పండుగ సీజన్ పోయిందని చింతించకండి.. ఆఫర్స్ అందించడానికి 'టాటా మోటార్స్' ఉందిగా: మోడల్స్ వారీగా డిస్కౌంట్స్

భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఈ నెల (2022 నవంబర్) తన ఉత్పత్తులపై దాదాపు రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో టియాగో, టిగోర్, హారియర్ మరియు నెక్సాన్ ఉన్నాయి.

టాటా కంపెనీ ఈ ఉత్పత్తులపైన అందిస్తున్న డిస్కౌంట్స్ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయి, ఏ వేరియంట్ పైన ఎంత వరకు డిస్కౌంట్స్ లభిస్తుంది, అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.. రండి.

అదిరిపోయే ఆఫర్స్ తీసుకువచ్చిన టాటా మోటార్స్

టాటా టియాగో:

2022 నవంబర్ నెలలో టాటా మోటార్స్ యొక్క టియాగో కొనాలనే కస్టమర్లు ఇప్పుడు రూ. 33,000 వరకు ఆదా చేయవచ్చు. టియాగో యొక్క అన్ని వేరియంట్ల పైన రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్‌ లభిస్తుంది. అదే సమయంలో రూ. 20,000 వరకు కన్స్యూమర్ క్యాష్ డిస్కౌంట్ తో పాటు రూ. 3000 అడిషినల్ కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది.

టాటా టిగోర్:

టాటా మోటుసర్ యొక్క టిగోర్ కొనుగోలుపైనా రూ. 38,000 వరకు బెణిఫీట్స్ పొందవచ్చు. ఇందులో రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ (పెట్రోల్ వేరియంట్‌పై), సిఎన్‌జి వేరియంట్‌లపై రూ.10,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తుంది. అదే సమయంలో రూ. 3,000 వరకు అడిషినల్ కార్పొరేట్ డిస్కౌంట్స్ లభిస్తాయి.

అదిరిపోయే ఆఫర్స్ తీసుకువచ్చిన టాటా మోటార్స్

టాటా హారియర్:

కంపెనీ అందించిన ఈ ఆఫర్స్ ప్రకారం టాటా హారియర్ కొనుగోలుపైన రూ. 65,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో రూ. 30,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌, రూ. 20,000 క్యాష్ బెనిఫిట్ లభిస్తుంది. అయితే కజిరంగా లేదా జెట్ వేరియంట్‌లపైనా రూ. 30,000 క్యాష్ బోనస్ లభిస్తుంది. అంతే కాకుండా రో. 5,000 వరకు అడిషినల్ కార్పొరేట్ డిస్కౌంట్స్ దీనిపైన అందుబాటులో ఉంటాయి.

టాటా నెక్సాన్:

టాటా మోటార్స్ వారి అత్యంత ప్రజాదరణ పొందిన టాటా నెక్సాన్ మీద కంపెనీ ఇప్పుడు కేవలం రూ. 5,000 మాత్రమే డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో పెట్రోల్ వేరియంట్స్ మీద రూ. 3,000 మరియు డీజిల్ మోడల్స్ మీద రూ. 5,000 డిస్కౌంట్స్ లభిస్తాయి. అయితే టాటా నెక్సాన్ యొక్క ఎలక్ట్రిక్ కార్ల మీద ప్రస్తుతానికి ఎటువంటి డిస్కౌంట్స్ అందుబాటులో లేదు. కొనుగోలుదారులు తప్పకుండా దీనిని గమనించాలి.

అదిరిపోయే ఆఫర్స్ తీసుకువచ్చిన టాటా మోటార్స్ - వివరాలు

టాటా సఫారీ:

టాటా మోటార్స్ యొక్క టాటా సఫారీపైన కంపెనీ ఇప్పుడు రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 30,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ లభిస్తుంది. అదే సమయంలో స్టాండర్డ్ వేరియంట్స్ పైన క్యాష్ బోనస్ రూ. 20,000, కజిరంగా మరియు జెట్ ఎడిషన్‌లకు అదనంగా రూ. 10,000 లభిస్తుంది. వీటితోపాటు రూ. 5,000 అడిషినల్ కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

టాటా మోటార్స్ విజయదశమి మరియు దీపావళి ముగిసిన తరువాత కూడా అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆఫర్స్ అన్నీ కూడా 2022 నవంబర్ చివరి వరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కావున పైన తెలిపిన కార్లను కొనాలకున్నప్ప్పుడు తప్పకుంసా సమీపంలోని కంపెనీ షోరూమ్‌లను సందర్శించి మరిన్ని ఖచ్చితమైన వివరాలకు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆఫర్స్ డీలర్‌షిప్ లను బట్టి కూడా ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, November 15, 2022, 8:00 [IST]
English summary
Tata motars offering discounts in 2022 november details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+