50,000 వ 'నెక్సాన్ ఈవి' డెలివరీ పొందిన టాటా గ్రూప్ చైర్మన్ - ఫోటోలు ఇక్కడ చూడవచ్చు
భారతీయ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా నెక్సాన్ ఈవి మంచి సంఖ్యలో అమ్మకాలను పొందుతోంది. ఇటీవల కంపెనీ యొక్క టాటా నెక్సాన్ ఈవి 50,000 వ యూనిట్ టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కి డెలివెరీ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ గత కొన్ని రోజులకు ముందు తన 50,000 వ టాటా నెక్సాన్ ఈవి యూనిట్ ని పూణే ఆధారిత ప్రొడక్షన్ ప్లాంట్ నుంచి విడుదక చేసింది. అయితే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారుని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సొంతం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇందులో టాటా నెక్సాన్ ఈవి కారుని డెలివెరీ చేయడం చూడవచ్చు.

టాటా నెక్సాన్ ఈవి అనేది భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందుతున్న ఎలక్ట్రిక్ SUV. ఈ ఎలక్ట్రిక్ SUV ప్రస్తుతం రెండు ట్రిమ్‌లలో అందించబడుతోంది. అవి టాటా నెక్సాన్ EV ప్రైమ్ మరియు టాటా నెక్సాన్ EV మాక్స్. నెక్సాన్ ఈవి ప్రైమ్ ఒక ఫుల్ చార్జ్ పై 312 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తాయి. అయితే నెక్సాన్ EV మాక్స్ ఒక ఛార్జ్ తో 437 కిమీల సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుంది.
ధరల విషయానికి వస్తే, నెక్సాన్ EV ప్రైమ్ ధర రూ. 14.99 లక్షల నుంచి రూ. 17.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కాగా నెక్సాన్ ఈవి మ్యాక్స్ ధర రూ. 18.34 లక్షల నుండి రూ. 20.04 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ వాస్తవ ప్రపంచంలో కొంత తక్కువగా ఉంటుంది. అయితే ఇవి మంచి భద్రత ఫీచర్స్ కలిగి ఉంటాయి.

టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ వాహన విభాగాన్ని నిరంతరం విస్తరిస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ విభాగంలో టాటా టిగర్ ఈవి, టాటా టియాగో ఈవి వంటి వాటిని కూడా చేర్చింది. రానున్న రోజుల్లో ఈ విభాగాన్ని మరింత విస్తరించడానికి కంపెనీ సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది. కంపెనీ తన 50,000 వ నెక్సాన్ ఈవి డెలివరీ చేయడంపైన సంతోషం వ్యక్తం చేసింది.
టాటా నెక్సాన్ మంచి డిజైన్ కలిగి, మంచి ఫీచర్స్ పొందుతుంది. నెక్సాన్ ఈవి మ్యాక్స్ మల్టీ-లెవల్ రీజెన్ బ్రేకింగ్ సిస్టమ్, యాక్టివ్ మోడ్ డిస్‌ప్లేతో కూడిన కంట్రోల్ నాబ్, సరికొత్త మకరనా బేజ్ ఇంటీరియర్స్, ముందు ప్రయాణికుల కోసం వెంటిలేషన్‌తో కూడిన లెథెరెట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటివి పొందుతుంది.
ఇదిలా ఉండగా టాటా మోటార్స్ ఇటీవల కంపెనీ టాటా టియాగో EV ని రూ. 8.49 లక్షల ధర వద్ద విడుదల చేసింది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో విక్రయించబడుతున్న సరసమైన ఎలక్ట్రిక్ కారు కూడా ఇదే. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క డెలివరీలు 2023 జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది 19.2kWh మరియు 24kWh అనే రెండుబ్యాటరీ ప్యాక్స్ పొందుతాయి. ఈ రెండూ కూడా మంచి రేంజ్ అందిస్తాయి.
టాటా మోటార్స్ రానున్న రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లను చేసుకుంటోంది. ఇందులో భాగంగానే రానున్న రోజుల్లో కంపెనీ టాటా సియెర్రా EV, అవిన్య EV కాన్సెప్ట్ వంటి వాటిని విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ కార్లను గురించి కొంత సమాచారం వెలువడినప్పటికీ మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది. టాటా మోటార్స్ విడుదల చేసే వాహనాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








