ఒకేసారి 250 టాటా ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్.. ఈ భారీ ఆర్డర్ ప్లేస్ చేసింది ఎవరో తెలుసా..?

భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో టాటా మోటార్స్ (Tata Motors) ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసినదే. సరసమైన ధరలకే ఎలక్ట్రిక్ కార్లను అందిస్తున్న ఏకైక కంపెనీగా టాటా మోటార్స్ ఇప్పుడు ఈ విభాగంలో ముందంజలో ఉంది. టాటా నుండి ప్రస్తుతం ప్యాసింజర్ వినియోగదారుల కోసం టిగోర్ ఈవీ (Tata Tigor EV), నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉండగా ఫ్లీట్ ఆపరేటర్ల కోసం ఎక్స్‌ప్రెస్-టి (Tata Xpress-T EV) ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంది.

ఒకేసారి 250 టాటా ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్.. ఈ భారీ ఆర్డర్ ప్లేస్ చేసింది ఎవరో తెలుసా..?

ఎలక్ట్రిక్ కార్ విభాగంలో టాటా మోటార్స్ పనితనాన్ని మెచ్చుకొని, అనేక ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్ల కోసం ఆర్డర్లను ప్లేస్ చేస్తున్నాయి. ఇటీవలే కేరళ రాష్ట్రం నుండి 65 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్ దక్కించుకున్న టాటా మోటార్స్, తాజాగా ఔరంగాబాద్ మిషన్ గ్రీన్ మొబిలిటీ (AMGM) కోసం 250 ఎలక్ట్రిక్ వాహనాలను సరఫరా చేసే ఆర్డర్‌ను దక్కించుకుంది. టాటా మోటార్స్ తెలిపిన సమాచారం ప్రకారం, ఈ 250 ఈవీ లలో 175 టాటా నెక్సాన్ ఈవీలు మరియు 75 టాటా టిగోర్ ఈవీలు ఉన్నాయి.

ఒకేసారి 250 టాటా ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్.. ఈ భారీ ఆర్డర్ ప్లేస్ చేసింది ఎవరో తెలుసా..?

దీన్నిబట్టి చూస్తుంటే, దేశంలో టాటా ఎలక్ట్రిక్ కార్లకు ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఔరంగాబాద్ నుండి టాటా మోటార్స్ దక్కించుకున్న ఈ ఆర్డర్ లో 250 ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీ రెండు దశలుగా ఔరంగాబాద్ మిషన్ గ్రీన్ మొబిలిటీకి డెలివరీ చేయనుంది. మొదటి దశలో భాగంగా, టాటా మోటార్స్ 70 టాటా నెక్సాన్ ఈవీలు మరియు 31 టాటా టిగోర్‌ ఈవీలను (మొత్తం 101 ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేస్తుంది. ఆ తర్వాతి దశలో మిగిలిన వాహనాలను డెలివరీ చేస్తుంది.

ఒకేసారి 250 టాటా ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్.. ఈ భారీ ఆర్డర్ ప్లేస్ చేసింది ఎవరో తెలుసా..?

భారతదేశపు నెంబర్ వన్ ఈవీ బ్రాండ్..

ప్రస్తుతం, టాటా మోటార్స్ భారతదేశంలోని ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో దాదాపు 87 శాతం మార్కెట్ వాటాతో దేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీదారుగా ఉంది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి టైర్ 1 నగరాల్లో Tata Nexon EV ఎలక్ట్రిక్ కారు డిమాండ్ అధికంగా ఉంటోంది. ఇందుకు ప్రధాన కారణం నెక్సాన్ ఈవీ అందిస్తున్న బ్యాటరీ రేంజ్ మరియు ఫీచర్లుగా చెప్పుకోవచ్చు. నెక్సాన్ ఈవీలో కంపెనీ 30.2 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 312 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది.

ఒకేసారి 250 టాటా ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్.. ఈ భారీ ఆర్డర్ ప్లేస్ చేసింది ఎవరో తెలుసా..?

