టాటా కజిరంగా ఎడిషన్స్ వచ్చేశాయ్.. ధర & వివరాలు ఇక్కడ చూడండి
దేశీయ వాహన తయారీ దిగ్గజం అయిన 'టాటా మోటార్స్' (Tata Motors) తన SUV లైనప్‌లో కొత్త కజిరంగా ఎడిషన్‌లను విడుదల చేసింది. ఇందులో టాటా పంచ్ (Tata Punch), టాటా నెక్సాన్ (Tata Nexon), టాటా హారియర్ (Tata Harrier) మరియు టాటా సఫారి (Tata Safari) మోడల్స్ ఉన్నాయి. భారతీయ విఫణిలో విడుదలైన ఈ కొత్త మోడల్ ఆధునిక అప్డేట్స్ పొందుతాయి. వీటి గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

టాటా కజిరంగా ఎడిషన్స్ యొక్క ధరల విషయానికి వస్తే..
టాటా పంచ్ కజిరంగా ఎడిషన్ (Tata Punch Kaziranga Edition):
టాటా పంచ్ కజిరంగా ఎడిషన్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
- క్రియేటివ్- రూ. 8.59 లక్షలు
- క్రియేటివ్ ఐఆర్ఏ- రూ. 8.89 లక్షలు
- క్రియేటివ్ ఏటి- రూ. 9.19 లక్షలు
- క్రియేటివ్ ఐఆర్ఏ ఏటి- రూ. 9.49 లక్షలు
- ఎక్స్‌జెడ్+ పెట్రోల్- రూ. 11.79 లక్షలు
- ఎక్స్‌జెడ్ఏ+ పెట్రోల్- రూ. 12.44 లక్షలు
- ఎక్స్‌జెడ్+ డీజిల్- రూ. 13.09 లక్షలు
- ఎక్స్‌జెడ్ఏ+ డీజిల్- రూ. 13.74 లక్షలు
- ఎక్స్‌జెడ్+: రూ. 20.41 లక్షలు
- ఎక్స్‌జెడ్ఏ+: రూ. 21.71 లక్షలు
- ఎక్స్‌జెడ్+ 7 సీటర్- రూ. 21.00 లక్షలు
- ఎక్స్‌జెడ్+ 6 సీటర్- రూ. 21.10 లక్షలు
- ఎక్స్‌జెడ్ఏ+ 7 సీటర్- రూ. 22.30 లక్షలు
- ఎక్స్‌జెడ్ఏ+ 6 సీటర్- రూ. 22.40 లక్షలు (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

టాటా నెక్సాన్ కజిరంగా ఎడిషన్ (Tata Nexon Kaziranga Edition):
టాటా నెక్సాన్ కజిరంగా ఎడిషన్ కూడా నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

టాటా హారియర్ కజిరంగా ఎడిషన్ (Tata Harrier Kaziranga Edition):
టాటా హారియర్ కజిరంగా ఎడిషన్ మాత్రం కేవలం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

టాటా సఫారీ కజిరంగా ఎడిషన్ (Tata Safari Kaziranga Edition):
టాటా సఫారీ కజిరంగా ఎడిషన్ కూడా మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

కంపెనీ ఇటీవల కాంలోనే 2022 IPL ఈవెంట్‌లో పంచ్ కజిరంగా ఎడిషన్‌ను ప్రదర్శించింది. ఇది కేవలం వేలం ద్వారా మాత్రమే విక్రయించబడుతుంది. అయితే దీని నుంచి వచ్చిన మొత్తాన్ని కంపెనీ అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో పరిరక్షణకు వినియోగిస్తుంది.

టాటా మోటార్స్ విడుదల చేసిన ఈ టాటా కజిరంగా ఎడిషన్స్ అన్ని కూడా ఒంటి కొమ్ము ఖడ్గమృగం నుండి ప్రేరణ పొందాయి. కావున ఈ SUV పైన ఈ చిహ్నం చూడవచ్చు. ఈ మోడల్స్ అన్ని కూడా అద్భుతమైన డిజైన్ పొందటమే కాకుండా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతాయి.

