భారత్‌లో Tata Kaziranga Edition's.. లాంచ్ ఎప్పుడో తెలుసా?
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) తన ప్రసిద్ధ SUV లైన టాటా పంచ్, టాటా హారియర్, టాటా నెక్సాన్ మరియు టాటా సఫారీ వంటి వాటిని ఇప్పుడు కజిరంగా ఎడిషన్ లో తీసుకురానున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్పెషల్ మోడల్ దేశీయ మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతాయి అనే సమాచారం అందుబాటులో లేదు. కానీ మీడియా నివేదికల ప్రకారం ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే సమాచారం వెల్లడయ్యింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం, టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్, హారియర్ మరియు సఫారీ యొక్క కజిరంగా ఎడిషన్స్ ఈ నెల 23 న విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. అంటే ఇవి రేపు మార్కెట్లో విడుదల కానున్నాయి. టాటా మోటార్స్ యొక్క కజిరంగా ఎడిషన్ అనేది కజిరంగా నేషనల్ పార్క్‌లోని ఒక కొమ్ము ఖడ్గమృగం కోసం అంకితం చేయబడింది.

కంపెనీ ఇప్పటికే ఈ స్పెషల్ ఎడిషన్స్ యొక్క టీజర్ వీడియోలను కూడా విడుదల చేసింది. ఇందులో కంపెనీ టాటా పంచ్, టాటా హారియర్ మరియు టాటా నెక్సాన్ యొక్క కజిరంగా ఎడిషన్‌లు అనేక ఆధునిక మరియు అదనపు ఫీచర్లతో అందించబడతాయని తెలిసింది. ఈ ఫీచర్స్ వాటి యొక్క స్టాండర్డ్ వేరియంట్లలో లేదు.

కంపెనీ విడుదల చేయనున్న అన్ని స్పెషల్ ఎడిషన్ SUV లు గ్రాస్‌ల్యాండ్ బీజ్ షేడ్‌లో ఉత్పత్తి చేయబడతాయి. ఈ షెడ్ కజిరంగా విస్తీర్ణంలో కనిపించే సవన్నా గడ్డిని అనుకరిస్తుంది. ఇది కాకుండా, బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్, బ్యాడ్జ్‌లు మరియు డీక్రోమ్డ్ ఎలిమెంట్స్ ఈ కలర్‌తో చాలా బాగా కలిసిపోయాయి.

ఇక ఈ స్పెషల్ ఎడిషన్స్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులోని సీట్లు మరియు డోర్ ప్యాడ్‌లపై కాంట్రాస్టింగ్ బీజ్ కలర్ ;లో ఉంటాయి, మరియు బ్లాక్ డ్యాష్‌బోర్డ్‌ను పొందుతాయి. అదే విధంగా ముందు సీటు హెడ్‌రెస్ట్‌లో ఒక కొమ్ము గల ఖడ్గమృగం యొక్క ఎత్తైన సిల్హౌట్ ఉంది. టాటా పంచ్ యొక్క డ్యాష్‌బోర్డ్‌లోని సెంటర్ ట్రిమ్ బీజ్ కలర్ లో పూర్తి చేయబడింది. మిగిలినవి చెక్క ట్రిమ్‌లో ఉంచబడ్డాయి.

ఇప్పటి వరకు టాటా మోటార్స్ ఐదు కీలక ఫీచర్లను వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్లు ఈ కొత్త మరియు స్పెషల్ ఎడిషన్స్ లో అందుబాటులో ఉంటాయి. ఇప్పటికి ఎక్కువ అమ్మకాలతో ముందుకు సాగుతున్న కాంపాక్ట్ SUV అయిన టాటా నెక్సాన్ ప్రత్యేకంగా వెంటిలేటెడ్ సీట్లతో రానుంది.

టాటా నెక్సాన్ కజిరంగా ఎడిషన్ లోపలి అపోల్స్ట్రే ప్రీమియం బెనెక్యూ కాలికో డ్యూయల్-టోన్ ఎర్టీ బీజ్ లెథెరెట్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో అందుబాటులో ఉన్న ఇతర ఫీచర్‌ల విషయానికి వస్తే, కంపెనీ ఈ SUVలలో ఆటో డిమ్మింగ్ సౌకర్యంతో ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ లేదా IRVMని పరిచయం చేస్తుంది. ఈ ఫీచర్ టాటా నెక్సాన్ కజిరంగా ఎడిషన్‌లో కూడా అందుబాటులోకి వస్తుంది. ఇది 'గ్లేర్‌ను గుర్తించడానికి మరియు ఆదర్శవంతమైన రహదారి దృష్టికి అనుగుణంగా' సహాయపడుతుంది.

టాటా సఫారీ కజిరంగా ఎడిషన్‌లో ఉన్న ఫీచర్ల విషయానికి వస్తే, ఇది వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యాన్ని పొందుతుంది. ఇది ఇప్పటికే మూడు వరుసల ఏడు సీట్ల SUV లో అందుబాటులో ఉన్న ఫీచర్. అన్ని స్పెషల్ ఎడిషన్ SUV లు ఇప్పటికే ఉన్న పవర్‌ట్రెయిన్‌లను పొందుతాయి.

కంపెనీ యొక్క టాటా హారియర్ మరియు సఫారి 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ పొందుతాయి. ఇవి 170 బిహెచ్‌పి పవర్ అందిస్తాయి. ఇక టాటా పంచ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను మాత్రమే పొందుతుంది, కావున ఇది 86 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. అదే విధంగా టాటా నెక్సాన్ రెండు ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. ఇందులో మొదటిది 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్. ఇది 120 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇక రెండవ ఇంజిన్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్. ఇది 110 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

ఏది ఏమైనా టాటా మోటార్స్ త్వరలోనే వీటిని మార్కెట్లో విడుదల చేయనుంది, అయితే ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్స్ ఎలాంటి ఆదరణ పొందుతాయి, ఎలాంటి అమ్మకాలతో ముందుకు సాగుతాయి అనే విషయాలన్నీ కూడా త్వరలో తెలుస్తాయి.ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు బైకుల గురించి పూర్తి సమాచారం తెలుసుకోడానికి మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ పాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