అయితే, వాస్తవ ప్రపంచంలో ఈ ఎలక్ట్రిక్ కారును నడిపే తీరు, ప్రాంతం వంటి వివిధ అంశాలను బట్టి ఈ రేంజ్ మారుతూ ఉంటుంది. ఈ కారులో 127.23 bhp గరిష్ట పవర్ మరియు 245 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 3 ఫేజ్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ఉంటుంది. ఇది కారులోని ఆన్-బోర్డ్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. రద్దీగా ఉండే సిటీ ప్రాంతాలలో నిత్యం సంచరించే వారికి, చిన్నపాటి దూర ప్రయాణాలకు టాటా నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కారు చాలా ఆచరణీయంగా ఉంటుంది.

ఒకేసారి 250 టాటా ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్.. ఈ భారీ ఆర్డర్ ప్లేస్ చేసింది ఎవరో తెలుసా..?

ఫుల్ చార్జ్ పై 400 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేసే టాటా నెక్సాన్ ఈవీ వస్తోంది..

ఇదిలా ఉంటే టాటా నెక్సా ఈవీకి పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఇందులో ఓ లాంగ్ రేంజ్ వేరియంట్ ను మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కొత్తగా రాబోయే ఈ టాటా నెక్సాన్ ఈవీ కారులో కంపెనీ పెద్ద 40 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించనుంది. పెరిగిన బ్యాటరీ ప్యాక్ కారణంగా ఈ కారు బరువు కూడా సుమారు 100 కిలోలు పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ, ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 400 కిలోమీటర్లకు పైగా రేంజ్ ను ఆఫర్ చేస్తుందని అంచనా వేయబడింది.

ఒకేసారి 250 టాటా ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్.. ఈ భారీ ఆర్డర్ ప్లేస్ చేసింది ఎవరో తెలుసా..?

టాటా నెక్సాన్ ఈవీ వేరియంట్లు మరియు ధరలు..

ప్రస్తుతం, టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఈవీని మూడు వేరియంట్లలో (XM, XZ+, XZ+ Lux) విక్రయిస్తోంది. వీటితో పాటుగా కంపెనీ ఇటీవలే ఇందులో కొత్త డార్క్ ఎడిషన్ (Tata Nexon EV Dark Edition) ను కూడా పరిచయం చేసింది. ఈ డార్క్ కూడా రెండు వేరియంట్లలో లభిస్తుంది. మొత్తంగా నెక్సాన్ ఈవీ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వాటి ధరల వివరాలు ఉన్నాయి:

టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్ఎమ్ : రూ.14.54 లక్షలు

టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్‌జెడ్+ : రూ.15.95 లక్షలు

టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్‌జెడ్+ లగ్జరీ : రూ.16.95 లక్షలు

టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎక్స్‌జెడ్+ : రూ.16.29 లక్షలు

టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎక్స్‌జెడ్+ లగ్జరీ : రూ.17.15 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

ఒకేసారి 250 టాటా ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్.. ఈ భారీ ఆర్డర్ ప్లేస్ చేసింది ఎవరో తెలుసా..?

టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV) గురించి క్లుప్తంగా..

ఇక టిగోర్ ఈవీ సెడాన్ విషయానికి వస్తే, కంపెనీ గతేడాది చివర్లో ఇందులో ఓ కొత్త మోడల్ ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ ఎలక్ట్రిక్ కారు ధరలు రూ. 11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ఇది XE, XM మరియు XZ+ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ప్రస్తుతం, టాటా మోటార్స్ తయారు చేస్తున్న నెక్సాజన్ ఈవీ కోసం ఉపయోగించిన అదే జిప్‌ట్రాన్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగానే ఈ కొత్త టిగోర్ ఈవీని కూడా తయారు చేశారు. ఇందులో 26 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై 306 కిమీ సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది.

Article Published On: Wednesday, March 16, 2022, 14:28 [IST]
English summary
Tata motors gets orders for 250 evs as part of aurangabad mission green mobility
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+