త్వరలో రానున్న 'Kaziranga Edition' ఫీచర్స్ వెల్లడించిన Tata Motors
భారతీయ కార్ల తయారీ సంస్థ 'టాటా మోటార్స్' (Tata Motors) తన ఫ్లాగ్‌షిప్ SUVల యొక్క రాబోయే కజిరంగా ఎడిషన్స్ యొక్క టీజర్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పటికే వెలువడ్డాయి. 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) సమయంలో ఈ స్పెషల్ ఎడిషన్‌ను ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఈ సీజన్ IPL 2022 కి టాటా మోటార్స్ అధికారిక భాగస్వామి కూడా అని ఇప్పటికే తెలిసింది.

కంపెనీ ఇప్పుడు కజిరంగా ఎడిషన్ లో టాటా పంచ్, నెక్సాన్, హారియర్ మరియు సఫారీ వంటి SUV లను విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఈ వారం చివరలో ఈ కజిరంగా ఎడిషన్స్ గురించి సమాచారం అందుబాటులోకి రానుంది. ఈ స్పెషల్ ఎడిషన్ మీద ఒక రెనో గుర్తును చూడవచ్చు. ఇది అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లోని ఒక కొమ్ము ఖడ్గమృగం నుండి ప్రేరణ పొందింది.

టాటా మోటార్స్ యొక్క కజిరంగా ఎడిషన్ ఒక ప్రత్యేకమైన కలర్ లో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త SUV లలో ఆధునిక ఫీచర్స్ అందుబటులో ఉంటాయి. కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ SUV అయిన టాటా నెక్సాన్ స్పెషల్ వెంటిలేటెడ్ సీట్లతో అమర్చబడి ఉంటుంది. అదే విధంగా దీని లోపల అపోల్స్ట్రే ప్రీమియం బెనెక్యూ కాలికో డ్యూయల్-టోన్ ఎర్టీ బీజ్ లెథెరెట్‌ను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఆటో డిమ్మింగ్ సౌకర్యంతో ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ లేదా IRVM కూడా ఉంటుంది. ఈ ఫీచర్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇక టాటా సఫారీ కజిరంగా ఎడిషన్‌లోని ఫీచర్ల విషయానికి వస్తే, ఇది వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యాన్ని పొందుతుంది. అంతే కాకుండా.. ఇప్పటికే మూడు వరుసల ఏడు సీట్ల SUV లో అందుబాటులో ఉన్న ఫీచర్. ఇవి కూడా వాహనం వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

టాటా పంచ్ కజిరంగా ఎడిషన్ కూడా టాటా మోటార్స్ నుండి IRA కనెక్టెడ్ కార్ ఫీచర్‌తో వస్తుంది. ఇందులో నావిగేషన్, క్లైమెంట్ మొదలైన వాటి గురించి సమాచారాన్ని పొందడానికి వాయిస్ కమాండ్‌లు ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ హర్మాన్ యొక్క 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో అందుబాటులో ఉంటుంది.

ఈ ఎడిషన్‌లో అందుబాటులో ఉన్న ఐదవ ప్రత్యేక ఫీచర్‌ను పరిశీలిస్తే, ఈ నాలుగు SUVలలో ఎయిర్ ప్యూరిఫైయర్ సిస్టమ్‌ను ఉపయోగించనున్నారు. టాటా పంచ్, నెక్సాన్, హారియర్ మరియు సఫారీ కజిరంగా ఎడిషన్స్ అన్ని ఎయిర్ ప్యూరిఫైయర్ సిస్టమ్ ను స్టాండర్డ్ గా పొందుతాయి.

అయితే వీటికి సంబంధించిన కొత్త టీజర్ ప్రకారం, ఈ కొత్త మోడల్స్ మెటోర్ బ్రాంజ్ కలర్‌లో ఉంటాయి. అయితే ఈ మూడు మోడల్స్ అన్నీ కూడా రినో లోగోతో వస్తాయి. ఇవి ఫెండర్లు, రియర్ విండ్‌స్క్రీన్ మరియు గ్లోవ్‌బాక్స్‌పై ఇవ్వబడతాయి. అంతే కాకూండా కజిరంగా స్కఫ్ ప్లేట్స్ కూడా ఇవ్వబడతాయి.

ఇక వీటి యొక్క ఇంటీరియర్‌లోని గ్లోవ్ బాక్స్‌పై రినోని చూడవచ్చు. ఇందులో ఇది తప్పా ఇతర మార్పులు కనిపించవు. ఈ స్పెషల్ ఎడిషన్‌లలో స్టీరింగ్ వీల్‌పై లెదర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌లైట్ మరియు వైపర్లు, క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

అయితే రానున్న ఈ కొత్త మోడల్స్ యొక్క హారియర్ మినహా, మిగిలిన వాటిలో IRA కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ మోడల్ ఎంతవరకు ఆదరణ పొందుతాయి ఏ విషయాలు తెలియాలి.

ఇదిలా ఉండగా టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ మనం ఇది వరకు చెప్పుకున్నట్లుగా ఇటీవల 2022 IPL కజిరంగా ఎడిషన్ లో ప్రవేశపెట్టనుంది. అయితే టాటా పంచ్ యోక్స్ స్టాండర్డ్ ఎడిషన్ ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్ వేరియంట్స్. ఈ నాలు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి.

Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. Tata Punch యొక్క సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.

Tata Punch యొక్క ఇంటీరియర్ డ్యూయల్-టోన్ థీమ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉపయోగించబడింది. ఇదే డ్యూయెల్ టోన్ కలర్ దాని డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఇది కాకుండా, దానిలో కనిపించే AC వెంట్‌లపై బ్లూ హైలైట్‌లు మరియు లోపలి డోర్ హ్యాండిల్స్‌లో వైట్ ఇన్సర్ట్‌లు ఉపయోగించబడ్డాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.


Click it and Unblock the Notifications








