ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లోనే కాదు ఉత్పత్తిలో కూడా రికార్డ్ సృష్టించిన టాటా మోటార్స్ - వివరాలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలంటే మొదట గుర్తొచ్చేది 'టాటా మోటార్స్' (Tata Motors). ఎందుకంటే టాటా మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలను దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే మార్కెట్లో కంపెనీ ఎప్పటికప్పుడు మార్కెట్లో మంచి మరియు కొత్త ఉత్పత్తులను విడుదల్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో కొత్త మైలురాయిని చేరుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లోనే కాదు ఉత్పత్తిలో కూడా రికార్డ్ సృష్టించిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ అందించిన సమాచారం ప్రకారం, భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను ఇప్పటివరకు 50,000 యూనిట్లను ఉత్పత్తి చేసింది. కాగా 50,000 వ యూనిట్ గా టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారుని పూణే సమీపంలోని రంజన్‌గావ్‌లోని ప్లాంట్‌లో విడుదల చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెల్లడయ్యాయి.

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లోనే కాదు ఉత్పత్తిలో కూడా రికార్డ్ సృష్టించిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో నాలుగు ఎలక్ట్రిక్ కార్లను కలిగి ఉంది. అవి నెక్సాన్ ఈవి, టిగోర్ ఈవి, టియాగో ఈవి మరియు ఫ్లీట్-ఓన్లీ Xpres-T ఈవి. అయితే టాటా నెక్సాన్ ఈవి విభాగంలో మ్యాక్స్ ఈవి అనే వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లోనే కాదు ఉత్పత్తిలో కూడా రికార్డ్ సృష్టించిన టాటా మోటార్స్

ఎలక్ట్రిక్ వాహన విభాగంలో టాటా మోటార్స్ ఇప్పటివరకు దేశీయ మార్కెట్లో అత్యధిక వాటాను కలిగి ఉంది. ఎందుకంటే కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ కార్లు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది టాటా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే ఇప్పటివరకు కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో కూడా ముందంజలో ఉంది.

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లోనే కాదు ఉత్పత్తిలో కూడా రికార్డ్ సృష్టించిన టాటా మోటార్స్

కంపెనీ 50,000 వ ఎలక్ట్రిక్ వెహికల్ టాటా నెక్సాన్ విడుదల చేసే సందర్భంగా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మరియు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. దేశీయ విఫణిలో ఉత్తమమైన ఉత్పత్తులను ప్రవేశపెట్టవలసిన బాధ్యత మాపై ఎంతైనా ఉంది. అంతే కాకుండా కస్టమర్ల సౌకర్యాన్ని మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు ఆధునిక ఉత్పత్తులను తీసుకువస్తున్నాము. అదే సమయంలో కంపెనీ పర్యావరణ హితకారిగా ఉందని అన్నారు.

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లోనే కాదు ఉత్పత్తిలో కూడా రికార్డ్ సృష్టించిన టాటా మోటార్స్

భారతదేశంలో 50,000 వ ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడం కంపెనీ సాధించిన విజయానికి నిదర్శనం. ప్రస్తుతం ఇంధన ధరలు భారీగా పెరిగిపోతున్న సమయంలో ఎక్కువమంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సమయంలో కంపెనీ యొక్క పటిష్టమైన ఉత్పత్తులు కస్టమర్లను ఎంతగానో ఆకర్శించడంలో సహాయపడుతున్నాయి. రానున్న రోజుల్లో కంపెనీ మరింత గొప్ప రికార్డ్ సృష్టించే అవకాశం కూడా ఉంది.

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లోనే కాదు ఉత్పత్తిలో కూడా రికార్డ్ సృష్టించిన టాటా మోటార్స్

కస్టమర్ అవసరాలను తీర్చడానికి, కంపెనీ మల్టీ మోడ్ రీజెన్ మరియు మల్టీ డ్రైవ్ మోడ్ వంటి ఫీచర్‌లను పరిచయం చేయడమే కాకుండా, తమ అన్ని ఉత్పత్తులు అధిక వోల్టేజ్ జిప్‌ట్రాన్ ఆర్కిటెక్చర్ ద్వారా శక్తిని పొందుతాయి. కావున మంచి రేంజ్ అందించడానికి అనుకూలంగా ఉంటుంది. కావున టాటా మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు తప్పకుండా మంచి రేంజ్ అందించేలా రూపొందించబడ్డాయి.

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లోనే కాదు ఉత్పత్తిలో కూడా రికార్డ్ సృష్టించిన టాటా మోటార్స్

ప్రస్తుతం కస్టమర్ల అవసరాలను తీర్చడానికి కంపెనీ కొత్త ఉత్పత్తులు అభివృద్ధి చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే టాటా మోటార్స్ తన నెట్‌వర్క్‌ను కూడా ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంది. రానున్న రోజుల్లో ఇది మరిన్ని ఎక్కువ నగరాల్లో విస్తరించే అవకాశం ఉంది. కావున ఇది కస్టమర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. రాబోయే మరో 5 సంవత్సరాల్లో కంపెనీ మరో 10 ఎలక్ట్రిక్ ఉత్పత్తులను విడుదల చేయడానికి ఆలోచిస్తోంది.

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లోనే కాదు ఉత్పత్తిలో కూడా రికార్డ్ సృష్టించిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ కేవలం ఉత్పత్తులలో మాత్రమే కాకూండా అమ్మకాల్లో కూడా మంచి పురోగతిని కలిగి ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల కంపెనీ టాటా టియాగో EV ని రూ. 8.49 లక్షల ధర వద్ద విడుదల చేసింది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో విక్రయించబడుతున్న సరసమైన ఎలక్ట్రిక్ కారు కూడా ఇదే. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క డెలివరీలు 2023 జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లోనే కాదు ఉత్పత్తిలో కూడా రికార్డ్ సృష్టించిన టాటా మోటార్స్

కంపెనీ ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ కారు కోసం 10,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. ఇది 19.2kWh మరియు 24kWh అనే రెండుబ్యాటరీ ప్యాక్స్ పొందుతాయి. ఇందులోని 19.2kWh బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో 250కిమీ పరిధిని అందిస్తుంది. అదే సమయంలో ఇందులోని 24kWh బ్యాటరీ ప్యాక్ ఒక ఫుల్ ఛార్జ్ తో 315 కిమీ పరిధిని అందిస్తుందని తెలుస్తోంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, టియాగో ఈవి 25 kW ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో కేవలం 65 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Tata motors achieves new milestone of 50000 electric vehicle production in india details
Story first published: Tuesday, November 8, 2022, 11:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X