడూ కూడా జెట్ ఎడిషన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆధునికంగా చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. కావున అప్డేటెడ్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ చూడవచ్చు.
Recommended Video
ఈ కొత్త ఎడిషన్స్ గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

టాటా మోటార్స్ విడుదల చేసిన ఈ కొత్త జెట్ ఎడిషన్ ఎస్‌యూవీలు ఈ రోజు నుంచి భారతదేశ వ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి. కావున కొనుగోలుదారులు సులభంగా కొనుగోలు చేయవచ్చు.

ధరల విషయానికి వస్తే, టాటా నెక్సాన్ జెట్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 12.13 లక్షలు, కాగా టాటా హారియర్ జెట్ ఎడిషన్ ధర రూ. 20.90 లక్షల వరకు ఉంది. ఇక ఇందులోని టాటా సఫారీ జెట్ ఎడిషన్ ధర రూ. 21.35 లక్షలు.

టాటా నెక్సాన్ జెట్ ఎడిషన్ 4 వేరియంట్లలో లభించగా, సఫారీ జెట్ ఎడిషన్ 4 వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. హారియర్ జెట్ ఎడిషన్ కేవలం 2 వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది.
| Tata JET Edition | Price (Ex-showroom Delhi) |
| Safari XZ+ (Diesel 6 seater) | ₹21.45 lakhs |
| Safari XZA+ (Diesel 6 seater) | ₹22.75 lakhs |
| Safari XZ+ (Diesel 7 seater) | ₹21.35 lakhs |
| Safari XZA+ (Diesel 7 seater) | ₹22.65 lakhs |
| Harrier XZ+ (Diesel) | ₹20.90 lakhs |
| Harrier XZA+ (Diesel) | ₹22.20 lakhs |
| Nexon XZ+ (P) (Diesel) | ₹13.43 lakhs |
| Nexon XZA+ (P) (Diesel) | ₹14.08 lakhs |
| Nexon XZ+ (P) (Petrol) | ₹12.13 lakhs |
| Nexon XZA+ (P) (Petrol) | ₹12.78 lakhs |

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా యొక్క జెట్ ఎడిషన్స్ ప్రస్తుత మోడల్ యొక్క టాప్ వేరియంట్ ఆధారంగా రూపొందించబడ్డాయి. అయితే ఇవి ప్రత్యేకమైన డ్యూయల్ టోన్ - స్టార్‌లైట్ కలర్ ఆప్షన్‌తో అందుబాటులో ఉన్నాయి. అయితే బాడీ బ్రాంజ్ కలర్ లో ఉండగా, ఇంటీరియర్ కూడా వైట్ అండ్ బ్లాక్ అనే డ్యూయల్-టోన్ స్కీమ్‌లో అందుబాటులో ఉంది. అంతే కాకూండా వీటికి జెట్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. అయితే ముందు మరియు వెనుక సిల్వర్ స్కిడ్ ప్లేట్లు ఇవ్వబడ్డాయి. కావున ఇవి మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.

టాటా హారియర్ జెట్, సఫారీ జెట్ ఎడిషన్:
టాటా హారియర్ మరియు సఫారీ జెట్ ఎడిషన్స్ అనేవి ప్రస్తుత టాప్ వేరియంట్‌లు XZ+ (P) ఆధారంగా లైనప్‌లో కొత్త టాప్ వేరియంట్‌లుగా ఉంటాయి. కావున ఇందులో కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్, లెదర్ సీట్లు, ఆటో డిమ్మింగ్ ORVM, డ్రైవర్ డిజినెస్ అలర్ట్, పానిక్ బ్రేకింగ్ అలర్ట్, బ్లాక్ కలర్ డైమండ్ కట్ అల్లాయ్స్, డ్రైవర్ మరియు కో-డ్రైవ్ కోసం వెంటిలేటెడ్ సీట్లు వంటివి ఉన్నాయి.

అంతే కాకూండా ఇందులో కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, ఆఫ్-రోడ్ ఏబీఎస్, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇందులో 8.8-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటివాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో iRA కనెక్టెడ్ కార్ టెక్, పనోరమిక్ సన్‌రూఫ్, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ మరియు గేర్ షిఫ్ట్ నాబ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో వాటి (హారియర్, సఫారీ) మునుపటి మోడల్స్ లోకి ఇంజిన్స్ ఉంటాయి. కావున అదే 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 170 పిఎస్ పవర్ మరియు 1,750-2,500 ఆర్‌పిఎమ్ వద్ద 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటాయి.

టాటా నెక్సాన్ జెట్ ఎడిషన్:
టాటా నెక్సాన్ జెట్ ఎడిషన్ విషయానికి వస్తే, ఇందులో 7-అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో డిమ్మింగ్ IRVM, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, గేర్ నాబ్, టిల్ట్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ఆటో హెడ్‌ల్యాంప్‌లు దాని స్టాండర్డ్ మోడల్ లో మాదిరిగానే ఉంటాయి.
అంతే కాకుండా ఇందులో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, వెహికల్ లైవ్ లొకేషన్ ట్రాకింగ్ మరియు జియో ఫెన్సింగ్, రియర్ పార్కింగ్ అసిస్ట్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇది రెండు ఇంజన్ ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది. అవి 1.2-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ టర్బో డీజిల్. ఇవి రెండు 120 పిఎస్ పవర్ & 170 ఎన్ఎమ్ మరియు 110 పిఎస్ పవర్ & 260 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. ఈ రేణు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటాయి.


Click it and Unblock the Notifications








