కేరళ రాష్ట్రం నుండి జాక్‌పాట్ కొట్టిన టాటా మోటార్స్.. 65 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ప్రస్తుతం భారతదేశంలోని ఎలక్ట్రిక్ కార్ విభాగంలో అగ్రగామిగా ఉన్న సంగతి తెలిసినదే. నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ అనే రెండు ఎలక్ట్రిక్ కార్లను టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. సరసమైన ధర మరియు ఆకర్షణీయమైన ఫీచర్ల కారణంగా మార్కెట్లో వీటికి డిమాండ్ అధికంగా ఉంది. ఫలితంగా, దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో టాటా మోటార్స్ అగ్రస్థానంలో ఉంది.

కేరళ రాష్ట్రం నుండి జాక్‌పాట్ కొట్టిన టాటా మోటార్స్.. 65 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. టాటా మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజల నుండి మాత్రమే కాకుండా ప్రభుత్వ శాఖల నుండి కూడా మంచి ఆదరణ పొందాయి. తాజాగా, టాటా మోటార్స్ అందిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల కోసం ఓ భారీ ఆర్డర్ లభించింది. కేరళ రాష్ట్రంలోని ఎలక్ట్రిక్ డిపార్ట్‌మెంట్ అధికారిక వినియోగం కోసం 65 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్ ప్లేస్ చేసింది. ఈ మొత్తం ఆర్డర్ లో 60 టాటా టిగోర్ ఈవీలు మరియు 5 టాటా నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి.

కేరళ రాష్ట్రం నుండి జాక్‌పాట్ కొట్టిన టాటా మోటార్స్.. 65 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్

కేరళ మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లను వినియోగిస్తోంది. కేరళ రాష్ట్రాన్ని కార్బన్ రహితంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వచ్చే 2030 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని కేరళ రాష్ట్రం కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా కేరళ ప్రభుత్వం తన ప్రభుత్వ శాఖల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఆధిపత్యాన్ని పెంచుతోంది. అదే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం తన పౌరులను ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వైపు మళ్లించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది.

కేరళ రాష్ట్రం నుండి జాక్‌పాట్ కొట్టిన టాటా మోటార్స్.. 65 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్

ఈ విషయంలో ప్రజలకు మార్గనిర్దేశం చేసేందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం టాటా మోటార్స్‌ కు ఈ భారీ కొనుగోలు ఆర్డర్‌ ను ఇచ్చింది. కేరళ రాష్ట్రం తమ అధికారుల కోసం ఆర్డర్ చేసిన ఈ రెండు టాటా ఎలక్ట్రిక్ కార్లు భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి అత్యుత్తమంగా రాణిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు. వీటిలో టాటా టిగోర్ ఈవీ భారతదేశపు అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా ఉంది. మార్కెట్లో దీని ధర రూ. 11.99 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 306 కి.మీ రేంజ్ ను అందిస్తుంది.

కేరళ రాష్ట్రం నుండి జాక్‌పాట్ కొట్టిన టాటా మోటార్స్.. 65 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్

టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV)

టాటా మోటార్స్ గతేడాది చివర్లో తమ సరికొత్త టిగోర్ ఈవీ (Tigor EV) ఎలక్ట్రిక్ సెడాన్ ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ XE, XM మరియు XZ+ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. కంపెనీ తమ సరికొత్త ఈవీ సెడాన్ ను పాపులర్ జిప్‌ట్రాన్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌ ను ఉపయోగించి తయారు చేసింది. ఇదే ప్లాట్‌ఫామ్ పై కంపెనీ తమ ప్రస్తుత నెక్సాన్ ఈవీ (Nexon EV) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా తయారు చేస్తుంది.

కేరళ రాష్ట్రం నుండి జాక్‌పాట్ కొట్టిన టాటా మోటార్స్.. 65 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్

అధునాతన Ziptron టెక్నాలజీతో అభివృద్ధి చేసిన కారణంగా కొత్త టిగోర్ ఈవీ మునుపటితో పోలిస్తే, మెరుగైన రేంజ్ మరియు డ్రైవింగ్ డైనమిక్స్ ని కలిగి ఉంటుంది. గతంలో టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఛార్జ్‌పై 90 నుండి 100 కిమీ రేంజ్‌ ని మాత్రమే ఆఫర్ చేసేది. అయితే, ఈ అధునాతన జిప్‌ట్రాన్ టెక్నాలజీ కారణంగా ఇప్పుడు, కొత్త 2021 టాటా టిగోర్ ఈవీ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 306 కిమీ కంటే ఎక్కువ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో IP67 రేటెడ్ 26 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించారు.

కేరళ రాష్ట్రం నుండి జాక్‌పాట్ కొట్టిన టాటా మోటార్స్.. 65 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్

ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 55 kW శక్తిని మరియు 170 ఎన్ఎమ్‌ ల టార్క్‌ ని జనరేట్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఇక చార్జింగ్ సమయం విషయానికి వస్తే, కొత్త టిగోర్ ఈవీని ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో కేవలం 1 గంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే, సాధారణ ఛార్జర్‌ తో అయితే బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 8.5 గంటల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది.

కేరళ రాష్ట్రం నుండి జాక్‌పాట్ కొట్టిన టాటా మోటార్స్.. 65 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్

టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)

టాటా నెక్సాన్ విషయానికి వస్తే, ఇది పూర్తి చార్జ్ పై 312 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. కాగా, కంపెనీ ఇప్పుడు ఇందులో ఓ లాంగ్ రేంజ్ వేరియంట్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సమాచారం ప్రకారం, ఈ కొత్త లాంగ్ రేంజ్ వేరియంట్ టాటా నెక్సాన్ ఈవీ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 400 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్ ను ఆఫర్ చేస్తుందని సమాచారం మరియు ఇది ఈ ఏడాది ఏప్రిల్ నెల నాటికి మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. ఈ కొత్త 2022 టాటా నెక్సాన్ ఈవీలో పెద్ద 40 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.

కేరళ రాష్ట్రం నుండి జాక్‌పాట్ కొట్టిన టాటా మోటార్స్.. 65 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్

ప్రస్తుతం, మార్కెట్లో విక్రయించబడుతున్న టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో 95 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్‌ను ఫ్రంట్ యాక్సిల్‌లో అమర్చబడి ఉంటుంది. ఇది 30.2 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ మోటర్ గరిష్టంగా 129 బిహెచ్‌పి పవర్‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, అప్‌డేట్ చేయబడిన కొత్త 2022 మోడల్ టాటా నెక్సాన్ ఈవీ లోకల్ టెస్ట్ సైకిల్ లో ఒకే ఛార్జ్‌పై సుమారు 400 కిమీ కంటే ఎక్కువ రేంజ్ ను కలిగి ఉంటుంని, అయితే వాస్తవ ప్రపంచ పరిధి అది దాదాపు 300-320 కిమీ రేంజ్ ను ఆఫర్ చేస్తుందని అంచనా.

Article Published On: Tuesday, March 8, 2022, 15:48 [IST]
English summary
Tata motors bags order from kerala state electricity board for 65 electric vehicles details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+