టాటా హారియర్ (Tata Harrier) ఇప్పుడు కొత్త రంగులలో లభ్యం.. సవరించిన ధరలు..!

హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లకు పోటీగా దేశీయ మార్కెట్లో విక్రయించబడుతున్న టాటా హారియర్ (Tata Harrier) మిడ్-సైజ్ ఎస్‌యూవీలో కంపెనీ ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. టాటా హారియర్ ఇప్పుడు రాయల్ బ్లూ (Royal Blue) మరియు ట్రాపికల్ మిస్ట్ (Tropical Mist) అనే రెండు కొత్త ఎక్స్టీరియర్ కలర్లలో లభిస్తుంది. ఈ కొత్త కలర్ ఆప్షన్లను కంపెనీ ఇప్పటికే అందిస్తున్న ఇతర కలర్ ఆప్షన్లతో పాటుగా అందుబాటులో ఉంచింది.

టాటా హారియర్ (Tata Harrier) ఇప్పుడు కొత్త రంగులలో లభ్యం.. సవరించిన ధరలు..!

టాటా మోటార్స్ యొక్క బెస్ట్ సెల్లింగ్ మోడల్ అయిన హారియర్‌లో పరిచయం చేసిన కొత్త కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇందులోని రాయల్ బ్లూ ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్ సింగిల్-టోన్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే, ట్రాపికల్ మిస్ట్ కలర్ ఆప్షన్ మాత్రం కాంట్రాస్టింగ్ బ్లాక్ రూఫ్‌ను కలిగి ఉండి డ్యూయెల్ టోన్ వేరియంట్ గా లభిస్తుంది. ఈ మోడల్ కోసం కంపెనీ అందిస్తున్న ఇతర కలర్ ఆప్షన్లలో ఓర్కస్ వైట్, కాలిప్సో రెడ్ మరియు డేటోనా గ్రేలు కూడా ఉన్నాయి.

టాటా హారియర్ (Tata Harrier) ఇప్పుడు కొత్త రంగులలో లభ్యం.. సవరించిన ధరలు..!

కొత్త ట్రాపికల్ మిస్ట్ కలర్ ఆప్షన్ XZS మరియు XZ+ ట్రిమ్ లెవల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాగా, రాయల్ బ్లూ కలర్ ఆప్షన్ XT+ ట్రిమ్ స్థాయి నుండి అందుబాటులో ఉంటుంది. కొత్త ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్స్ మినహా కంపెనీ ఈ మోడల్‌లో యాంత్రికంగా మరియు ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పు చేయలేదు. అయితే, టాటా హారియర్ ధరలను మాత్రం కంపెనీ సవరించింది. ఇప్పుడు ఈ ఎస్‌యూవీ ధరలు సుమారు రూ.19,000 వరకు పెరిగాయి. ధరల పెంపు అనంతరం హారియర్ ఇప్పుడు రూ.14.64 లక్షల నుండి రూ.21.94 లక్షల మధ్యలో అందుబాటులో ఉంటుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

Harrier MT New Price Old Price Difference
XE ₹14,64,900 ₹14,52,900 ₹12,000
XM ₹16,04,900 ₹15,92,900 ₹12,000
XT ₹17,34,900 ₹17,21,400 ₹13,500
XT+ ₹18,14,900 ₹18,01,400 ₹13,500
XT+ Dark ₹18,44,900 ₹18,31,400 ₹13,500
XZ ₹18,74,900 ₹18,60,400 ₹14,500
XZ DT ₹18,94,000 ₹18,80,400 ₹14,500
XZ+ ₹20,34,900 ₹20,20,400 ₹14,500
XZ+ KZR ₹20,54,900 ₹20,40,900 ₹14,000
XZ+ DT ₹20,55,900 ₹20,41,000 ₹14,900
XZ+ Dark ₹20,64,900 ₹20,46,500 ₹18,400
Harrier AT New Price Old Price Difference
XMA ₹17,34,900 ₹17,22,900 ₹12,000
XTA+ ₹19,44,900 ₹19,31,400 ₹13,500
XTA+ Dark ₹19,74,900 ₹19,61,400 ₹13,500
XZA ₹19,99,900 ₹19,90,400 ₹9,590
XZA DT ₹20,24,900 ₹20,10,400 ₹14,500
XZA+ ₹21,64,900 ₹21,50,400 ₹14,500
XZA+ KZR ₹21,84,900 ₹21,70,900 ₹14,000
XZA+ DT ₹21,85,900 ₹21,71,000 ₹14,900
XZA+ Dark ₹21,94,900 ₹21,81,000 ₹13,900
టాటా హారియర్ (Tata Harrier) ఇప్పుడు కొత్త రంగులలో లభ్యం.. సవరించిన ధరలు..!

ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమమైన 5-సీటర్ ఎస్‌యూవీలలో టాటా హారియర్ కూడా ఒకటి. అయితే, ఇది కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఎస్‌యూవీలో శక్తివంతమైన 2.0 లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్ ను ఉపయోగించింది. ఈ ఇంజన్ 3,750 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 167.67 బిహెచ్‌పి శక్తిని మరియు 1,750 ఆర్‌పిఎమ్ వద్ద 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా హారియర్ (Tata Harrier) ఇప్పుడు కొత్త రంగులలో లభ్యం.. సవరించిన ధరలు..!

కంపెనీ ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంచింది. టాటా మోటార్స్ పేర్కొన్న అధికారిక గణాంకాల ప్రకారం, టాటా హారియర్ యొక్క మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్లు లీటరుకు 16.35 కిమీ మైలేజీని అందిస్తుండగా, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్లు లీటరుకు 14.6 కిమీ మైలేజీని అందిస్తాయి. టాటా హారియర్ ఈ విభాగంలో విస్తృతమైన ఫీచర్లు మరియు టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది.

టాటా హారియర్ (Tata Harrier) ఇప్పుడు కొత్త రంగులలో లభ్యం.. సవరించిన ధరలు..!

కొత్త టాటా హారియర్‌లో లభించే ఫీచర్లను గమనిస్తే, ఇందులో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద 9 ఇంచ్ హర్మాన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, iRA కనెక్టెడ్ కార్ టెక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), స్మార్ట్ కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్-ఆపరేటెడ్ మరియు ఆటో-ఫోల్డింగ్ అవుట్-సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ (ORVMలు), క్రూయిజ్ కంట్రోల్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

టాటా హారియర్ (Tata Harrier) ఇప్పుడు కొత్త రంగులలో లభ్యం.. సవరించిన ధరలు..!

భద్రత పరంగా చూస్తే, కొత్త టాటా హారియర్ లో బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ (IRVM) వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం, మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీలలో టాటా హారియర్ కూడా ఒకటి, ఇది ధరకు తగిన ఫీచర్లలో విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, May 2, 2022, 16:53 [IST]
English summary
Tata motors adds two new colours in harrier lineup and updates price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+