టాటా యొక్క కజిరంగా ఎడిషన్స్ అన్నీ కూడా ఒక ప్రత్యేకమైన కలర్ లో ఉంటాయి. ఇవి గ్రాస్‌ల్యాండ్ బీజ్ పెయింట్ కలర్ లోని రూప్, వీల్స్, వింగ్ మిర్రర్‌లు మరియు అన్ని ఇతర క్రోమ్ ట్రిమ్‌లకు కాంట్రాస్ట్ బ్లాక్-అవుట్ ట్రీట్‌మెంట్‌తో అందించబడ్డాయి. అంతే కాకుండా దాని ఫ్రంట్ ఫెండర్‌పై ‘కజిరంగా' అక్షరాలతో కూడిన ప్రత్యేక డోర్ స్కఫ్ ప్లేట్‌లను కూడా పొందుతాయి.

ఇక వీటి యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇవి డ్యూయల్-టోన్ స్కీమ్‌లతో బీజ్ లెథెరెట్ అపోల్స్ట్రే కలిగి, ఆల్-బ్లాక్ డ్యాష్‌బోర్డ్‌తో వస్తాయి. అయితే నెక్సాన్, హారియర్ మరియు సఫారీ డ్యాష్‌బోర్డ్ మధ్యలో వుడ్ ట్రిమ్స్ పొందుతాయి. కానీ టాటా పంచ్ మాత్రం బీజ్ ట్రై-యారో ఫినిషింగ్ పొందుతుంది.

వీటిలోని డోర్ ప్యాడ్‌లు మరియు సీట్ అపోల్స్ట్రే కూడా డ్యూయల్-టోన్ బ్లాక్ మరియు బ్రాంజ్ ట్రీట్‌మెంట్‌ను పొందుతాయి. ఈ నాలుగు మోడళ్ల ముందు సీటు హెడ్‌రెస్ట్‌లు మీద ఒక కొమ్ము గల ఖడ్గమృగం యొక్క సిల్హౌట్‌ను చూడవచ్చు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

ఇక ఇందులోని ఫీచర్స్ విషయానికి వస్తే, పంచ్ టాటా యొక్క iRA కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్‌ను పొందుతుంది. నెక్సాన్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు ఆటో-డిమ్మింగ్ IRVM వంటి వాటిని పొందుతుంది.

కొత్త టాటా హారియర్ మరియు సఫారీలు కూడా ఎయిర్ ప్యూరిఫైయర్, iRA కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లను కూడా పొందుతాయి. సఫారీ, గోల్డ్ ఎడిషన్ మోడల్‌ల మాదిరిగానే, వెంటిలేటెడ్ రెండవ వరుస సీట్లను కలిగి ఉంటుంది.

టాటా మోటార్స్ విడుదల చేసిన ఈ కొత్త మోడల్స్ యొక్క ఇంజిన్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు లేదు. కావున టాటా పంచ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, నెక్సాన్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌లతో కొనసాగుతుంది. ఇక టాటా హారియర్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ మరియు సఫారీ కూడా అదే 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ పొందుతుంది. ఇందులో గేర్‌బాక్స్ ఆప్సన్స్ కూడా మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటాయి, కావున మంచి పనితీరుని అందిస్తాయి.

మొత్తానికి టాటా కంపెనీ దేశీయ మార్కెట్లో కొత్త కజిరంగా ఎడిషన్స్ విడుదల చేసింది. కావున ఇకపైన ఇవి ఎలాంటి అమ్మకాలను పొందుతాయి. మార్కెట్లో తమ ఉనికిని చాటుకోగలవా అనే మరిన్ని విషయాలు త్వరలో తెలుస్తాయి.


Click it and Unblock the Notifications








